Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness

Posted on 10/01/2026 By admin No Comments on అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness

డబ్బు లేకుండా జీవితం ఊహించలేం. కానీ డబ్బు ఉన్నా… ఆర్థిక భద్రత లేకపోవడం నేటి సమాజంలో పెద్ద సమస్యగా మారింది. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పని చేస్తున్నాం. జీతం వస్తోంది… వ్యాపారం సాగుతోంది… ఆదాయం పెరుగుతోంది. అయినా సరే, “భవిష్యత్తులో సరిపోతుందా?” “రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తాం?” అనే ఆందోళన చాలామందిని వెంటాడుతోంది. దానికి కారణం ఒక్కటే…డబ్బు సంపాదనపై దృష్టి ఉంది గానీ, డబ్బు నిర్వహణపై అవగాహన లేదు.

డబ్బు లక్ష్యం కాదు – సాధనం మాత్రమే.. Money Is a Tool, Not a Goal
చాలామంది డబ్బును లక్ష్యంగా భావిస్తారు. “ఎక్కువ సంపాదిస్తే చాలు” అనుకుంటారు. కానీ నిజానికి డబ్బు అనేది ఒక సాధనం (Tool). మంచి జీవితం కోసం.. భద్రత కోసం.. కుటుంబ అవసరాల కోసం.. గౌరవంగా జీవించడానికి డబ్బు అవసరం. అయితే, ఆ డబ్బును ఎలా ఉపయోగిస్తున్నామనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు.

 ఆర్థికంగా ఎందుకు వెనుకబడిపోతున్నారు? Why People Fail Financially?
చాలామంది జీవితాంతం పనిచేస్తారు. అయినా పదవీ విరమణ సమయానికి సరిపడా పొదుపులు ఉండవు. అప్పులు ఉంటాయి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే.. అపోహలతో కూడిన పెట్టుబడులే కారణం అవ్వొచ్చు. అదేవిధంగా భయం వల్ల అవకాశాలను వదిలేసుకోవ‌డం, అవగాహన లేకపోవడం , ప్లానింగ్ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వంటివి డబ్బు విషయంలో చేసే చిన్న తప్పులే.. ఇవే సంవత్సరాల తర్వాత పెద్ద నష్టాలుగా మారుతాయి.

 పొదుపే సంపద కాదు .. Only Saving Is Not Wealth..
“ఖర్చు తగ్గించు”.. “పొదుపు చెయ్యి”.. “డబ్బు దాచుకో” ఇవి అన్నీ మంచి మాటలే. కానీ… ఇవే సరిపోవు. పొదుపు అంటే ఏమిటంటే.. మీ ఆదాయంలో ఖర్చులు పోయాక మిగిలిన డబ్బు. కానీ ఆ డబ్బును అలాగే ఉంచితే…ద్రవ్యోల్బణం దానిని తినేస్తుంది. వాస్తవ విలువ తగ్గిపోతుంది అంటే పొదుపు మాత్రమే చేస్తే మీరు వెనక్కి వెళ్తున్నట్టే.

నిశ్శబ్ద శత్రువు ద్రవ్యోల్బణం..Inflation – The Silent Enemy.. 
ఈ రోజు రూ.100తో కొనే సరుకులను రేపు రూ.120 కొనుగోలు చేస్తుంటాం. ఇలా ఏటా జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 15 ఏళ్ల క్రితం సినిమా టికెట్: రూ.30.. ఇప్పుడు: రూ.200 పైబ‌డే ఉంది. డబ్బు విలువ తగ్గుతూనే ఉంది. అందుకే…డబ్బు పెరగకపోతే .. పొదుపు చేసినా.. డబ్బు ఉన్నట్టే కాదు.

ఎఫ్‌డీలే సరిపోతాయా? Is Fixed Deposit Enough? 
భారతీయ కుటుంబాల్లో ఎఫ్‌డీ అంటే భద్రత. పెళ్లి , రిటైర్మెంట్, భూమి అమ్మిన డబ్బుల‌న్నీ చాలామంది ఎఫ్‌డీల్లోనే పెడుతుంటారు. కానీ నిజం ఏమిటంటే…FD వడ్డీ: 6–7%. ద్రవ్యోల్బణం: 5–6%. పన్ను తర్వాత రాబడి ఇంకా తక్కువగానే ఉంటుంది. అంటే మీ డబ్బు పెరుగుతున్నట్టు కనిపించినా నిజానికి స్థిరంగానే ఉంది. FDలు మ‌న‌కు అత్యవసర అవసరాల కోసం, తక్కువకాల లక్ష్యాల కోసం, మానసిక భద్రత కోసం ఉపయోగపడతాయి. మొత్తం పొదుపులో 20–30% మాత్రమే FDల్లో ఉంచాలి.
Loan Is Not Always Bad.. అప్పు అంటే ఎప్పుడూ చెడ్డదేనా?
“అప్పు అంటే పాపం” అని మన సమాజంలో ఒక నమ్మకం. కానీ ఆర్థికంగా చూస్తే…అది పూర్తిగా తప్పు. Good Loan (మంచి రుణం), గృహ రుణం, వ్యాపార రుణం, విద్యా రుణం.. ఇవి భవిష్యత్తులో ఆదాయం లేదా ఆస్తిని సృష్టిస్తాయి.

చెడు రుణం..Bad Loan
క్రెడిట్ కార్డ్ బాకీలు, విలాసవంతమైన వస్తువుల కోసం అప్పులు, అధిక వడ్డీ వ్యక్తిగత రుణాలు .. ఇవి కేవలం ఖర్చును మాత్రమే పెంచుతాయి. అప్పు చెడ్డది కాదు అప్పు ఉపయోగం చెడ్డదైతేనే సమస్య.

బంగారం: భావోద్వేగమా? పెట్టుబడా? Gold – Emotion vs Investment ..
భారతీయులకు బంగారం అంటే ప్రేమ. పండుగలు… పెళ్లిళ్లు… శుభకార్యాలు…బంగారం లేకుండా ఊహించలేం. కానీ పెట్టుబడి విషయానికి వస్తే ఒక స్పష్టత అవసరం. ఆభరణాలు కొంటే మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్, పన్నులు ఉంటాయి. వాటిని అమ్మేటప్పుడు ధర తగ్గుతుంది. మేకింగ్ ఛార్జీలు రావు. అంటే ఇక్క‌డ మ‌న‌కు నష్టమే. పెట్టుబడి కోసం బంగారం కావాలంటే Sovereign Gold Bonds, Gold ETFs, Digital Goldలో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. ఇవి భద్రత + లిక్విడిటీ ఇస్తాయి.

స్టాక్ మార్కెట్ జూదం కాదు..Stock Market Is Not Gambling

స్టాక్ మార్కెట్ గురించి అత్యధిక అపోహలు ఉన్నాయి. నిజం ఏమిటంటే… అవగాహన లేకుండా చేస్తే అది జూదం. అవగాహనతో చేస్తే – సంపద సృష్టి. భారతదేశంలో లక్షల మంది మ్యూచువల్ ఫండ్స్, SIPల ద్వారా క్రమశిక్షణతో పెట్టుబడి పెడుతున్నారు. స్టాక్ మార్కెట్‌లో విజయం అంటే ఓర్పు, క్రమశిక్షణ, దీర్ఘకాల దృష్టి ఉండాలి. త్వరగా ధనవంతులు కావాలని ఆశిస్తే నష్టం త‌ప్ప‌దు.

బీమా పెట్టుబడి కాదు..Insurance Is Protection, Not Investment
బీమా గురించి చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీల్లో పెట్టుబడి పెడుతుంటారు. వాస్తవంగా వాటిల్లో రాబడి: 4–5%. లాక్-ఇన్ ఎక్కువ. ఫ్లెక్సిబిలిటీ తక్కువ. సరైన విధానంలో బీమా అంటే.. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. పెట్టుబడులను వేరే చోట పెట్టాలి. బీమా = భద్రత, పెట్టుబడి = సంపద.. ఈ రెండింటిని కలపకూడదు.

సంపదకు మూడు స్థంభాలు..Three Pillars of Wealth
సంపద నిర్మాణానికి మూడు కీలక అంశాలు:
– Earning – సంపాదించడం
– Saving – పొదుపు
– Investing – పెట్టుబడి.. ఈ మూడు సమతుల్యతలో ఉన్నప్పుడే ఆర్థిక స్వేచ్ఛ సాధ్యమవుతుంది.

రిటైర్మెంట్ ప్లానింగ్ ఎందుకు అవసరం? Retirement Planning Matters
చాలామంది అనుకుంటారు… “రిటైర్మెంట్ ఇంకా చాలా దూరంగా ఉంద‌ని”. కానీ సమయం వేగంగా గడుస్తుంది. రిటైర్మెంట్ తర్వాత జీతం ఉండదు. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. కాబట్టి ముందే ప్లాన్ చేయాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే SIPలు, పెన్షన్ పథకాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు ఇవ‌న్నీ చిన్న వయస్సులో మొదలుపెడితే రిటైర్మెంట్ స‌మ‌యానికి మ‌నపై ఆర్థిక‌ భారం త‌గ్గుతుంది.

పిల్లలకు డబ్బు అవగాహన.. Teach Kids About Money
మన పిల్లలకు… చదువు నేర్పుతున్నాం. కెరీర్ గురించి చెబుతున్నాం. కానీ డబ్బు గురించి మాత్రం మాట్లాడడం లేదు. ఫలితంగా పెద్దయ్యాక వారు ఖర్చులపై నియంత్రణ లేక‌.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేయాలి. అవసరం vs కోరిక, పెట్టుబడి భావన నేర్పాలి.

డ‌బ్బును నియంత్రించాలి.. Control Money, Don’t Let Money Control You
డబ్బు మన జీవితాన్ని నియంత్రించకూడదు…మనమే డబ్బును నియంత్రించాలి. అపోహలను వదిలి అవగాహనను అలవాటు చేసుకుంటే ఆర్థిక భద్రత తప్పదు. ఈ రోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలే రేపటి మీ జీవితాన్ని నిర్మిస్తాయి.

252
INVESTMENTS Tags:Bad Loan, Control Money, Don’t Let Money Control You, Gold – Emotion vs Investment .., Inflation – The Silent Enemy.., Insurance Is Protection, Is Fixed Deposit Enough?, Money Is a Tool, Not a Goal, Not Investment, Only Saving Is Not Wealth.., Retirement Planning Matters, Stock Market Is Not Gambling, Teach Kids About Money, Three Pillars of Wealth, Why People Fail Financially?

Post navigation

Previous Post: బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget
Next Post: ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted?

Related Posts

  • This is how to check for losses in the stock market స్టాక్ మార్కెట్‌లో న‌ష్టాల‌కు ఇలా చెక్ పెట్టండి FINICAL PLANNING
  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్ FEATURE NEWS
  • బ్యాంకు సేవింగ్ అకౌంట్లో డ‌బ్బులు ఉంచుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి Are you keeping money in a bank savings account FEATURE NEWS
  • ఎస్‌బీఐ ఎఫ్‌డీ .. రూ.2 లక్షల పెట్టుబడితో రూ.1 లక్షకు పైగా లాభం! SBI FD Bonanza: Earn Over ₹1 Lakh Profit with a ₹2 Lakh Investment INVESTMENTS
  • అమ్మాయికి ఇద్దాం ఆర్థిక భరోసా… చిన్న వయసులోనే పెద్ద భవిష్యత్తు నిర్మాణం .. Securing a Girl Child’s Financial Future – Smart Planning for Big Dreams FEATURE NEWS
  • ఆరోగ్య భద్రతకు కొత్త దారి: ‘ఎన్‌పీఎస్ స్వస్థ్య’.. NPS Swasthya.. A New Dimension to Retirement Planning FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ఆస్తులు సంపాదించడం కాదు… కాపాడుకోవడమే అసలు విజయం.. Wealth Creation is Not Enough… Preservation is the Real Success FEATURE NEWS
  • క్రెడిట్‌ కార్డును ఇలా వినియోగిస్తే.. లాభ‌మే! Credit Card Usage… Smart Use Unlocks Real Benefits FEATURE NEWS
  • రిస్క్ ఉన్నా మంచి రాబ‌డి అందించే పెట్టుబ‌డులు ఏమిటో తెలుసా? High-Risk, High-Return Investment Options FEATURE NEWS
  • భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఒక్క రోజులో రూ.6 వేలు త‌గ్గింపు.. Gold Prices Plunge Sharply ..Price Drops ₹6,000 in a Single Day FEATURE NEWS
  • HDFC కస్టమర్లకు గుడ్ న్యూస్..! తగ్గిన MCLRతో EMIలకు ఊరట … లోన్ తీసుకున్న వారికి పండగే! Good News for HDFC Customers..! EMI Relief as MCLR Rates Fall – A Treat for Borrowers! FEATURE NEWS
  • పిల్లల చదువు కోసం NPS వాత్సల్య సరైన ఎంపికేనా? Is NPS Vatsalya the Right Choice for Children’s Education? FEATURE NEWS
  • WHAT IS UPI CIRCLE  యూపీఐ సర్కిల్ గురించి తెలుసా FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme