సంపాదన వస్తే ఆనందం… అదే ఆదాయంపై పన్ను కట్టాల్సిన సమయం రాగానే చాలామంది ముఖంలో నవ్వు మాయమవుతుంది. “కష్టపడి సంపాదించిన డబ్బులో మళ్లీ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి?” అనే ప్రశ్న ప్రతి మధ్యతరగతి మనసులో తిరుగుతూనే ఉంటుంది. నెల జీతం పడగానే ముందు చేతికి వచ్చిన మొత్తం చూసి ఖుషీ… ఆ తర్వాత స్లిప్‌లో కనిపించే టిడిఎస్ (Tax Burden) చూసి బాధ! అయితే ఇలాంటి వారికోసమే అన్నట్లుగా మన దేశంలో కొన్ని ఆదాయాలను పూర్తిగా పన్ను పరిధి నుంచి మినహాయించారు. అవి చట్టబద్ధమైనవే… ప్రభుత్వమే ఇచ్చిన వెసులుబాట్లు. సరైన అవగాహన ఉంటే పన్ను భారం తగ్గించుకోవచ్చు, చట్టాన్ని అతిక్రమించకుండా ఆదాయాన్ని భద్రపర్చుకోవచ్చు. ఇలాంటి పన్ను పోటు లేని 10 ముఖ్యమైన ఆదాయాలు ఏవో… వాటికి ఉన్న షరతులు ఏంటో… ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
నేలతో నిబద్ధమైన ఆదాయం.. Agricultural Income – The Sacred Exemption
మన దేశంలో వ్యవసాయం కేవలం వృత్తి మాత్రమే కాదు… అది జీవన విధానం. రైతు పంట పండిస్తేనే దేశం ఆకలితో ఉండదు. అందుకే వ్యవసాయ ఆదాయాన్ని ఆదాయ పన్ను(Tax Burden) పరిధిలోకి తీసుకురాలేదు. వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేసి అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం, అదే భూమిని ఇతరులకు కౌలుకు ఇచ్చి పొందే ఆదాయం—ఇవన్నీ పూర్తిగా పన్ను మినహాయింపు పొందుతాయి. ఇందులో ఎలాంటి గరిష్ట పరిమితి కూడా లేదు. కానీ ఒక చిన్న విషయం చాలామందికి తెలియదు. మీ వ్యవసాయ ఆదాయం ఏడాదికి రూ.5,000కు మించి ఉండి, అదే సమయంలో ఇతర వనరుల ద్వారా వచ్చిన ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించితే… పన్ను శ్లాబు లెక్కించేటప్పుడు వ్యవసాయ ఆదాయాన్ని పాక్షికంగా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వ్యవసాయ ఆదాయంపై నేరుగా పన్ను మాత్రం ఉండదు.
భవిష్యత్‌కు భరోసా.. PPF – The Golden EEE Route
మధ్యతరగతి ఉద్యోగుల జీవితంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒక సురక్షిత దారి. ఈ పథకంలో పెట్టుబడి పెడితే… పెట్టుబడికి పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీపై పన్ను ఉండదు. మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదు. అంటే ఇది EEE (Exempt–Exempt–Exempt) కేటగిరీలోకి వస్తుంది. ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు లభిస్తుంది. 15 ఏళ్ల గడువు పూర్తయ్యాక చేతికి వచ్చే మొత్తం రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా మీ జేబులో పడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలో ఇది ఒక మూలస్తంభం.
ఉద్యోగి భవిష్యత్తు నిధి.. EPF Withdrawals – No Tax, If You Play by the Rules
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) అనేది జీతగాళ్లకు తప్పనిసరి పొదుపు. ఉద్యోగి, యజమాని ఇద్దరూ జమ చేసే ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో సహా… ఖాతా నుంచి వెనక్కి తీసుకునే మొత్తంపై పూర్తి పన్ను (Tax Burden)మినహాయింపు లభిస్తుంది. అయితే దీనికి ఒక ముఖ్యమైన షరతు ఉంది. ఉద్యోగి కనీసం ఐదేళ్లు నిరంతరంగా EPF సభ్యుడిగా ఉండాలి. ఈ నిబంధనను పాటిస్తే… విత్‌డ్రాయల్ సమయంలో ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రాబోయే కొత్త ఆదాయ చట్టంలోనూ ఈ నిబంధన కొనసాగనుంది.
ప్రేమతో ఇచ్చే బహుమతులు.. Gifts – When Relationships Matter More Than Rupees
తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు వంటి దగ్గరి బంధువుల నుంచి వచ్చే బహుమతులు, నగదు అయినా, ఆస్తి అయినా పూర్తిగా పన్ను (Tax Burden)మినహాయింపు పొందుతాయి. ఇందులో ఎలాంటి పరిమితి లేదు. అయితే బంధువులు కాని వ్యక్తుల నుంచి వచ్చే బహుమతుల విషయంలో జాగ్రత్త అవసరం. ఏడాదికి రూ.50,000 మించితే ఆ మొత్తాన్ని ఇతర ఆదాయంగా పరిగణించి పన్ను విధిస్తారు. స్థిరాస్తి బహుమతుల విషయంలో స్టాంప్ డ్యూటీ విలువ ఆధారంగా పన్ను లెక్కిస్తారు.
చదువుకు ప్రోత్సాహం.. Scholarships – Knowledge Should Never Be Taxed
విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లు పూర్తిగా పన్ను (Tax Burden)మినహాయింపు పొందుతాయి. ఇవి చదువు ఖర్చుల కోసం ఇచ్చే సహాయమే గనుక… ప్రభుత్వం వీటిపై పన్ను వేయదు. అయితే ఈ మినహాయింపు విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ భత్యాలు దీనిలోకి రావు.
తరతరాలకు బదిలీ అయ్యే సంపద.. Inheritance – Wealth Without Immediate Tax
వీలునామా ద్వారా లేదా వారసత్వంగా వచ్చే ఆస్తులపై పన్ను (Tax Burden)ఉండదు. ఇది చాలామందికి పెద్ద ఊరట. కానీ ఆ ఆస్తుల ద్వారా తర్వాత వచ్చే ఆదాయం—వడ్డీ, అద్దె, డివిడెండ్—మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే ఆస్తి పొందినప్పుడు పన్ను లేదు… కానీ ఆస్తి సంపాదించే ఆదాయానికి పన్ను తప్పదు.
బాలికల భవిష్యత్ కోసం.. Sukanya Samriddhi Yojana – Triple Tax Benefit
బాలికల భవిష్యత్ అవసరాల కోసం రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన కూడా EEE కేటగిరీలోకి వస్తుంది. పెట్టుబడికి, వడ్డీకి, మెచ్యూరిటీకి—మూడింటికీ పన్ను (Tax Burden)మినహాయింపు ఉంటుంది. ఇది తల్లిదండ్రులకు భద్రత… కుమార్తెలకు ఆర్థిక భరోసా.
ప్రభుత్వ హామీతో ఆదాయం.. Tax-Free Bonds – Safe and Silent Earners
ప్రభుత్వం లేదా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌పై వచ్చే వడ్డీకి పన్ను (Tax Burden)ఉండదు. స్థిరమైన ఆదాయం కోరుకునే పెట్టుబడిదారులకు ఇవి మంచి ఎంపిక.
సేవకు గుర్తింపు.. Gratuity – Respect Beyond Retirement
ప్రభుత్వ ఉద్యోగులకు అందే గ్రాట్యుటీ మొత్తానికి పూర్తిగా పన్ను (Tax Burden)మినహాయింపు ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగుల విషయంలో మాత్రం చట్టం ప్రకారం రూ.20 లక్షల వరకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది.
జీవిత బీమా భరోసా.. Life Insurance Maturity – Protection with Tax Relief
జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ అయినప్పుడు లేదా పాలసీదారుడు మరణించినప్పుడు చెల్లించే మొత్తం సాధారణంగా పన్ను మినహాయింపే(Tax Burden). కానీ ప్రీమియం, సమ్ అష్యూర్డ్ నిష్పత్తి వంటి షరతులు పాటించాలి. ఏదేమైనా పన్ను చెల్లించడం మన బాధ్యత… కానీ చట్టం ఇచ్చిన మినహాయింపులను సద్వినియోగం చేసుకోవాలి. సరైన అవగాహనతో ఆర్థిక ప్రణాళిక చేసుకుంటే… పన్ను భారం తగ్గుతుంది. పొదుపు పెరుగుతుంది. చట్టాన్ని గౌరవిస్తూ… సంపాదనను కాపాడుకోవడమే నిజమైన ఆర్థిక విజయం.
