Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

పన్ను భారం లేని ఆదాయాలేమిటో తెలుసా? Do You Know Which Incomes Are Free from Tax Burden?

Posted on 23/02/2026 By admin No Comments on పన్ను భారం లేని ఆదాయాలేమిటో తెలుసా? Do You Know Which Incomes Are Free from Tax Burden?

సంపాదన వస్తే ఆనందం… అదే ఆదాయంపై పన్ను కట్టాల్సిన సమయం రాగానే చాలామంది ముఖంలో నవ్వు మాయమవుతుంది. “కష్టపడి సంపాదించిన డబ్బులో మళ్లీ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి?” అనే ప్రశ్న ప్రతి మధ్యతరగతి మనసులో తిరుగుతూనే ఉంటుంది. నెల జీతం పడగానే ముందు చేతికి వచ్చిన మొత్తం చూసి ఖుషీ… ఆ తర్వాత స్లిప్‌లో కనిపించే టిడిఎస్ (Tax Burden) చూసి బాధ! అయితే ఇలాంటి వారికోసమే అన్నట్లుగా మన దేశంలో కొన్ని ఆదాయాలను పూర్తిగా పన్ను పరిధి నుంచి మినహాయించారు. అవి చట్టబద్ధమైనవే… ప్రభుత్వమే ఇచ్చిన వెసులుబాట్లు. సరైన అవగాహన ఉంటే పన్ను భారం తగ్గించుకోవచ్చు, చట్టాన్ని అతిక్రమించకుండా ఆదాయాన్ని భద్రపర్చుకోవచ్చు. ఇలాంటి పన్ను పోటు లేని 10 ముఖ్యమైన ఆదాయాలు ఏవో… వాటికి ఉన్న షరతులు ఏంటో… ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

నేలతో నిబద్ధమైన ఆదాయం.. Agricultural Income – The Sacred Exemption
మన దేశంలో వ్యవసాయం కేవలం వృత్తి మాత్రమే కాదు… అది జీవన విధానం. రైతు పంట పండిస్తేనే దేశం ఆకలితో ఉండదు. అందుకే వ్యవసాయ ఆదాయాన్ని ఆదాయ పన్ను(Tax Burden) పరిధిలోకి తీసుకురాలేదు. వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేసి అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం, అదే భూమిని ఇతరులకు కౌలుకు ఇచ్చి పొందే ఆదాయం—ఇవన్నీ పూర్తిగా పన్ను మినహాయింపు పొందుతాయి. ఇందులో ఎలాంటి గరిష్ట పరిమితి కూడా లేదు. కానీ ఒక చిన్న విషయం చాలామందికి తెలియదు. మీ వ్యవసాయ ఆదాయం ఏడాదికి రూ.5,000కు మించి ఉండి, అదే సమయంలో ఇతర వనరుల ద్వారా వచ్చిన ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించితే… పన్ను శ్లాబు లెక్కించేటప్పుడు వ్యవసాయ ఆదాయాన్ని పాక్షికంగా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వ్యవసాయ ఆదాయంపై నేరుగా పన్ను మాత్రం ఉండదు.

భవిష్యత్‌కు భరోసా.. PPF – The Golden EEE Route
మధ్యతరగతి ఉద్యోగుల జీవితంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒక సురక్షిత దారి. ఈ పథకంలో పెట్టుబడి పెడితే… పెట్టుబడికి పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీపై పన్ను ఉండ‌దు. మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండ‌దు. అంటే ఇది EEE (Exempt–Exempt–Exempt) కేటగిరీలోకి వస్తుంది. ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు లభిస్తుంది. 15 ఏళ్ల గడువు పూర్తయ్యాక చేతికి వచ్చే మొత్తం రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా మీ జేబులో పడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలో ఇది ఒక మూలస్తంభం.

ఉద్యోగి భవిష్యత్తు నిధి.. EPF Withdrawals – No Tax, If You Play by the Rules
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) అనేది జీతగాళ్లకు తప్పనిసరి పొదుపు. ఉద్యోగి, యజమాని ఇద్దరూ జమ చేసే ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో సహా… ఖాతా నుంచి వెనక్కి తీసుకునే మొత్తంపై పూర్తి పన్ను (Tax Burden)మినహాయింపు లభిస్తుంది. అయితే దీనికి ఒక ముఖ్యమైన షరతు ఉంది. ఉద్యోగి కనీసం ఐదేళ్లు నిరంతరంగా EPF సభ్యుడిగా ఉండాలి. ఈ నిబంధనను పాటిస్తే… విత్‌డ్రాయల్ సమయంలో ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రాబోయే కొత్త ఆదాయ చట్టంలోనూ ఈ నిబంధన కొనసాగనుంది.

ప్రేమతో ఇచ్చే బహుమతులు.. Gifts – When Relationships Matter More Than Rupees
తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు వంటి దగ్గరి బంధువుల నుంచి వచ్చే బహుమతులు, నగదు అయినా, ఆస్తి అయినా పూర్తిగా పన్ను (Tax Burden)మినహాయింపు పొందుతాయి. ఇందులో ఎలాంటి పరిమితి లేదు. అయితే బంధువులు కాని వ్యక్తుల నుంచి వచ్చే బహుమతుల విషయంలో జాగ్రత్త అవసరం. ఏడాదికి రూ.50,000 మించితే ఆ మొత్తాన్ని ఇతర ఆదాయంగా పరిగణించి పన్ను విధిస్తారు. స్థిరాస్తి బహుమతుల విషయంలో స్టాంప్ డ్యూటీ విలువ ఆధారంగా పన్ను లెక్కిస్తారు.

చదువుకు ప్రోత్సాహం.. Scholarships – Knowledge Should Never Be Taxed
విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లు పూర్తిగా పన్ను (Tax Burden)మినహాయింపు పొందుతాయి. ఇవి చదువు ఖర్చుల కోసం ఇచ్చే సహాయమే గనుక… ప్రభుత్వం వీటిపై పన్ను వేయదు. అయితే ఈ మినహాయింపు విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ భత్యాలు దీనిలోకి రావు.

తరతరాలకు బదిలీ అయ్యే సంపద.. Inheritance – Wealth Without Immediate Tax
వీలునామా ద్వారా లేదా వారసత్వంగా వచ్చే ఆస్తులపై పన్ను (Tax Burden)ఉండదు. ఇది చాలామందికి పెద్ద ఊరట. కానీ ఆ ఆస్తుల ద్వారా తర్వాత వచ్చే ఆదాయం—వడ్డీ, అద్దె, డివిడెండ్—మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే ఆస్తి పొందినప్పుడు పన్ను లేదు… కానీ ఆస్తి సంపాదించే ఆదాయానికి పన్ను తప్పదు.

బాలికల భవిష్యత్ కోసం.. Sukanya Samriddhi Yojana – Triple Tax Benefit
బాలికల భవిష్యత్ అవసరాల కోసం రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన కూడా EEE కేటగిరీలోకి వస్తుంది. పెట్టుబడికి, వడ్డీకి, మెచ్యూరిటీకి—మూడింటికీ పన్ను (Tax Burden)మినహాయింపు ఉంటుంది. ఇది తల్లిదండ్రులకు భద్రత… కుమార్తెలకు ఆర్థిక భరోసా.

ప్రభుత్వ హామీతో ఆదాయం.. Tax-Free Bonds – Safe and Silent Earners
ప్రభుత్వం లేదా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌పై వచ్చే వడ్డీకి పన్ను (Tax Burden)ఉండదు. స్థిరమైన ఆదాయం కోరుకునే పెట్టుబడిదారులకు ఇవి మంచి ఎంపిక.

సేవకు గుర్తింపు.. Gratuity – Respect Beyond Retirement
ప్రభుత్వ ఉద్యోగులకు అందే గ్రాట్యుటీ మొత్తానికి పూర్తిగా పన్ను (Tax Burden)మినహాయింపు ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగుల విషయంలో మాత్రం చట్టం ప్రకారం రూ.20 లక్షల వరకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది.

జీవిత బీమా భరోసా.. Life Insurance Maturity – Protection with Tax Relief
జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ అయినప్పుడు లేదా పాలసీదారుడు మరణించినప్పుడు చెల్లించే మొత్తం సాధారణంగా పన్ను మినహాయింపే(Tax Burden). కానీ ప్రీమియం, సమ్ అష్యూర్డ్ నిష్పత్తి వంటి షరతులు పాటించాలి. ఏదేమైనా ప‌న్ను చెల్లించడం మ‌న‌ బాధ్యత‌… కానీ చట్టం ఇచ్చిన మినహాయింపులను సద్వినియోగం చేసుకోవాలి. సరైన అవగాహనతో ఆర్థిక ప్రణాళిక చేసుకుంటే… పన్ను భారం తగ్గుతుంది. పొదుపు పెరుగుతుంది. చట్టాన్ని గౌరవిస్తూ… సంపాదనను కాపాడుకోవడమే నిజమైన ఆర్థిక విజయం.

133
FINICAL PLANNING Tags:Agricultural Income – The Sacred Exemption, EPF Withdrawals – No Tax, Gifts – When Relationships Matter More Than Rupees, Gratuity – Respect Beyond Retirement, If You Play by the Rules, Inheritance – Wealth Without Immediate Tax, Life Insurance Maturity – Protection with Tax Relief, PPF – The Golden EEE Route, Scholarships – Knowledge Should Never Be Taxed, Sukanya Samriddhi Yojana – Triple Tax Benefit, Tax-Free Bonds – Safe and Silent Earners

Post navigation

Previous Post: టారిఫ్ లు రద్దు.. స్టాక్ మార్కెట్లు, బంగారం, వెండి ధరలపై ప్రభావం ఎలా ఉంటుందంటే? Tariffs Scrapped: How Will Stock Markets, Gold, and Silver Prices Be Impacted?
Next Post: తల్లిదండ్రులకు అద్దె చెల్లిస్తే HRA మినహాయింపు ఉంటుందా? Will You Get HRA Exemption If You Pay Rent to Your Parents?

Related Posts

  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks FEATURE NEWS
  • అమ్మో.. అన్ని బ్యాంకు అకౌంట్లా how many bank accounts can a person have FEATURE NEWS
  • ఒక‌రికి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండాలి..? FINICAL PLANNING
  • క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించండి.. ఆర్థిక సమస్యలను ముందుగానే గుర్తించండి.. Check Your Credit Report… Identify Financial Problems Early FEATURE NEWS
  • 15*15*15 రూల్‌తో రూల్‌తో ఆర్థిక స్వేచ్ఛ how to get financial freedom with 15*15*15*  law FINICAL PLANNING
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option FINICAL PLANNING

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • మీ ఆలోచ‌నే మీ ఆస్తి Your thoughts are your property FEATURE NEWS
  • బర్త్‌డే గిఫ్ట్‌గా మ్యూచువల్ ఫండ్? కొత్త ఆలోచనకు సెబీ శ్రీకారం .. Mutual Funds as Birthday Gifts? A New Investment Culture Emerges MUTUAL FUNDS
  • స్టాక్ మార్కెట్ కెరియ‌ర్‌ బాగుంటుందాcan i choose stock market as a carrier FEATURE NEWS
  • జీతం తక్కువైనా.. పెద్ద మొత్తంలో లోన్ పొంద‌డం సాధ్యమేనా? బ్యాంకులు ఏం చూస్తాయి? Can You Get a Big Loan Even with a Low Salary? What Banks Actually Check FEATURE NEWS
  • భారీ మార్పులు.. సెప్టెంబర్ 15 వ‌ర‌కు ఐటీఆర్ ఫైలింగ్ Changes in ITR Filing 2025-26 FEATURE NEWS
  • ట్రంప్‌ వ్యాఖ్యలతో ఊపందుకున్న మార్కెట్లు.. Markets Rally on Trump’s Remarks MARKET
  • చిత్ర రామ‌కృష్ణ @ అదృశ్య యోగి-అవినీతి క‌థ‌ The Story of the Chitra Ramakrishna MARKET
  • హోం లోన్ కాదు… గృహ నిర్మాణ రుణంతో సొంతింటి కలను నిజం చేసుకోవ‌చ్చ‌ని తెలుసా? Dreaming of Your Own House? Not Just a Home Loan… Consider a Construction Loan! FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme