పది సంవత్సరాలయ్యాక ప్రతి నెలా పదివేలు ఎలా How about ten thousand every month after ten years
how we get monthly ten thousand after ten years
* SIP Mitra Fund తో ప్రతి నెలా స్థిర ఆదాయం
* నెలకు పదివేలు పెడితే పదేళ్ల తర్వాత నుంచి జీవితాంతం ఆదాయం
మ్యూచువల్ ఫండ్స్‌లో లాభాలు చూడవచ్చన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదో కొత్త విధానం. ఇది sip, swp కాంబినేషన్ లో ఒక ఫైనాన్షియల్ ప్రొసీజర్. పదేళ్లపాటు నెలకు పదివేలు పెడుతూ పోతే అక్కడినుంచి ప్రతినెలా పదివేలు చొప్పున జీవితాంతం పొందవచ్చు. ఇదేమీ అసాధ్యం కాదు, వాస్తవ దూరం కూడా కాదు. ఎలాగో తెలుసుకుందాం.
what is sip mitra
మనం కొంతకాలం పాటు సిప్‌ద్వారా invest చేసేసి అక్కడితో ఆపేసి మనం ఎలాగైతే సిస్టమేటిక్ గా ప్రతి నెలా ఇన్వెస్ట్ చేశామో అలాగే ప్రతి నెలా సిస్టమేటిక్ గా మీరు కొంత డబ్బును వెనక్కి తీసుకోవడాన్నే Sip mitra అంటారు. మనం ప్రతి నెలా 10,000 రూపాయిలు చొప్పున 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో ప్రతి నెలా ఆ డబ్బును వెనక్కి SWP ద్వారా తీసుకోవచ్చు.
పదిహేనేళ్లైనా చేసుకోవచ్చు…
ఒక వ్యక్తి నెలకు 10,000 Sip చేస్తున్నాడు. ఇలా 15 ఏళ్ళ పాటు చేశాడు. అది 12 శాతం రిటర్న్ ఇస్తుంది. కానీ మీరు వెనక్కి తీసుకోకుండా దాని నుంచి నెలకు కొంత డబ్బును SWP ట్రిగ్గర్ చేయండి. SWP అంటే సిస్టమేటిక్ విత్ డ్రా ప్లాన్. మొదటి మ్యూచువల్ ఫండ్ లో మీరు ఎంతైనా విత్ డ్రా చేయవచ్చు. అలా కాకుండా సిస్టమేటిక్ గా నాకు ప్రతి నెలా ఇంతే కావాలి అని ఒక రిక్వెస్ట్ ఇవ్వండి. పైన చెప్పనట్టు 8 ఏళ్ల పొదుపు తర్వాత తీసుకుంటే కేవలం పెట్టిన పదివేలు మాత్రమే సాధ్యమవుతుంది. 12 ఏళ్ల సిప్ తర్వాత అయితే 30 వేలు సాధ్యమవుతుంది.
ఎలా సాధ్యం..
మీరు Sip చేస్తున్న టైం లో ప్యూర్ ఈక్విటీ ఫండ్ ని ఎంచుకుంటాం. 15 సంవత్సరాల పాటు Sip లో ఉంటే మార్కెట్ లో వాలటాలటీ వల్ల సుమారు 12 శాతం రిటర్న్ వచ్చిందనుకుందాం. ఇలా చేయడం వల్ల మీకు 50 లక్షల వరకూ జమ అవుతుంది. ఇది ఇలానే ఈక్విటీ ఫండ్‌లో ఉంటే వాలటాలిటీ వల్ల మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. కాబట్టి దీన్ని కాబట్టి దీన్ని సరైన స్థిరమైన ఫండ్‌లోకి ఎస్బీఐ వాళ్లు మార్చేలా సూచిస్తారు.what is hybrid equity fund
* హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ అంటే డెట్ + ఈక్విటీ
డెట్ అండ్ ఈక్విటీ వల్ల మనకు రిస్క్ కాస్త తగ్గుతుంది. రిటర్న్ కూడా తగ్గుతుంది. మీరు 50 లక్షల రూపాయలు ఈక్విటీ ఫండ్ లో పెట్టారు. మీకు సంవత్సరానికి సుమారు 10 శాతం రిటర్న్ వస్తుంది.
అంటే మీరు పెట్టిన 50లక్షలకు 10 శాతం రిటర్న్ సంవత్సరానికి వస్తుంది. అంటే 5 లక్షలు వస్తుంది. దీన్ని విభజస్తే సుమారు 40 వేల రూపాయలు నెలకు వస్తుంది. కానీ మనం SWP ప్లాన్‌కు కేవలం 30 వేలు మాత్రమే కావాలని రిక్వస్ట్ పెట్టుకోవడం వల్ల మిగిలిన ఆదాయం అక్కడే జమ అవుతుంది. ఇక్కడ మార్కెట్ తో సంబంధం లేదు. మార్కెట్ ఎలా ఉన్నా మనకు రావాల్సిన 30 వేలు మనకు వస్తుంది. ఆదాయం జీవితాంతం పొందవచ్చు.
మీరు 10,000 రూపాయిలు నెలకు Sip mitraలో 15 సంవత్సరాలు పెడితే అక్కడినుంచి ప్రతి నెలా 30,000 లైఫ్ టైమ్ వచ్చేస్తుంది. దీనికి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. పదో లేదా ఇరవై ఏళ్ల తర్వాత ఇక చాలు అనుకుంటే పొదుపు చేసిన 50 లక్షలను కొంత ఆదాయంతో కలిపి తీసేసుకోవచ్చు.
Leave a Reply