
How to invest in Foreign stocks
ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో మనమంతా ప్రధానంగా మనకు తెలిసిన పెద్ద పెద్ద ఇండియన్ కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంటాం. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ లో కేవలం ఇండియన్ కంపెనీలే లిస్ట్ అయి ఉంటాయి. కానీ పెద్ద పెద్ద విదేశీ కంపెనీల్లో మాత్రం పెట్టుబడి పెట్టాలనుకుంటే కుదిరే పని కాదు. సరిగ్గా ఇలాంటి అవకాశాన్ని కల్పించేందుకు ఎన్ ఎస్ ఈ ముందుకు వచ్చింది. ప్రముఖ విదేశీ స్టాక్స్‌ని ఎంచుకుని ట్రేడ్ చేయవచ్చు.
NSE helps to invest in Foreign stocks
NSE సంస్థ 03-03-2022 నుంచి US STOCKS లో ట్రేడింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
ముఖ్యంగా 8 యూఎస్ కంపెనీలు ట్రేడ్ అవ్వడం మొదలవుతాయి.What are The best foreign stocks to invest
– AMAZON
– META FLATFORMS
– NET FLIX
– APPLE
– WALMART
– TESLA
– MICROSOFT
వీటిలో ట్రేడింగ్ అనేది 8PM కి మొదలై మరుసటి రోజు 2.30 AM ముగుస్తుంది.
NSE, IFSC వాళ్ళు యూఎస్ కి సంబంధించిన స్టాక్స్ కొంటారు. ఉదాహరణకి ఆల్పా బేట్ (గూగుల్) షేర్ ఇండియన్ రూపీ ప్రకారం దాదాపుగా 2 లక్షలు ఉంటుంది. కానీ రిటైలర్లు ఇంత మదుపు పెట్టడం ఇబ్బందికరంగా అనుకోవచ్చు. అందుకే దీనిని కస్టోడియన్ బ్యాంకులో ఉంచుతారు. అ కస్టోడియన్ బ్యాంకు ద్వారా డిపాజిటర్స్ రిసిప్ట్స్ కావల్సిన షేర్స్ కి సంబంధించి ఇష్యూ చేస్తారు. ఈ షేర్స్ ని 200 భాగాలుగా విడదీస్తారు. అప్పుడు ఒక్కొక్క భాగాన్ని మనం ఎంచుకొని కొనుక్కోవచ్చు. అంటే 1000 రూపాయిలకు కూడా మనం షేర్స్ ని కొనుక్కోవచ్చు.
దీనిలో ఎంత వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చనేదానికి RBI లిమిట్ పెట్టింది. RBI పద్దతి ప్రకారం ఇతర దేశాల్లో 2 లక్షల 50 వేల డాలర్ల వరకు అంటే దాదాపుగా ఇండియన్ కరెన్సీ ప్రకారం 2 కోట్ల వరకు ఒక్క సంవత్సరానికి గాను మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. కాకపోతే మొత్తం కార్యకలాపాలన్ని డాలర్స్ లలో చేయాల్సి ఉంటుంది.