
మొట్టమొదట ఇళ్లు కొనడం.. తరువాత నచ్చిన బంగారు ఆభరణాలు కొనడం వంటివి భావోద్వేగాలకు సంబంధించిన విషయం. మనలో చాలా మంది ముందుగా వీటికే ప్రాధాన్యం ఇస్తారు. వీటిలో ఉండే రిస్క్, రాబడి, లిక్విడిటీ, పన్ను వంటివి పరిగణలోకి తీసుకోకుండా తొందర పడి నిర్ణయాలు తీసుకుంటారు. విపరీతమైన నమ్మకంతో ఇలా గుడ్డిగా ముందుకు వెళ్లిపోతారు. ఇలా చేస్తే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే వీటిలో స్థిరమైన రాబడి ఉండదు.. లిక్విడిటీ కూడా తక్కువే. మనం అనుకున్న సమయానికి డబ్బు అందుకోలేకపోచ్చు. అయితే వీటిని పూర్తిగా విస్మరించాలా అంటే వద్దనే చెప్తాం. కాకపోతే వీటికి తగిన సమయం, సందర్భం, మనకు ఉన్న ఆర్థిక పరిజ్ఞానం, మన అవసరాలు ఆధారంగా వీటి విషయంలో మనం నిర్ణయం తీసుకోవాలి.
profit on gold is low
బంగారం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉంటుంది కానీ వీటిపై ఎలాంటి డివిడెండ్, లేదా వడ్డీకానీ లభించదు. అంతర్జాతీయ కమోడిటీస్ ఆధారంగా వీటి ధరలు మారుతుంటాయి. ఇక స్థిరాస్తి పెట్టుబడుల్లో లిక్విడిటీ సమస్యలు, లావాదేవీలు, రుసుములు అధికంగా ఉంటాయి. ఆక్రమణలు, రిజిస్ట్రేషన్ సమస్యలు సరేసరి. అయితే దీనిపై వచ్చే రాబడి విషయంలో కూడా కొంచెం తేడాలు ఉంటాయి. స్థిరాస్తిలో రాబడులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నా దానికి పెట్టుబడులు కూడా అధిక మొత్తంలో అవసరం అవుతాయి.
liquidity in gold is low
ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభించిన వారు, తక్కువ జీతం పొందే ఉద్యోగులు, కనీస అవగాహన లేని వారు, కుటుంబ బాధ్యతలు అధికంగా ఉన్నవారు ఇలాంటి వాటి విషయానికి పోకపోవడమే మేలు. ఎందుకంటే మనకు అవసరం వచ్చిన వెంటనే బంగారం కానీ స్థిరాస్తిని అమ్మడానికి కుదరదు. అందుకే పెట్టుబడి ప్రణాళికలో దీన్ని చేర్చుకోకపోవడమే మేలు.
తొలిరోజుల్లోనే ఈ రకమైన పెట్టుబడులు పెడితే మన ఆర్థిక లక్ష్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. మన కనీస అవసరాలు, కుటుంబ అవసరాలు తీర్చడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు.
స్వల్ప కాలిక, సమీప కనీస అవసరాలు తీరిన తరువాత దీర్ఘకాలిక లక్ష్యాల కోసం వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
- మీ పోర్టిఫోలియోలో మొత్తం పెట్టుబడులు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. రిస్క్, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా వాటిని క్రమబద్ధీకరించుకోండి. మిగిలిన పొదుపు పథకాలు, పెట్టుబడులు అన్నింటినీ సమీక్షించుకుని అప్పుడు బంగారం, స్థిరాస్తి పెట్టుబడులవైపు ద్రుష్టి మల్లించాలి. అత్యవసర నిధి, జీవిత భీమా, ఆరోగ్య రక్షణకు బీమా, పొదుపు, కుటుంబ సమీప లక్ష్యాలు ఇవన్నీ మన పోర్టిఫోలియోలో చేర్చిన తరువాత మిగిలిన వాటి గురించి ఆలోచించాలి. మన పోర్టిఫో లియోలో బంగారం, స్థిరాస్తి పెట్టుబడులు 20 నుంచి 30 శాతం మించకుండా చూసుకుంటే మంచిది.
- కేవలం ఇష్టంతోనో, భావోద్వేగాలతోనో బంగారం కొనడానికి ప్రయత్నించవద్దు. ఇన్వెస్ట్మెంట్ ని భవిష్యత్తు ప్రయోజనాలు, లాభాలు అన్న దృష్టితో మాత్రమే చూడాలి. అందుకు సరైన మార్గాలను ఎంచుకోవాలి.