
third party insurance increases from april 1st
సాధారణంగా మన వాహనాలకు బీమా ఉంటుంది. అందులో థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. అయితే ఈ బీమా రేట్లను ఇకపై పెంచేందుకు కేంద్రం ప్రణాళిక రచిస్తోంది. కేంద్ర రోడ్ రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదనలను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉం ది.
* 1000 సీసీ ప్రేవేటు కార్లకు రూ. 2072 నుంచి 2,094కు ప్రీమియం పెరిగింది.
* 1000 సీసీ నుంచి 1500 సీసీ మధ్య ఉన్న ప్రవేటు కార్లకు రూ. 3221 నుంచి రూ.3,416కు పెరగనుంది.
* 150 -350 సీసీ ద్విచక్ర వాహనాలకు రూ.1,366 ప్రీమియం, ఆ పైన వాటికి రూ.2,804 వసూలు చేస్తారు.
third party insurence decreases on electric vehicles
ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు..
ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం… ఎలక్ట్రిక్ ప్రవేటు కార్లు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ వాణిజ్య, పాసింజర్ వాహనాలకు 15 శాతం ఇంకా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు 7.5 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. 30 KW మించని ఎలక్ట్రిక్ ప్రవేటు కార్లకు రూ.1,780 ప్రీమియం, 30-65 KW కార్లకు రూ.2,904 ప్రీమియం వర్తిస్తుంది.
కరోనా కారణంగా రెండేళ్ళ పాటు మారటోరియం విధించారు. అంతక్రితం బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్ డీఏఐ ఈ టీపీ రేట్లను నోటిఫై చేసేది. ఐఆర్ డీఏఐ తో చర్చించి టీపీ రేట్లను రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఇప్పుడు ప్రతిపాదిస్తోంది.