Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

ఇక‌పై సెబీ తనిఖీలు, దర్యాప్తుల‌కు గ‌రిష్ఠ కాలపరిమితి ఎనిమిదేళ్లే.. SEBI Inspections and Investigations Capped at Eight Years

Posted on 22/12/202522/12/2025 By admin No Comments on ఇక‌పై సెబీ తనిఖీలు, దర్యాప్తుల‌కు గ‌రిష్ఠ కాలపరిమితి ఎనిమిదేళ్లే.. SEBI Inspections and Investigations Capped at Eight Years

సెక్యూరిటీస్ మార్కెట్‌ను నియంత్రించే సెబీ (SEBI) అధికారాలకు కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. తాజాగా ప్రవేశపెట్టిన ఎస్‌ఎంసీ (SMC) బిల్లు ద్వారా సెబీ చేపట్టే తనిఖీలు, దర్యాప్తులకు గరిష్ఠంగా 8 ఏళ్ల కాలపరిమితిను నిర్ణయించింది. ఇప్పటివరకు స్పష్టమైన గడువు లేకపోవడంతో, పాత కేసులపై కూడా దర్యాప్తులు కొనసాగుతుండేవి. ఈ కొత్త నిబంధన అమలుతో ఇకపై ఎనిమిదేళ్లు దాటిన లావాదేవీలపై సెబీ కొత్తగా విచారణలు ప్రారంభించే అవకాశం ఉండదు. దీంతో మార్కెట్‌లో ఉన్న అనిశ్చితి కొంత మేరకు తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.

మార్కెట్‌ వర్గాలకు ఊరట..Relief for Market Participants
కాలపరిమితితో పాటు, నిర్దేశిత సమయంలోగా నియమావళి అమలును కూడా ఈ బిల్లు(SMC)లో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు(SMC)తో మార్కెట్‌ వర్గాలకు నియంత్రణపరమైన ఇబ్బందులు తగ్గుతాయని విశ్లేషకులు అంటున్నారు. పాత వ్యవహారాలపై నోటీసులు, విచారణలతో ఇన్వెస్టర్లు, కంపెనీలు ఇబ్బంది పడేవి. ఇప్పుడు కాలపరిమితి ఉండటం వల్ల వ్యాపార వాతావరణం మరింత పారదర్శకంగా మారుతుందని అంచనా.

పాత కేసులకు కచ్చితత్వం..Legal Certainty for Old Cases
(SMC) ఎనిమిదేళ్ల కాలపరిమితి వల్ల పాత లావాదేవీలకు చట్టపరమైన కచ్చితత్వం వస్తుందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పాత కేసులతో సంస్థలను నిరవధికంగా వెంటాడకుండా ఉండేలా ఇది సహకరిస్తుందని పేర్కొన్నాయి.

సెబీపై భారం పెరుగుతుందా? Will the Burden on SEBI Increase?
(SMC) దర్యాప్తును కాలపరిమితిలో పూర్తిచేయడం, అంబుడ్స్‌మన్‌ విధానాన్ని అమలు చేయడం వంటి మార్పుల కోసం సెబీకి అదనపు మానవ వనరులు అవసరమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం సామర్థ్యాలను పుంచుకోవడం, తగిన శిక్షణ పొందిన సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.మొత్తంగా చూస్తే, ఎస్‌ఎంసీ బిల్లు ద్వారా మార్కెట్‌ నియంత్రణలో స్పష్టత, మదుపర్లకు భద్రత, వ్యాపార వాతావరణానికి స్థిరత్వం తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

పెట్టుబడిదారుల్లో పెర‌గ‌నున్న‌ నమ్మకం ..Growing Investor Confidence
(SEBI)నియంత్రణ సంస్థ అధికారాలకు స్పష్టమైన హద్దులు ఉండటం వల్ల పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం. అదే సమయంలో సెబీ తన అధికారాలను సమర్థవంతంగా, సమయానికి వినియోగించాల్సిన బాధ్యత కూడా మరింత పెరుగుతుందని పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే, ఎస్‌ఎంసీ (smc)బిల్లు ద్వారా నియంత్రణ – స్వేచ్ఛ మధ్య సమతౌల్యం సాధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

మూడు చట్టాల స్థానంలో ఎస్‌ఎంసీ..SMC to Replace Three Laws
సెక్యూరిటీల మార్కెట్‌ నియంత్రణలో సమగ్ర మార్పులకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత వారం లోక్‌సభలో సెక్యూరిటీస్‌ మార్కెట్స్‌ కోడ్‌ (ఎస్‌ఎంసీ -SMC) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తదుపరి విస్తృత సంప్రదింపుల కోసం ఈ బిల్లును స్టాండింగ్‌ కమిటీకి పంపించింది. ఈ బిల్లు చట్టమైతే.. ప్రస్తుతం అమలులో ఉన్న మూడు సెక్యూరిటీల చట్టాలను ఏకీకృతం చేసి, వాటి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఇందులో భాగంగా 1956 సెక్యూరిటీస్‌ కాంట్రాక్ట్స్‌ (నియంత్రణ) చట్టం, 1992 సెబీ చట్టం, 1996 డిపాజిటరీల చట్టంలను భర్తీ చేయనుంది.

సెబీ మిగులుపై కొత్త నిబంధన..New Rule on SEBI’s Surplus
ఎస్‌ఎంసీ (SMC)బిల్లులో సెబీ ఆర్థిక వ్యవహారాలపై కూడా స్పష్టమైన నిబంధనలు పొందుపరిచారు. దీని ప్రకారం, సెబీ తన వార్షిక మిగులులో 25 శాతాన్ని రిజర్వ్‌ ఫండ్‌గా ఖర్చుల కోసం కేటాయించాలి. మిగిలిన మొత్తాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియాకు బదిలీ చేయాల్సి ఉంటుంది.

సమగ్ర చట్టం దిశగా అడుగు..A Step Towards a Comprehensive Law
మూడు వేర్వేరు చట్టాల స్థానంలో ఒకే సమగ్ర చట్టాన్ని(SMC) తీసుకురావడం ద్వారా నియంత్రణ వ్యవస్థను సరళీకరించడం, నిబంధనల్లో స్పష్టత తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో మార్కెట్‌ వర్గాలకు అనిశ్చితి తగ్గడంతో పాటు, అమలులో ఒకే విధమైన నియమాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే, ఎస్‌ఎంసీ బిల్లు ద్వారా సెక్యూరిటీల మార్కెట్‌ నియంత్రణకు ఒకే చట్రం తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.

కాలపరిమితులు ఇలా..Timelines Explained
సెక్యూరిటీల మార్కెట్‌లో నియంత్రణకు స్పష్టత తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సెక్యూరిటీస్‌ మార్కెట్స్‌ కోడ్‌ (ఎస్‌ఎంసీ) బిల్లులో సెబీ (SEBI) అధికారాలకు కచ్చితమైన కాలపరిమితులను నిర్దేశించింది. ఈ బిల్లు(SMC) ప్రకారం, ఒక చర్యకు సంబంధించి దిశానిర్దేశం ఎనిమిదేళ్లకు ముందే జరిగితే, దానిపై సెబీ కొత్తగా తనిఖీ లేదా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉండదు. దీంతో పాత లావాదేవీలపై నిరవధిక విచారణలకు చెక్‌ పడనుంది. బిల్లు (SMC)ప్రకారం, సెబీ చేపట్టే దర్యాప్తును 180 రోజుల్లోగా పూర్తిచేయాలి. ఏదైనా కారణంతో జాప్యం జరిగితే, అందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరమైతే పూర్తికాల సభ్యుడి (Whole-Time Member) నుంచి దర్యాప్తు కాలపరిమితి పొడిగింపును కోరవచ్చు.

మధ్యంతర ఉత్తర్వులకు గడువు..Time Limit for Interim Orders
మధ్యంతర ఉత్తర్వుల విషయంలోనూ బిల్లు(SMC) స్పష్టత తీసుకొచ్చింది. ఈ ఉత్తర్వుల కాలవ్యవధిని 180 రోజులకు పరిమితం చేసింది. అయితే, తీర్పు లేదా తనిఖీ, దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉంటే, అటువంటి మధ్యంతర ఉత్తర్వులను గరిష్ఠంగా రెండు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. ఈ కాలపరిమితుల వల్ల సెబీ దర్యాప్తులు కాలం తెలియకుండా సాగకుండా ఉండే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే సమయంలో సంస్థలు, మదుపర్లకు న్యాయపరమైన స్పష్టత లభిస్తుందని పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే, ఎస్‌ఎంసీ (SMC)బిల్లులోని ఈ నిబంధనలు సెబీలో క్రమశిక్షణ, పారదర్శకతను తీసుకువచ్చే దిశగా ఉన్నాయి.

అంబుడ్స్‌పర్సన్‌తో మదుపర్లకు రక్షణ..Investor Protection Through an Ombudsperson
మదుపర్ల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సెక్యూరిటీస్‌ మార్కెట్స్‌ కోడ్‌ (ఎస్‌ఎంసీ) బిల్లులో అంబుడ్స్‌పర్సన్‌ వ్యవస్థకు స్పష్టమైన రూపకల్పన చేసింది. ఈ బిల్లు చట్టమైతే.. సెబీ (SEBI) తన అధికారుల్లో ఒకరిని లేదా అవసరమైతే ఒకరికి మించిన అధికారులను అంబుడ్స్‌పర్సన్‌లుగా నియమించుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా పెట్టుబడిదారుల సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని అంచనా.

ఫిర్యాదులే ప్రధాన బాధ్యత..Handling Complaints as Primary Responsibility
అంబుడ్స్‌పర్సన్‌ ప్రధాన బాధ్యతగా మదుపర్ల ఫిర్యాదులను స్వీకరించడం, పరిశీలించడం, పరిష్కరించడం ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. మార్కెట్‌లో మదుపర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఫిర్యాదులు కూడా అధికమయ్యే అవకాశం ఉండటంతో, సెబీకి అదనపు సిబ్బంది అవసరం ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఎలా పరిష్కారం? Current Mechanism for Resolution
ప్రస్తుతం మదుపర్ల ఫిర్యాదులను సెబీ నిర్వహిస్తున్న స్కోర్స్‌ (SCORES), ఓడీఆర్‌ (ODR) ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పరిష్కరిస్తున్నారు. అయితే, ఈ రెండు స్థాయుల్లో ఇప్పటికే భారీగా కేసులు పేరుకుని ఉన్నాయి. ఇప్పుడు వీటికి అంబుడ్స్‌పర్సన్‌ ఆదేశాలు కూడా జతకావడంతో, వ్యవస్థపై భారం మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

శాట్‌పై అదనపు భారం? Additional Burden on SAT?
అంబుడ్స్‌పర్సన్‌ ఇచ్చే ఆదేశాలపై అప్పీలు చేసుకునే అవకాశం ఉండటంతో, సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌)పై కూడా కేసుల భారం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే, అంబుడ్స్‌పర్సన్‌ వ్యవస్థ ద్వారా మదుపర్లకు న్యాయం త్వరగా అందించాలన్న ఉద్దేశం ఉన్నప్పటికీ, దానికి తగిన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

 

265
FEATURE NEWS Tags:A Step Towards a Comprehensive Law, Additional Burden on SAT?, Current Mechanism for Resolution, Growing Investor Confidence, Handling Complaints as Primary Responsibility, Investor Protection Through an Ombudsperson, Legal Certainty for Old Cases, New Rule on SEBI’s Surplus, Relief for Market Participants, SMC to Replace Three Laws, Time Limit for Interim Orders, Timelines Explained, Will the Burden on SEBI Increase?

Post navigation

Previous Post: ఏఐ సూచ‌న‌ .. జీతానికి ర‌క్ష‌! AI Guidance… A Shield for Your Salary!
Next Post: ఆప‌ద‌ స‌మ‌యాల్లో కుటుంబానికి ఆర్థిక ర‌క్ష‌ణ క‌ల్పించాలంటే..? How to Provide Financial Protection to Family in Times of Crisis?

Related Posts

  • Unclaimed Deposits  లెక్క తేల్చండి..!   “మీ డబ్బు – మీ హక్కు”  గురించి తెలుసుకోండి!  Check Your Unclaimed Deposits! Learn About “Your Money – Your Right”! FEATURE NEWS
  • ఇప్ప‌టివ‌ర‌కు క్రెడిట్ హిస్టరీ లేదా? అయితే ఇలా చేయండి! If You Don’t Have a Credit History Yet, Do This! FEATURE NEWS
  • అమెరికా సుంకాల పిడుగుపాటు.. సోలార్‌ షేర్లకు షాక్ ! US Tariff Shock on Indian Solar Stocks FEATURE NEWS
  • రోజుకు రూ.500 పొదుపు.. 20 ఏళ్లలో రూ.1.48 కోట్ల నిధి! Save ₹500 a Day, Build ₹1.48 Crore in 20 Years! FEATURE NEWS
  • వృద్ధాప్య భద్రతకు ప్రభుత్వ భరోసా.. అటల్ పెన్షన్ యోజనతో నెల‌వారీ ఆదాయం.. Government Support for Old-Age Security: Monthly Income with Atal Pension Yojana FEATURE NEWS
  • 10 ఏళ్లలో రూ. కోటి కావాలంటే ఎంత SIP చేయాలి? How Much SIP Do You Need to Make ₹1 Crore in 10 Years? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • గేర్ మార్చిన రిల‌య‌న్స్‌ reliance business strategy NEWS
  • అదానీపై హిండెన్ బ‌ర్గ్ ఆరోప‌ణ‌లేమిటి What is Hindenburg’s allegation against Adani FEATURE NEWS
  • అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుకు చెక్‌! MONEY TIPS
  • జీతం తక్కువైనా.. పెద్ద మొత్తంలో లోన్ పొంద‌డం సాధ్యమేనా? బ్యాంకులు ఏం చూస్తాయి? Can You Get a Big Loan Even with a Low Salary? What Banks Actually Check FEATURE NEWS
  • డిజిటల్‌ లెండింగ్‌ యాప్‌లు.. జ‌ర‌భ‌ద్రం..! Digital Lending Apps.. Beware! Convenience or Financial Trap! FEATURE NEWS
  • ₹10 లక్షల పెట్టుబడితో ₹4.85 కోట్లు .. ఎలా సాధ్యం అనుకుంటున్నారా! How ₹10 Lakh Investment Grew to ₹4.85 Crore! FEATURE NEWS
  • 20 ఏళ్లకే ఆర్థిక స్థిరత్వం సాధ్యమేనా? యువత కోసం ఐదు బంగారు సూత్రాలు! Is Financial Stability Possible at 20? Five Golden Rules for Youth! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme