పీఎఫ్ వ‌డ్డీ త‌గ్గుద‌ల‌.. మ‌హా దారుణం

మ‌నంద‌రికీ తెలిసిన ప‌దం పీఎఫ్. ఉద్యోగుల‌కు జీవితానికి భ‌రోసా ఇచ్చేదే పీఎఫ్‌. దీంతోనే ఉద్యోగులు రిటైర్ అయిన త‌ర్వాత హాయిగా బ‌తక‌గ‌లుగుతారు. ఎందుకంటే అన్ని పొదుపు ప‌థ‌కాల‌కంటే పీఎఫ్‌లోనే ఎక్కువ వ‌డ్డీ వ‌స్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ ఇప్ప‌డు ఆ వ‌డ్డీ రేట్ల‌లో కోత ఇప్ప‌డు ఖాతాదారుల‌ను తీవ్రంగా వేధిస్తోంది. ఆ విష‌యాన్ని ఓ సారి చూద్దాం.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ప్ర‌భుత్వం 8.1 శాతానికి తగ్గించింది. తాజా సవరణలో భాగంగా ఇప్పటి వరకు 8.5 శాతంగా ఉన్న వడ్డీరేటును 8.1 శాతానికి సవరించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటును 8.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించింది. 65 మిలియన్ల యాక్టివ్ ఈపీఎఫ్ఓ సబ్ స్కైబర్లకు ఇది చేదు వార్త. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఎంప్లాయీస్ బేసిక్ శాలరీ నుంచి 12 శాతం , సంస్థ నుంచి 12 శాతం పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది.

అంటే ఇలా..
ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి, యజమాని వాటా, ఈపీఎస్ పేరిట మూడు భాగాలు ఉంటాయి. ఈపీఎస్ భవిష్యత్తు పెన్సన్ నిధి. దీనిపై ఎలాంటి వడ్డీ ఉండదు. పీఎఫ్ ఖాతాలో జీతం నుంచి చెల్లించే నిర్భంధ చందాతో పాటు స్వచ్చందంగా చెల్లించే పీఎఫ్ చందా కలిసి ఉంటాయి. యజమాని వాటాలో ఈపీఎఫ్ చందాను తీసివేయగా మిగతా మొత్తాన్ని యజమాని ఖాతాలో ఉంటుంది. ఉద్యోగి, యజమాని ఖాతాలోకి మొత్తానికి కలిపి మొత్తానికి ఈపీఎఫ్ఓ వడ్డీ చెల్లిస్తుంది. ఒక ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో కంపెనీ ఉద్యోగ వాటా కలిసి రూ.1 లక్ష ఉంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.5శాతం ప్రకారం ఏడాదికి రూ.8839 వడ్డీ జమ అవుతుంది. అయితే ఈ ఏడాది 8.1 శాతం అంటే రూ.8407 జమ అవుతుంది. అంటే రూ.432 తగ్గుతుంది.

కార్మిక సంఘాలు 8.5 శాతం వడ్డీ రేటు అతి తక్కువని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు దీనిని 8.1 శాతానికి సవరించడంతో మరింతగా మండిపడుతున్నాయి. 43 ఏళ్ళ తర్వాత ఇదే అతి తక్కువ వడ్డీరేటు. 1952 లో ఈ పథ‌కం అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది 70 ఏళ్ళు పూర్తవుతుంది. ఖాతాదారుల‌నుంచి వచ్చిన మొత్తాన్ని ఈక్విటీ, బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై వచ్చే లాభాన్ని వడ్డీగా చందాదారుల ఖాతాల్లో ప్ర‌భుత్వం జమ చేస్తుంది.

* 1977-78 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆ స్థాయికి రాలేదు. ఈ 43 ఏళ్ళలో 2010-11 అర్థక సంవత్సరంలో 9.5 శాతం ఉండేది. 2013-14 నాటికి 8.45 శాతానికి తగ్గించారు.

గతంలో ఈపీఎఫ్ఓ బోర్డు సొంత నిర్ణయాలు తీసుకునేది. గత 12 ఏళ్ళుగా ఆర్థిక శాఖ సూచనలు మేరకు వడ్డీలు ఖరారవుతున్నాయి. ఈపీఎఫ్ఓలో ఇచ్చే వడ్డీ రేటు చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్లతో పోల్చితే ఎక్కువ‌గానే ఉంది. దీంతో శాలరైడ్ పీఎఫ్ స్కీమ్స్ వైపు అదనపు సేవింగ్స్ కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పెట్టుబడులను నియంత్రించేందుకు ఈ ఏడాది నుంచి రూ.2.5లక్షలు దాటితే ఆ మొత్తం పై వడ్డీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు.

Author photo
Publication date:
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *