
Do you know about UPI Circle?
ప్రస్తుత రోజుల్లో డిజిటల్ చెల్లింపులు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. రోజురోజుకూ ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. అయితే యూపీఐ సేవలను మరింత విస్తరించే క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా యూపీఐ సర్కిల్ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటీ యూపీఐ సర్కిల్ ఫీచర్.? దీనిని ఎలా యాక్టివ్ చేసుకోవాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. అయితే బ్యాంక్ అకౌంట్ లేని వారు యూపీఐ పేమెంట్స్ చేయాలంటే ఎలా.? ఇలాంటి వారికి ఉపయోగపడేలా యూపీఐ సర్కిల్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ కుటుంబసభ్యులు, స్నేహితులను సెకండరీ యూజర్లుగా యాడ్ చేసుకోవచ్చు. దీంతో ప్రైమరీ యూజర్ బ్యాంక్ అకౌంట్ నుంచి వారు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ప్రైమరీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఇందుకోసం లిమిట్ కూడా సెట్ చేసుకోవచ్చు.
* ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు పాకెట్ మనీ ఇచ్చేందుకు, సీనియర్ సిటీజెన్లకు సాయం చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. సెకండరీ యూజర్ గరిష్టంగా ఎంత వరకు ఖర్చు చేయొచ్చనేది ప్రైమరీ యూజర్ సెట్ చేసుకోవచ్చు. ఇక సెకండరీ యూజర్స్ ఏయే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రైమరీ యూజర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు.
* ప్రస్తుతం యూపీఐ సర్కిల్ నెలవారీ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 15 వేలుగా ఉంది. ఒక్క ట్రాన్సాక్షన్ గరిష్ఠ లిమిట్ రూ. 5వేలు. అంతేకాదు ప్రైమరీ యూజర్ యాడ్ చేసిన 24 గంటల వరకు సెకండరీ యూజర్ కేవలం రూ. 5వేలు మాత్రమే బదిలీ చేయగలరు.
* కాలేజీల్లో చదివే పిల్లలకు చేతి ఖర్చుల్ని ఇక మీదట క్యాష్ రూపంలో ఇచ్చే బదులుగా.. యూపీఐ సర్కిల్ వినియోగించుకునేలా దీనిని ప్రోత్సహించొచ్చు. ఇంట్లో పనిచేసే వారిని.. డ్రైవర్లు వంటి వారిని ఇలా సర్కిల్‌లో చేర్చడం ద్వారా ఇంటి ఖర్చులు, పెట్రోల్ వంటి వాటికి చేసే పేమెంట్స్ వివరాల్ని కూడా కచ్చితంగా తెలుసుకోవచ్చు.
Five people can use UPI circle
ఈ యూపీఐ సర్కిల్ సదుపాయాన్ని ఐదుగురు వరకూ ఉపయోగించుకోవచ్చు. అంటే ప్రైమరీ యూజర్ అనే వాడు ఐదు మంది సెకండరీ యూజర్స్‌కి ఇలా తన యూపీఐ ని వాడుకునే వెసులుబాటు ఇవ్వవచ్చు. అంటే బ్యాంక్ అకౌంట్ లేకున్నా ఒకేసారి ఐదుగురు దీనిని వాడొచ్చు.
ఎలా యాక్టివేట్ చేసుకోవాలి
How to activate UPI circle
* ప్రస్తుతం గూగుల్ పే, BHIM APPS లో ఈ ఆప్షన్ ఉంది. భవిష్యత్‌లో మిగతా APPSలో కూడా ఈ అప్‌డేట్ రాబోతుంది.
* ఇందుకోసం ముందుగా యూపీఐ యాప్స్‌లో కనిపించే ‘యూపీఐ సర్కిల్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* అనంతరం సెకండరీ యూపీఐ ఐడీని ఎంటర్ చేయాలి. లేదా వారి యూపీఐ యాప్‌ను ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఫోన్ నెంబర్ ద్వారా కూడా యాడ్ చేసుకోవచ్చు.
* ఆ తర్వాత ‘స్పెండ్ విత్ లిమిట్స్’, ‘అప్రూవ్ ఎవ్రీ పేమెంట్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని అనుమతులు ఇవ్వాలి.
* వెంటనే సెకండరీ యూజర్‌కి రిక్వెస్ట్ ఆమోదించాలని నోటిఫికేషన్ వెళ్తుంది.
* అనుమతులు ఇచ్చిన వెంటనే ప్రైమరీ యూజర్ అకౌంట్ నుంచి సెకండరీ యూజర్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.
* ఇందులో గరిష్ఠంగా ఐదుగురిని మాత్రమే యాడ్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు.. For example..
మీ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఆసుపత్రికి వెళ్లారనుకుందాం. వారికి మీరు ఖర్చుల కింద రూ.5000 ఇచ్చారు. అయితే ఆసుపత్రిలో TESTలు , మందులు తదితర వాటికి అవి ఖర్చయిపోయాయి. తిరిగి రూ.2వేలు చెల్లించాలి. వెంటనే మీ కుటుంబ సభ్యులు మీకు ఫోన్ చేసినా మీరు అందుబాటులోకి రాలేని సందర్భాల్లో ఈ యూపీఐ సర్కిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యూపీఐ సర్కిల్ ద్వారా మీ ఖాతా నుంచి వారు చెల్లింపులు చేసుకోవచ్చు. అయితే దీనికి కూడా ఓ లిమిట్ ఉంది.
యూపీఐ సర్కిల్ అంటే ఏమిటంటే.. What is UPI Circle
యూపీఐ సర్కిల్ అనేది ఒక డెలిగేటెడ్ పేమెంట్ ఫీచర్. దీని ద్వారా ఒక ప్రైమరీ యూపీఐ యూజర్, తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తులకు (సెకెండరీ యూజర్లకు) పేమెంట్స్ చేసే బాధ్యతను అప్పగించడానికి వీలవుతుంది. అంతేకాదు ప్రైమరీ యూజర్, సెకెండరీ యూజర్లకు ఫుల్ యాక్సెస్ ఇవ్వవచ్చు. లేదా పాక్షికంగా పేమెంట్స్ చేసే అవకాశం మాత్రమే ఇవ్వవచ్చు. అంతేకాదు వారు చేసే ఆర్థిక లావాదేవీలను కూడా ప్రైమరీ యూజర్ కంట్రోల్ చేయవచ్చు. ఈ విధానం వల్ల మరింత ఎక్కువగా, సురక్షితంగా యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతుందని ఎన్పీసీఐ చెబుతోంది.
యూపీఐ సర్కిల్‌లో 2 రకాల యూజర్లు ఉంటారు.
There are 2 types of users in UPI circles
1. ప్రైమరీ యూజర్ Primary User
2. సెకెండరీ యూజర్ Secondary user
ప్రైమరీ యూజర్ యూపీఐ సర్కిల్‌ను ప్రారంభిస్తాడు. డెలిగేషన్ను కూడా కంట్రోల్ చేయగలుగుతాడు. ప్రైమరీ యూజర్ తన యూపీఐ అకౌంట్‌ను మేనేజ్ చేయడానికి, తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తులను నియమించుకుంటాడు. వీరినే సెకెండరీ యూజర్లు అంటారు. వీరు పాక్షికంగా లేదా పూర్తి స్థాయిలో యూపీఐ చెల్లింపులు చేయడానికి అనుమతి ఇస్తాడు. అది ఎలాగో ఇప్పుడు మరింత వివరంగా చూద్దాం.
ఫుల్ డెలిగేషన్.. Full delegation
ప్రైమరీ యూజర్, ముందే నిర్దేశించిన మొత్తం వరకు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి సెకెండరీ యూజర్లకు అనుమతి ఇస్తాడు. కనుక ఆ పరిమితి వరకు సెకెండరీ యూజర్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా పేమెంట్స్ చేయగలుగుతారు. ఇందుకోసం ప్రతిసారీ ప్రైమరీ యూజర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనినే ఫుల్ డెలిగేషన్ అని అంటారు.
పార్శియల్ డెలిగేషన్.. Partial Delegation
సెకెండర్ యూజర్లు నిర్దేశిత మొత్తం వరకు యూపీఐ లావాదేవీలు చేయగలుగుతారు. కానీ ప్రతి లావాదేవీకి ప్రైమరీ యూజర్ అథంటికేషన్ అవసరం అవుతుంది. అంటే ప్రైమరీ యూజర్ - యూపీఐ పిన్ను ఎంటర్ చేస్తేనే, సెకెండరీ యూజర్లు చేసిన లావాదేవీలు ఎగ్జిక్యూట్ అవుతాయి.