బ్యాంకులు ఇచ్చే డెబిట్ కార్డులు( ఏటీఎం) ద్వారా మనం డబ్బులు విత్డ్రా చేస్తుంటాం. ఆ కార్డులను జాగ్రత్తగా భద్ర పరుచుకుని, వాటిని మన వెంట తీసుకువెళ్లి ఏటీఎం మిషన్లో డబ్బులు విత్డ్రా చేసుకోవాలి. ఒకే వేళ కార్డుమర్చిపోతే అంతే సంగతులు. కానీ కార్డులేకపోయినా డబ్బులు విత్డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించాలని ఆర్బీఐ సూచిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ ద్వారా అన్నీ ఏటీఎంలలో కార్డు లేకుండా నగదు ఉపసంహరణలను అందుబాటులో ఉంచాలి. కార్డ్ స్కిమ్మింగ్, క్లోనింగ్ వంటి మోసాలను నివారించడానికి ఇదే మార్గమని ఆర్బీఐ తెలిపింది.
ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఓటీపీ ఆధారంగా డబ్బులు విత్డ్రా చేసుకునేలా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) వంటివి ఓటీపీతో కార్డు లేకపోయినా కొద్ది మొత్తంలో నగదు విత్ డ్రా సేవలను అందిస్తున్నాయి. అయితే, యూపీఐ ద్వారా అన్నీ బ్యాంకులు తమ ఏటీఎం వద్ద ఈ సేవలను అందించాలని ఆర్బీఐ భావిస్తోంది.
how to withdraw money with UPI number
యూపీఐతో విత్ డ్రా ఇలా..
* మొదటి విధానంలో మనం ఏటీఎం టర్మినల్ వద్ద అవసరమైన వివరాలను ఎంటర్ చేస్తే , ఏటీఎం క్యూ ఆర్ కోడ్ ను అందిస్తుంది. వినియోగదారుడు తమ ఫోన్ లోని యూపీఐ యాప్ ద్వారా క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి అభ్యర్థనను ఆమోదించాల్సి ఉంటుంది. అటు తర్వాత ఏటీఎం నుంచి డబ్బులను తీసుకోవచ్చు.
* రెండో విధానంలో ఏటీఎం వద్ద వినియోగదారులు తమ యూపీఐ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత వినియెగదారుడి మొబైల్ ఫోన్ లోని యూపీఐ యాప్ కు అభ్యర్థన వస్తుంది. యూపీఐ యాప్ పాస్ వర్డ్ ని ఉపయోగించి లావాదేవీని ఆమోదిస్తారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.
అయితే ఈ సేవలు అన్ని బ్యాంకులు అందించేందుకు కొంత సమయం పట్టవచ్చు. వీటికి అదనపు చార్జీలు బ్యాంకులు వసూలుచేస్తాయి.
బాగుంది.. అన్ని చోట్ల పెడితే బాగుంటుంది
thank you