
ప్రపంచ కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తున్న వారంతా భారతీయులే. అతి పెద్ద, అత్యంత మార్కెట్ విలువ గల కంపెనీలకు భారతీయ పురుషులే సీఈవోలుగా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరికి ఏ మాత్రం తీసి పోకుండా భారతీయ మహిళలు కూడా అత్యంత విజయవంతమైన కంపెనీలకు కీలక బాధ్యతలు వహిస్తున్నారు. వారిలో కొంతమంది గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.
indian female ceos of world best companies
Revathi Advaithi
రేవతి అద్వైతి ప్రపంచంలో అతి పెద్ద కంపెనీలలో ఒకటైన ఫ్లెక్స్ CEO. అమెరికాలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ మేనుఫేక్చురింగ్ కంపెనీ ఫ్లెక్స్. ఫిబ్రవరి 2019 లో CEO బాధ్యతలను స్వీకరించారు. ఈమె భారతదేశంలో పుట్టి, పిలానీలోని బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో మెకానికల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.
Sharmistha Dubey
అమెరికాలోని ఇంటర్‌నెట్ అండ్ టెక్నాలజీ కంపెనీ అయిన `మ్యాచ్` గ్రూప్‌కు శర్మిష్ట దూబే గ్రూప్ CEO. ఈమె జంషెడ్ పూర్ లో పుట్టి పెరిగింది. ఈమె 2020 లో కంపెనీ CEOగా బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినిరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.
Reshma Kewalramani
రేష్మా కేవల్రమణి 2017లో అమెరికన్ బయో ఫార్మా స్యూటికల్ కంపెనీ అయిన వెర్టెక్స్ ఫార్మా స్యూటికల్స్ CEO గా చేరారు. ఈమె బొంబాయిలో జన్మించారు.
Sonia Syngal
సోనియా సింగల్ ప్రపంచ వ్యాప్తంగా దుస్తులు ఉపకరణాల రిటైలర్ సంస్థ Gap Inc.కు 2016లో CEO బాధ్యతలు స్వీకరించారు. ఈమె భారతదేశంలో పుట్టి కెనడా, యునైటెడ్ స్టేట్స్ లో పెరిగారు. ఈమె స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.
Jayshree Ullal
జయశ్రీ ఉల్లాల్ కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ `అరిస్టా నెట్ వర్క్స్`కు 2008 నుంచి ప్రెసిడెంట్, CEO గా పనిచేస్తున్నారు. ఈమె లండన్ లో పుట్టి, డిల్లీలో పెరిగి శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశారు.
Padmasree Warrior
పద్మశ్రీ వారియర్ ఫేబుల్ లో CEO గా పనిచేస్తున్నారు. ఆమె సిస్కో, మోటరోలా కంపెనీల్లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా కూడా పనిచేశారు. ఈమె విజయవాడలో పుట్టారు. కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు.
Priya Lakhani
ప్రియ లకానీ సెంచరీ టెక్ వ్యవస్థాపకులు, CEO. ఈమె 2014లో OBE అవార్డును అందుకున్నారు. ఈమె భారతీయ తల్లిదండ్రులకు జన్మించి, UK లో పెరిగారు. ఈమె యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందారు.
Leena Nair
లీనా నాయర్ ఫ్రెంచ్ లగ్జరీ హౌస్ సంస్థ `చానెల్` కి CEO గా ఎంపికయ్యారు. ఈమె మహారాష్ట్రలోని కొల్హాపూర్ కి చెందినవారు. ఈమె ముందుగా హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ లో మేనేజ్మెంట్ విభాగంలో పనిచేశారు.
Ankiti Bose
అంకితి బోస్ అతి పెద్ద కంపెనీ అయిన B2B ఇ-కామర్స్ కంపెనీలలో ఒకటైన జిలింగో CEO. ఆమె డెహ్రడూన్ లో పుట్టి, ముంబైలో పెరిగారు. ఈమె సెయింట్ జేవియర్స్ లో గణితం, ఆర్థికశాస్త్రాలను అభ్యసించింది.
Falguni Nayar
ఫల్గుణి నాయర్ బ్యూటీ స్టార్టప్ Nykaa వ్యవస్థాపకులు.. CEO గానూ సేవలందిస్తున్నారు. Nykaa సంస్థ షేర్లు భారీగా 89 శాతానికి పెరగడంతో, నాయర్ ఆస్తుల విలువ ఇప్పుడు $6.5 బిలియన్లు. Nykaa దేశ వ్యాప్తంగా 80 రిటైల్ స్టోర్ లను కలిగి ఉంది.