
how much government share in LIC after IPO
LIC ఐపీవోకు రానున్న విషయం తెలిసిందే. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం తన వాటాను విక్రయించి నిధులను వెనక్కు తీసుకోవాలనుకుంటున్నట్టు ఇది వరకే తెలిపింది. అయితే ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన వెంటనే తన వాటాను తగ్గించుకునే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇన్వెస్టర్లకు నష్టం వస్తుందేమోననే భయంతో కనీసం రెండేళ్ల పాటు ఎల్ ఐ సీలో తన వాటాలో ఎటువంటి మార్పు చేయలేమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం తన వైఖరిని ఐపీఓ పై నిర్వహించిన సమావేశంలో ఇన్వెస్టర్స్ కు తెలియజేసింది.
government wants to sell 75 percent share in LIC
LIC చట్టంలో సవరణలు చేసిన తర్వాత ప్రభుత్వం తన వాటాను 75 శాతం వరకు తగ్గించుకునేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో ఐపీఓ ప్రక్రియ పూర్తికాగానే ప్రభుత్వం తన వాటాను మరింత తగ్గించుకునే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ఓ స్పష్టత రావడంతో ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగింది.
ఐదేళ్లలో 25 శాతానికి..
పబ్లిక్ ఇష్యూ తర్వాత కంపెనీ పరిమాణం రూ.లక్ష కోట్లు దాటితే 5 ఏళ్ళలోపు ఆ సంస్థలో పబ్లిక్ షేర్ హోల్డర్ ల వాటాను కనీసం 25 శాతానికి పెంచాల్సి ఉంటుంది. కానీ, ఎల్ఐసీ విషయంలో ప్రభుత్వం వచ్చే 5 ఏళ్ళ పాటు ఎలాంటి వాటా విక్రయించేందుకు సిద్ధంగా లేదు. ప్రభుత్వం ఈ విషయంలో నియంత్రణా సంస్థల నుంచి మినహాయింపు కోరే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. వచ్చే 5ఏళ్ళ పాటు పబ్లిక్ ఇష్యూ ద్వారాగానీ లేదా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో గానీ వాటను తగ్గించుకునే ఉద్దేశం లేదని ప్రభుత్వం తన వైఖరిని రోడ్ షోలో ఇన్వెస్టర్లకు తెలియజేసింది. మే నెల ప్రారంభంలోనే LIC ద్వారా 5 శతం కంటే ఎక్కువ వాటాను అమ్మడానికి ఉంచవచ్చని సమచారం. LIC దాఖలు చేసిన ముసాయిదా పత్రాల ప్రకారం ..31 కోట్ల షేర్లను ప్రభుత్వం అమ్మనుంది. సెబీ వద్ద మళ్ళీ తాజాగా ముసాయిదా సమర్పించకుండా ఐపీఓకు రావడానికి మే 12 వరకు ప్రభుత్వానికి సమయం ఉంది.