
how central government get income
భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్యాల్లో ఒకటి. ఇంత పెద్ద దేశం, వ్యవస్థ నడవాలంటే తప్పకుండా ఆదాయం కావాలి. మన వ్యవస్థకు అనేక మార్గాల్లో ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని దేశ అభివృద్ధికి, వ్యవస్థల నిర్వహణకు చాలా అవసరం. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందో ఓ సారి చూద్దాం.
కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా 5 మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది.
PERSONAL INCOME TAX :
వ్యక్తిగత ఆదాయపు పన్ను…
మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఏదో ఒక పని చేస్తుంటారు. అలా పని చేసేవారికి ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఆదాయం వస్తుంది. అలా వచ్చిన ఆదాయంలో కొంత ఆదాయాన్ని ప్రభుత్వానికి పన్ను రూపంలో కడతాం దీనినే వ్యక్తిగత ఆదాయపు పన్ను అంటారు. ఒక వ్యక్తి సంవత్సరంలో 5 లక్షలు ఆదాయం వస్తే అతను 25,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి.
CORPARATE TAX :
కార్పొరేట్ ట్యాక్స్…
మన దేశంలో చాలా కంపెనీలు ఉన్నాయి. వాటికి కూడా ప్రతి సంవత్సరం లాభాలు వస్తుంటాయి. వచ్చిన లాభాలలో కొంత శాతం కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ గా కట్టాలి. దానినే కార్పోరేట్ ట్యాక్స్ అంటారు. కంపెనీలకు వచ్చే లాభలలో 25శాతం లేదా 30 శాతం గవర్నమెంట్ కు ట్యాక్స్ గా కట్టాలి.
G.S.T : జీఎస్టీ…
సాధారణంగా మనం ప్రతిరోజూ ఏదో ఒక వస్తువు కొంటాం. ఆ వస్తువు ధరపై కొంత శాతం జీఎస్ టీ కిందకు వస్తుంది. ఈ జీఎస్టీలో సగం కేంద్ర ప్రభుత్వానికి, సగం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది.
EXCISE DUTY : పెట్రోల్ మీద వచ్చే రెవెన్యూ.
ప్రజలు కొనే పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరికి రెవెన్యూ వస్తుంది. పెట్రోల్ ధరలో 70 శాతం ట్యాక్స్ ఉంటుంది. ఈ రూపంలో ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయాలు ఆదాయం వస్తుంది.
CUSTOMS DUTY:
మన దేశం చాలా వస్తువులను ఎగుమతి, దిగుమతులు చేస్తూ ఉంటుంది. అలా ఎగుమతి, దిగుమతులు చేసే వస్తువులపై ట్యాక్స్ ఉంటుంది. దీనినే CUSTOMS DUTY అంటారు. ఒక్కొక్క వస్తువుపై ఒక్కొక్క రకంగా CUSTOMS DUTY ఉంటుంది.
* ఇవే కాకుండా Coal mines, Spectrum Auction, Interest on Loans . వీటి ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. 2018, 2019 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి 20 లక్షల కోట్లు రెవెన్యూ వచ్చింది. ఇందులో కార్పొరేట్ ట్యాక్స్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ వస్తుంది.
ఇలా కేంద్ర ప్రభుత్వం తనకు వచ్చిన ఆదాయాన్ని దేశ ప్రగతికి, ప్రజల అభ్యున్నతికి, వ్యవస్థల నిర్వహణకు ఇలా తదితర వాటికి ఉపయోగిస్తుంది. ప్రధానంగా కేంద్రం 5 విధాలుగా తన నిధులను ఖర్చుపెడుతుంది.
* రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ..
కేంద్ర ప్రభుత్వం వచ్చిన మొత్తం ఆదాయంలో 41 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చేస్తుంది. ఈ 41 శాతంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనేది ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. స్టేట్స్ లో ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. తక్కువ పాపులేషన్ ఉంటే తక్కువ ఆదాయం వస్తుంది.
* DEFENCE :
దేశానికి, దేశ ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఇందులో భాగంగా ప్రధానంగా ఆర్మీలో పనిచేసే వాళ్ళకు జీతాల మీద, పెన్షన్స్, ఆయుధాల మీద ఖర్చు పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఖర్చుపెట్టే మొత్తం డబ్బుల్లో సుమారు 15 శాతం డిఫెన్స్ కి ఖర్చు పెడుతుంది.
* SUBSIDIES :
దేశంలోఉన్న ప్రజలందరికీ రేషన్ ద్వారా ఆహార వస్తువులను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం చాలా డబ్బులు ఖర్చుపెడుతుంది. అలాగే ఎల్పీజీ, ఫెర్టిలైజర్స్ సబ్సిడీ ధరకు ప్రజలకు ఇస్తుంది. కేవలం సబ్సిడీ కోసం కేంద్రం 12 శాతం ఖర్చు పెడుతుంది.
*CAPITAL EXPENDITURE :
ఆస్తులు క్రియేషన్ మీద అంటే స్కూల్స్, కాలేజీస్, హాస్పిటల్స్, రోడ్, బ్రిడ్జ్, డ్యామ్స్ లాంటి ఆస్తులను క్రియేట్ చేయడానికి ఖర్చుపెడుతుంది.
* WELFARE SCHEMES:
పీఎం కిషాన్, ఎడ్యుకేషన్, హెల్త్, స్వచ్ఛ భారత్ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాల మీద కేంద్రం ఖర్చు పెడుతుంది.
రక్తం పీల్చేస్తున్నారు