రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే ఆదాయం..
what is the income source of state government
రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల కోసం అప్పలు అధికంగా తెస్తున్నాయని ఇటీవల మనం వింటూనే ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణకు ఆదాయం ఎలా వస్తుంది. ఖర్చులు ఎలా ఉంటాయి.. అప్పలతో ఏం చేస్తారో ఓ సారి చూద్దాం.
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా ఈ 5 మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది.
* EXCISE DUTY AND VAT ON LIQUOR :
రాష్ట్రంలో అమ్మే మద్యంపై ఎక్సైజ్ సుంకం, వ్యాట్ రెండూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాలలో వ్యాట్ ఉండదు. వ్యాట్ అంటే వాల్యూ ఆడెడ్ ట్యాక్స్. ట్యాక్స్ ఏదైనా సరే గవర్నమెంట్ కు డబ్బులు తెచ్చి పెడుతుంది. గుజరాత్, బీహార్ లో మాత్రమే లిక్కర్ బ్యాన్ అయి ఉంది. అందుకే అక్కడ లిక్కర్ రెవెన్యూ రాదు. మద్యంపై వచ్చే రెవెన్యూ మొత్తం స్టేట్ గవర్నమెంట్స్ కి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందదు. జీఎస్టీ తర్వాత ఒక రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం తెచ్చేది లిక్కర్. కరోనా లాక్ డౌన్లో కూడా లిక్కర్ షాపును ఓపెన్ చేశారు.
2.VAT AND FUEL:
ప్యూల్ మీద కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని విధిస్తే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ విధించింది.
3.STAMP DUTY AND REGISTRATION:
రాష్ట్రంలో చాలామంది ఆస్తులను అమ్ముతుంటారు లేదా కొంటారు. ఆ ఆస్తులను తమ పేరుపై రిజిష్టర్ చేసుకున్నప్పుడల్లా కొంత డబ్బును గవర్నమెంట్ కి కట్టాలి. ఇలా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.
4.GST : GOODS AND SERVICES TAX.
మనం పే చేసే జీఎస్టీలో కొంత డబ్బులు కేంద్రానికి, కొంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అధికంగానే ఆదాయం సమకూరుతుంది.
5.కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా..
కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 41 శాతం స్టేట్స్ గవర్నమెంట్ కి ఇచ్చేస్తుంది. ఇంతకుముందు 42 శాతం ఉండేది. అయితే కొత్తగా జమ్మూ కాశ్మీర్ లడక్ కొత్తగా ఏర్పాటు అవడం వలన 1 శాతం షేర్ వాటికి వెళ్ళిపోతుంది. ఇవేకాకుండా RTA, MINING AND PROPERTY TAX ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
* స్టేట్స్ గవర్నమెంట్స్ కి ముఖ్యంగా జీఎస్టీ, లిక్కర్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది.
* స్టేట్స్ అనేవి ప్రతి సంవత్సరం తన GDP లో3 శాతం అప్పుగా తీసుకోవచ్చు.
* స్టేట్స్ కి మొత్తం అప్పు GDP కి 25 శాతం కన్నా ఎక్కువ ఉండకూడదు.
* ఒక రాష్ట్ర అప్పును GDP తో మెజర్ చెయ్యాలి తప్ప అమౌంట్ తో మెజర్ చేయకూడదు.
expenditure of state government
రాష్ట్రానికి ఖర్చులు ఇలా..
* CAPITAL EXPENDITURE:
ఆస్తులు క్రియేషన్ మీద అంటే… స్కూల్స్, కాలేజీస్, హాస్పిటల్స్, రోడ్, బ్రిడ్జ్, డ్యామ్స్ లాంటి ఆస్తులను క్రియేట్ చేయడానికి ఖర్చుపెడుతుంది.
* REVENU EXPENDITURE:
సంక్షేమ పథకాల మీద ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఖర్చుపెడుతుంది.
* DEBT AND INTEREST PAYMNT:
గవర్నమెంట్ ముందే కొన్ని అప్పులు తీసుకుని ఉంటుంది. వచ్చిన రెవెన్యూతో ఉన్న అప్పులో కొంత అప్పును చెల్లిస్తుంది. మిగిలిన అప్పుకి వడ్డీ కడుతుంది. ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్స్ అనేవి తమకు వచ్చిన ఆదాయాన్ని ఖర్చుపెడతాయి.
Leave a Reply