Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

ప్రభుత్వేతర చందాదార్లకు శుభ‌వార్త‌.. ఇక‌పై ఎన్‌పీఎస్‌లో 80% నిధులు వెనక్కి తీసుకోవచ్చు Good News for NPS Investors.. Now You Can Withdraw Up to 80% of NPS Funds!

Posted on 19/12/202519/12/2025 By admin No Comments on ప్రభుత్వేతర చందాదార్లకు శుభ‌వార్త‌.. ఇక‌పై ఎన్‌పీఎస్‌లో 80% నిధులు వెనక్కి తీసుకోవచ్చు Good News for NPS Investors.. Now You Can Withdraw Up to 80% of NPS Funds!

జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్‌-NPS)లో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వేతర చందాదారులకు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) కీలక సడలింపులు ప్రకటించింది. ఎన్‌పీఎస్ (NPS) నుంచి బయటకు వచ్చే సమయంలో (ఎగ్జిట్‌) ఖాతాలో జమ అయిన మొత్తం నిధుల్లో 80 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. ఇంతకు ముందు (Good News for NPS Investors.. Now You Can Withdraw Up to 80% of NPS Funds) ఈ పరిమితి 60 శాతంగా ఉండేది. తాజా మార్పులతో చందాదారులకు నగదు లభ్యత మరింత పెరగనుంది. ఎగ్జిట్‌ సమయంలో మిగిలిన 20 శాతం నిధులను యాన్యుటీలు కొనుగోలు చేయడానికి వినియోగించాలి. వీటి ద్వారా నెలవారీగా లేదా కాలానుగుణంగా పింఛన్‌ పొందే సదుపాయం కొనసాగుతుంది. ఎన్‌పీఎస్‌ (NPS) ఖాతాలోని మొత్తం పెన్షన్‌ కార్పస్‌ రూ.8 లక్షలలోపు ఉంటే, చందాదారు మొత్తం నిధులను వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించింది. అవసరమైతే దశలవారీగా ఉపసంహరణ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎన్‌పీఎస్‌లో పాక్షిక ఉపసంహరణల సంఖ్యను మూడు నుంచి నాలుగుకు పెంచింది. అదేవిధంగా 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా మూడేళ్ల వ్యవధిలో మూడు సార్లు పాక్షిక ఉపసంహరణలు చేసుకునే వీలు కల్పించారు. ప్రభుత్వేతర ఎన్‌పీఎస్‌ (NPS) చందాదారులకు ఎగ్జిట్‌ గరిష్ట వయస్సును 70 ఏళ్ల నుంచి 85 ఏళ్లకు పెంచారు. మొత్తంగా చూస్తే, ఎన్‌పీఎస్‌ (NPS)నిబంధనల్లో చేసిన ఈ మార్పులు ప్రభుత్వేతర చందాదారులకు గణనీయమైన లాభాన్ని అందించనున్నాయి.

ఎన్‌పీఎస్‌ (NPS)పై రుణ సౌకర్యం.. Loan Facility on NPS (National Pension System)

– ఎన్‌పీఎస్‌ (NPS)ఖాతాలపై రుణాలు తీసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు. పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్దేశించిన పరిమితుల మేరకు నియంత్రిత ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందవచ్చు. పీఎఫ్‌ఆర్‌డీఏ (ఎగ్జిట్స్‌ అండ్‌ విత్‌డ్రాయల్స్‌ అండర్‌ ది నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌) (అమెండ్‌మెంట్‌) రెగ్యులేషన్స్‌–2025 ప్రకారం ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్దేశించిన పరిమితుల మేరకు మాత్రమే ఈ రుణాలు మంజూరు చేయనున్నారు. దీంతో అత్యవసర అవసరాల సమయంలో ఎన్‌పీఎస్‌ నిధులను పూర్తిగా ఉపసంహరించుకోకుండా, రుణ రూపంలో వినియోగించుకునే అవకాశం చందాదారులకు లభించనుంది.
– ఎన్‌పీఎస్‌ ఖాతాను కనీసం పది సంవత్సరాలు పూర్తి చేసిన సభ్యులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా విద్య, వివాహం, గృహ నిర్మాణం, వైద్య అవసరాలు వంటి కారణాల కోసం ఈ నిధులను వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలో పనిచేసే ఎన్‌పీఎస్‌ చందాదారులకూ ఈ సడలింపులు వర్తిస్తాయి. ముఖ్యంగా యువ ఉద్యోగులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. పూర్తిగా నిధులు వెనక్కి తీసుకునే ముందు, భవిష్యత్‌లో వచ్చే (Good News for NPS Investors.. Now You Can Withdraw Up to 80% of NPS Funds) పెన్షన్‌పై ప్రభావాన్ని గమనించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అవసరానికి తగినంత మాత్రమే ఉపసంహరించుకోవడం మేలని చెబుతున్నారు.

పదవీ విరమణ సమయంలో ఉపసంహరణ..Withdrawal at the Time of Retirement

ప్రభుత్వ ఎన్‌పీఎస్‌ (NPS) చందాదారులు పదవీ విరమణ సమయంలో తమ ఎన్‌పీఎస్‌ ఖాతాలో జమ అయిన మొత్తం నిధుల్లో 60 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40 శాతం మొత్తాన్ని యాన్యుటీలు కొనుగోలు చేయడానికి వినియోగించాల్సి ఉంటుంది. వీటి ద్వారా నెలవారీగా లేదా నిర్దిష్ట వ్యవధిలో పింఛన్‌ అందుకునే సదుపాయం ఉంటుంది. 60 శాతం ఉపసంహరణ మొత్తాన్ని ఒక్కసారిగా లేదా క్రమానుగత ఉపసంహరణ విధానంలో వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఒకవేళ ఉపసంహరణకు అర్హమైన మొత్తం రూ.5 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే, ఎగ్జిట్‌ సమయంలోనే మొత్తం నిధులను ఏక మొత్తంలో వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.

జాగ్రత్తలే భవిష్యత్తుకు భరోసా…Precautions Are the Key to a Secure Future

జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్‌- NPS)లో పెట్టుబడులు పెట్టడం భవిష్యత్‌కు భద్రతనిచ్చే నిర్ణయం. అయితే ఇటీవల ఎన్‌పీఎస్‌ నిబంధనల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ప్రభుత్వేతర చందాదారులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

1. అవసరానికి మించి ఉపసంహరణ వద్దు (Avoid Excess Withdrawals Beyond Your Actual Needs): (NPS)ఎగ్జిట్‌ సమయంలో 80 శాతం వరకు నిధులు వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నా, మొత్తాన్ని తీసుకోవడం వల్ల భవిష్యత్‌ పెన్షన్‌ తగ్గే ప్రమాదం ఉంది. నిజంగా అవసరమైనంత మాత్రమే ఉపసంహరించుకోవడం మేలు.

2. యాన్యుటీ ఎంపికలో అప్రమత్తత (Be Cautious While Choosing Annuity Options): (NPS)మిగిలిన నిధులతో కొనుగోలు చేసే యాన్యుటీ స్కీమ్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలి. నెలవారీ పెన్షన్‌, వడ్డీ రేట్లు, జీవిత భాగస్వామికి లాభం వంటి అంశాలను ముందే పరిశీలించాలి.

3. పాక్షిక ఉపసంహరణలను పరిమితంగా వినియోగించాలి(Use Partial Withdrawals Sparingly): (NPS)పాక్షిక ఉపసంహరణల సంఖ్య పెరిగినప్పటికీ, తరచూ నిధులు తీసుకోవడం కార్పస్‌ను తగ్గిస్తుంది. దీర్ఘకాల లాభాల కోసం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించాలి.

4. పెట్టుబడి ఎంపికలో సమతుల్యత అవసరం(Maintain Balance While Choosing Investment Options): (NPS)ఈక్విటీ, కార్పొరేట్‌ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల మధ్య సరైన నిష్పత్తి ఉండేలా పెట్టుబడులు కేటాయించాలి. వయస్సు పెరిగే కొద్దీ రిస్క్‌ తగ్గించే విధంగా పోర్ట్‌ఫోలియో మార్చుకోవాలి.

5. ఎగ్జిట్‌ వయస్సు నిర్ణయంలో ముందస్తు ప్రణాళిక(Plan the Exit Age in Advance): (NPS)ఎగ్జిట్‌ వయస్సును 85 ఏళ్ల వరకు పెంచిన నేపథ్యంలో, ఎప్పుడు బయటకు రావాలన్నదానిపై ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆదాయం వచ్చే వయస్సు, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి.

6. రుణాలు చివరి మార్గంగా మాత్రమే (Use Loans Only as a Last Resort): ఎన్‌పీఎస్‌ (NPS) ఖాతాలపై రుణ సౌకర్యం ఉన్నా, దాన్ని తరచుగా వినియోగించడం మంచిది కాదు. రుణం తీసుకుంటే రిటైర్మెంట్‌ నిధులపై ప్రభావం పడుతుందని గుర్తుంచుకోవాలి.

ఇవీ లాభ‌న‌ష్టాలు.. These Are the Pros and Cons

ఎన్‌పీఎస్‌(NPS)లో నిధుల ఉప‌సంహ‌ర‌ణ వ‌ల్ల చందాదారులు తక్షణ నగదు అవసరాలు తీర్చుకోవచ్చు. వైద్య ఖర్చులు, పిల్లల చదువు, గృహ నిర్మాణం మొదలైన వాటికి ఆ నిధులను తీసుకోవ‌చ్చు. అత్యవసర పరిస్థితుల్లో నిధులు అందుబాటులో ఉంటాయి. పెన్షన్ భద్రతతో పాటు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మిగిలిన నిధులు యాన్యుటీల ద్వారా భవిష్యత్ పెన్షన్ అందించగలవు. అయితే ఎక్కువగా ఎన్‌పీఎస్ (Good News for NPS Investors.. Now You Can Withdraw Up to 80% of NPS Funds) నుంచి నిధులు తీసుకుంటే, ఆ తరువాత వచ్చే నెలవారీ పెన్షన్ తగ్గిపోతుంది. తరచుగా తీసుకుంటే ఖాతా పరిమాణం తగ్గుతుంది. రిటైర్మెంట్ స‌మ‌యంలో నిధులు తక్కువగా అందుతాయి.

 

 

303
FEATURE NEWS, INVESTMENTS, NEWS Tags:.Precautions Are the Key to a Secure Future, Avoid Excess Withdrawals Beyond Your Actual Needs, Be Cautious While Choosing Annuity Options, Loan Facility on NPS (National Pension System), Maintain Balance While Choosing Investment Options, Plan the Exit Age in Advance, These Are the Pros and Cons, Use Loans Only as a Last Resort, Use Partial Withdrawals Sparingly, Withdrawal at the Time of Retirement

Post navigation

Previous Post: స్వయంకృషితో ఎదిగారు.. పారిశ్రామికవేత్తల్లో అగ్రస్థానంలో నిలిచారు Self-Made Industrialists Reach the Top
Next Post: ఒమన్‌తో ఒప్పందం… ఎగుమతులకు ఊతం New Agreement with Oman Boost for Exports!

Related Posts

  • ప్ర‌భుత్వ రంగ జీవిత బీమా సంస్థ‌ చరిత్రాత్మక నిర్ణయం.. బోన‌స్ షేర్ల జారీకి ఆమోదం..! Historic Decision by State-Owned Life Insurance Giant… Bonus Share Issue Approved! FEATURE NEWS
  • ప్లెడ్జింగ్ ఆఫ్ షేర్స్ అంటే ఏమిటి what is share pledge FEATURE NEWS
  • ఇప్ప‌టివ‌ర‌కు క్రెడిట్ హిస్టరీ లేదా? అయితే ఇలా చేయండి! If You Don’t Have a Credit History Yet, Do This! FEATURE NEWS
  • అక్టోబ‌రులో యూపీఐ చెల్లింపులు.. స‌రికొత్త రికార్డులు.. UPI Payments in October Set New Records FEATURE NEWS
  • ఏటీఎం వినియోగంపై కొత్త నియమాలు.. బ్యాంకు ఖాతాదారుల‌పై అద‌న‌పు భారం? New Rules on ATM Usage | Extra Burden on Bank Customers? FEATURE NEWS
  • పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ అంటే ఏమిటి What is Post Office Recurring Deposit FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • భారత కుబేరుల ఆస్తులు 62% పెరుగుదల .. Indian Billionaires’ Wealth Rises by 62% FEATURE NEWS
  • లోన్ రిజెక్ట్ అయితే క్రెడిట్ స్కోరు పడిపోతుందా? Does Loan Rejection Really Hurt Your Credit Score? FEATURE NEWS
  • కార్ లోన్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుందా? Does Taking a Car Loan Reduce Your Credit Score? FINICAL PLANNING
  • పీపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే లోన్ సౌకర్యం! PPF Account Holders Get a Big Advantage: Low-Interest Loan Facility Explained FEATURE NEWS
  • వేచి చూసే వారిదే `స్టాక్ మార్కెట్‌` FEATURE NEWS
  • స్టార్టప్ ప్రయాణం ఎలా ప్రారంభించాలి? స్టార్టప్‌లు ఎందుకు విఫలమవుతాయి? అసలు కారణాలు ఇవే! How to Start a Successful Startup in India | Real Reasons Why Startups Fail FEATURE NEWS
  • ఐసీఐసీఐ బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డులు NEWS
  • ఏడాదికి రూ. 399తో ప‌ది ల‌క్ష‌ల బీమా Rs 399 per year with ten lakh insurance FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme