Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS
  • ఆన్‌లైన్‌ చెల్లింపులా.. కాస్త జాగ్ర‌త్త‌.. రుసుముల మోత త‌ప్ప‌దు! Online Payments? Stay Alert… Hidden Charges Can Hit Hard! FEATURE NEWS
  • PPO నంబర్ మ‌ర్చిపోయారా? అయితే ఇక నో టెన్ష‌న్‌! EPFO పెన్షనర్లు ఇంట్లో నుంచే నిమిషాల్లో పొందొచ్చు! Forgot Your PPO Number? No Tension! EPFO Pensioners Can Retrieve It Online in Minutes from Home! FEATURE NEWS
  • సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడిని మూడు రెట్లు ఎలా పెంచుకోవాలో తెలుసా? Do You Know How to Triple Your Investment in Sukanya Samriddhi Yojana? FEATURE NEWS
  • విహారయాత్ర కోసం వ్యక్తిగత రుణం.. కలల ట్రిప్‌న‌కు మార్గమా? లేక ఆర్థిక భారమా? Personal Loan for Travel.. A Gateway to Your Dream Trip or a Financial Burden? FEATURE NEWS
  • పదవీ విరమణకు ముందు ఈ పొర‌పాట్లు చేయొద్దు..!! Don’t Make These Financial Mistakes Before Retirement..! FEATURE NEWS

పిల్లల పేరిట నెలకు రూ.1000 దాచండి.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత పొందండి ! Save ₹1,000 a Month for Your Child.. Build a Massive Future Corpus!

Posted on 07/05/2026 By admin No Comments on పిల్లల పేరిట నెలకు రూ.1000 దాచండి.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత పొందండి ! Save ₹1,000 a Month for Your Child.. Build a Massive Future Corpus!

“మన పిల్లలు మంచి చదువులు చదవాలి.. మంచి ఉద్యోగం చేయాలి.. భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలి.” అని త‌ల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. అందుకే చాలామంది పిల్లల చదువులు, పెళ్లిళ్లు, భవిష్యత్‌ అవసరాల కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తారు. కానీ కాలం మారుతోంది. కేవలం చదువులు, వివాహం కోసం మాత్రమే కాదు.. పిల్లలు పెద్దయ్యాక ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం పెరుగుతోంది. ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, ఉద్యోగాల్లో అనిశ్చితి, పెరుగుతున్న వైద్య ఖర్చులు.. ఇవన్నీ కలిసి భవిష్యత్తు ఆర్థిక భద్రతను అత్యంత కీలకంగా మార్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన “NPS వాత్సల్య” పథకం ఇప్పుడు తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్న మొత్తాలతో ప్రారంభించి, దీర్ఘకాలంలో భారీ నిధిని సమకూర్చుకునే అవకాశం ఈ పథకంలో ఉంది. ముఖ్యంగా నెలకు కేవలం రూ.1000 పెట్టుబడి పెట్టినా, చక్రవడ్డీ శక్తితో భవిష్యత్తులో కోట్ల రూపాయల నిధిని నిర్మించవచ్చని (Save ₹1,000 a Month for Your Child) ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే దీనిని చాలా మంది “పిల్లల ఆర్థిక స్వేచ్ఛకు బలమైన పునాది”గా అభివర్ణిస్తున్నారు.

NPS వాత్సల్య అంటే ఏమిటి? What Is NPS Vatsalya Scheme?
NPS వాత్సల్య (Save ₹1,000 a Month for Your Child)అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పెన్షన్‌ ఆధారిత పొదుపు పథకం. ఇది ప్రధానంగా మైనర్ల కోసం రూపొందించబడింది. అంటే 18 ఏళ్లలోపు పిల్లల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ పథకం పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA) పర్యవేక్షణలో పనిచేస్తుంది. సాధారణ NPS విధానాన్ని పిల్లలకు అనుగుణంగా రూపొందించడమే దీని ప్రధాన లక్ష్యం. చాలామంది పిల్లల భవిష్యత్తు కోసం బ్యాంక్‌ RDలు, FDలు, చిన్న పొదుపు పథకాలు, బీమా పాలసీలు తీసుకుంటుంటారు. కానీ NPS వాత్సల్య మాత్రం దీర్ఘకాలిక పెట్టుబడి, ఈక్విటీ మార్కెట్‌, చక్రవడ్డీ ప్రయోజనాలను కలిపిన ప్రత్యేక పథకంగా నిలుస్తోంది.

చిన్న పొదుపు.. భారీ భవిష్యత్‌.. Small Investments, Big Long-Term Wealth
ఈ పథకంలో అసలు బలం “దీర్ఘకాలిక పెట్టుబడి”. చిన్న వయసులో ప్రారంభించిన పొదుపు, కాలక్రమేణా భారీ నిధిగా మారుతుంది. ఉదాహరణకు, ఒక తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట నెలకు రూ.1000 చొప్పున (Save ₹1,000 a Month for Your Child)పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాం. ఇది సంవత్సరానికి రూ.12,000 అవుతుంది. ఈ మొత్తాన్ని దీర్ఘకాలంగా కొనసాగిస్తే, మార్కెట్‌ ఆధారిత సగటు 10 శాతం రాబడితో అది భవిష్యత్తులో భారీ కార్పస్‌గా మారే అవకాశం ఉంది. చాలామంది ఆర్థిక నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే — “పెట్టుబడి మొత్తం కంటే సమయం ముఖ్యమైనది.” పిల్లల చిన్న వయసులో ప్రారంభించే పెట్టుబడులు, చక్రవడ్డీ కారణంగా భవిష్యత్తులో ఆశ్చర్యకర స్థాయికి చేరవచ్చు.

ఎవరు ఈ పథకంలో చేరవచ్చు? Eligibility for NPS Vatsalya
భారతీయ పౌరులుగా ఉన్న 18 ఏళ్లలోపు పిల్లలు ఎవరైనా ఈ పథకంలో(Save ₹1,000 a Month for Your Child) చేరవచ్చు. ముఖ్యంగా మైనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన పథకం కావడంతో, తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులే ఖాతాను నిర్వహిస్తారు. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే — కేవలం భారతదేశంలో నివసించే పిల్లలకే కాదు, NRI (Non-Resident Indian), OCI (Overseas Citizen of India) పిల్లలకు కూడా ఈ పథకంలో చేరే అవకాశం ఉంది. ఇది విదేశాల్లో నివసించే భారతీయ కుటుంబాలకు కూడా దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలో ఉపయోగపడుతోంది.

రూ.1000తోనే ప్రారంభం.. Start With Just ₹1,000
చాలామంది పెట్టుబడుల విషయంలో పెద్ద మొత్తాలు అవసరమని భావిస్తారు. కానీ NPS వాత్సల్యలో కేవలం సంవత్సరానికి రూ.1000తోనే(Save ₹1,000 a Month for Your Child) ఖాతా ప్రారంభించవచ్చు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులో ఉండేలా రూపొందించబడింది. ముఖ్యంగా చిన్న మొత్తాలతో క్రమంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో గరిష్ట పెట్టుబడి పరిమితి కూడా లేదు. అంటే ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఎంత మొత్తమైనా జమ చేయవచ్చు.

పన్ను మినహాయింపులు కూడా భారీగా.. Major Tax Benefits for Parents
ఈ పథకంలో(Save ₹1,000 a Month for Your Child) మరో ముఖ్యమైన ప్రయోజనం పన్ను మినహాయింపు. పిల్లల పేరిట పెట్టుబడి పెట్టినా, ఆదాయపు పన్ను ప్రయోజనాలు మాత్రం తల్లిదండ్రులకు లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80CCD(1B) కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అదనంగా రూ.50,000 వరకు ప్రత్యేక డిడక్షన్‌ కూడా లభించే అవకాశం ఉంటుంది. దీంతో పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయడమే కాకుండా, ప్రస్తుతం చెల్లించే పన్నును కూడా తగ్గించుకోవచ్చు.

పెట్టుబడిని ఎలా కేటాయించుకోవచ్చు? Investment Choices Available
ఈ పథకంలో(Save ₹1,000 a Month for Your Child) పెట్టుబడిదారులకు మంచి సౌలభ్యం కల్పించారు. తమ రిస్క్‌ సామర్థ్యానికి అనుగుణంగా పెట్టుబడులను ఎలా కేటాయించుకోవాలో తల్లిదండ్రులే నిర్ణయించుకోవచ్చు. కొంతమంది పూర్తిగా భద్రత కోరుకుంటారు. ఇంకొందరు దీర్ఘకాలంలో అధిక రాబడులు ఆశిస్తారు. ఈ రెండు వర్గాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూడు రకాల ఎంపికలు అందుబాటులో ఉంచారు.

డీఫాల్ట్‌ ఛాయిస్‌ అంటే? What Is the Default Choice?
డీఫాల్ట్‌ ఎంపికలో పెట్టుబడిలో సుమారు 50 శాతం ఈక్విటీలో పెట్టుబడి అవుతుంది. మిగతా మొత్తం ప్రభుత్వ బాండ్లు, స్థిర ఆదాయ పథకాలలో పెట్టబడుతుంది. రిస్క్‌ తక్కువగా ఉండేలా, దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులు వచ్చేలా ఈ విధానం రూపొందించబడింది.

ఆటో ఛాయిస్‌ ఎలా పనిచేస్తుంది? How Auto Choice Works?
ఆటో ఛాయిస్‌లో వయస్సు, రిస్క్‌ సామర్థ్యాన్ని బట్టి ఈక్విటీ పెట్టుబడి శాతం మారుతూ ఉంటుంది. 25 శాతం నుంచి 75 శాతం వరకు ఈక్విటీలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. చిన్న వయసులో ఎక్కువ రిస్క్‌ తీసుకునే అవకాశం ఉండటంతో, దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది.

యాక్టివ్‌ ఛాయిస్‌లో పూర్తి స్వేచ్ఛ.. Active Choice Gives Full Flexibility
ఆర్థిక మార్కెట్లపై అవగాహన ఉన్నవారు యాక్టివ్‌ ఛాయిస్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో పెట్టుబడులను ఎలా విభజించాలో పూర్తిగా పెట్టుబడిదారులే నిర్ణయించవచ్చు. ఈక్విటీలో 75 శాతం వరకు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో 100 శాతం వరకు పెట్టుబడి కేటాయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇది రిస్క్‌ తీసుకుని అధిక రాబడులు ఆశించే వారికి ఉపయోగపడుతుంది.

చక్రవడ్డీ శక్తి ఎలా పనిచేస్తుంది? Power of Compounding in Long-Term Savings
పిల్లల కోసం (Save ₹1,000 a Month for Your Child)చిన్న వయసులోనే ప్రారంభించే పెట్టుబడులలో ప్రధాన బలం “చక్రవడ్డీ”. మీరు పెట్టిన పెట్టుబడికి వచ్చే లాభం మళ్లీ పెట్టుబడిలో కలుస్తూ మరింత లాభాన్ని సంపాదిస్తుంది. కాలక్రమేణా ఇది భారీ నిధిగా మారుతుంది. ఉద్యోగ జీవితంలో ఆలస్యంగా ప్రారంభించే పెట్టుబడులతో పోలిస్తే, చిన్నప్పటి నుంచే ప్రారంభించిన పొదుపులు ఎంతో ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి.

మధ్యలో డబ్బు తీసుకోవచ్చా? Withdrawal Rules Explained
“పిల్లల చదువుల కోసం మధ్యలో డబ్బు అవసరమైతే?” ఎలా అని చాలామంది యోచిస్తుంటారు. అయితే NPS వాత్సల్యలో ఈ సౌకర్యం కూడా ఉంది. ఖాతా ప్రారంభించిన మూడు సంవత్సరాల తర్వాత, విద్య లేదా వైద్య అవసరాల కోసం జమ చేసిన మొత్తంలో 25 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.

18 ఏళ్ల తర్వాత ఏమవుతుంది? What Happens After the Child Turns 18?
పిల్లలకు 18 ఏళ్లు పూర్తయిన తర్వాత ఈ ఖాతా సాధారణ NPS ఖాతాగా మారుతుంది. అంటే అప్పటి నుంచి పిల్లలే ఖాతాను నిర్వహించే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడిని కొనసాగించి, భవిష్యత్‌ రిటైర్మెంట్‌ నిధిని కూడా నిర్మించుకోవచ్చు. ఇది పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణను పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది.

అనుకోని పరిస్థితుల్లో ఏమవుతుంది? What Happens in Unfortunate Situations?
పథకంలో(NPS) పెట్టుబడిదారుల భద్రత కోసం ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి. ఒకవేళ దురదృష్టవశాత్తూ పిల్లాడు మరణిస్తే, ఖాతాలో ఉన్న మొత్తం నామినీకి అందుతుంది. దీంతో కుటుంబానికి ఆర్థిక రక్షణ లభిస్తుంది.

మధ్యతరగతి కుటుంబాలకు వరమా? A Boon for Middle-Class Families?
ప్రస్తుతం పిల్లల భవిష్యత్తు కోసం భారీ మొత్తాలు పొదుపు చేయడం మధ్యతరగతి కుటుంబాలకు కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న మొత్తాలతో ప్రారంభించి, దీర్ఘకాలంలో పెద్ద నిధిని నిర్మించుకునే అవకాశాన్ని NPS వాత్సల్య కల్పిస్తోంది. ముఖ్యంగా పిల్లలు చిన్నవయసులో ఉన్నప్పుడే ప్రారంభిస్తే, భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.

ఆర్థిక అవగాహన పెరగాల్సిన అవసరం.. Need for Better Financial Awareness
మన దేశంలో ఇప్పటికీ చాలామంది పెట్టుబడుల విషయంలో పూర్తి అవగాహన లేకుండా ఉంటున్నారు. బ్యాంక్‌ పొదుపు ఖాతాలు, FDలు మాత్రమే భద్రత అని భావిస్తున్నారు. కానీ దీర్ఘకాలిక లక్ష్యాలకు మార్కెట్‌ ఆధారిత పెట్టుబడులు కూడా అవసరం. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం సమయం ఎక్కువగా ఉండటంతో, చక్రవడ్డీ ప్రభావం అద్భుత ఫలితాలు ఇవ్వగలదు. పిల్లల(Save ₹1,000 a Month for Your Child) భవిష్యత్తు కోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ప్రతి కుటుంబానికి చాలా అవసరం. చదువులు, ఉద్యోగం, ఆర్థిక స్వేచ్ఛ — ఇవన్నీ భవిష్యత్తులో పెద్ద ఖర్చులతో ముడిపడి ఉంటాయి. PS వాత్సల్య వంటి పథకాలు చిన్న మొత్తాలతోనే పెద్ద భవిష్యత్‌ నిధిని నిర్మించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా క్రమశిక్షణతో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే, చక్రవడ్డీ శక్తి అద్భుత ఫలితాలు ఇవ్వగలదు. ఈరోజు నెలకు రూ.1000తో ప్రారంభించే చిన్న పొదుపే.. రేపు మీ పిల్లల ఆర్థిక స్వేచ్ఛకు బలమైన పునాది కావచ్చు.

49
FEATURE NEWS, FINICAL PLANNING Tags:000, A Boon for Middle-Class Families?, Active Choice Gives Full Flexibility, Big Long-Term Wealth, Eligibility for NPS Vatsalya, How Auto Choice Works?, Investment Choices Available, Major Tax Benefits for Parents, Need for Better Financial Awareness, Power of Compounding in Long-Term Savings, Small Investments, Start With Just ₹1, What Happens After the Child Turns 18?, What Happens in Unfortunate Situations?, What Is NPS Vatsalya Scheme?, What Is the Default Choice?, Withdrawal Rules Explained

Post navigation

Previous Post: సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడిని మూడు రెట్లు ఎలా పెంచుకోవాలో తెలుసా? Do You Know How to Triple Your Investment in Sukanya Samriddhi Yojana?
Next Post: PPO నంబర్ మ‌ర్చిపోయారా? అయితే ఇక నో టెన్ష‌న్‌! EPFO పెన్షనర్లు ఇంట్లో నుంచే నిమిషాల్లో పొందొచ్చు! Forgot Your PPO Number? No Tension! EPFO Pensioners Can Retrieve It Online in Minutes from Home!

Related Posts

  • తెలివిగా పెట్టుబ‌డి పెట్టండి INVEST WISELY FINICAL PLANNING
  • ఇక సుర‌క్షిత ప్ర‌భుత్వ క్రిప్టో what is government secured crypto currency FEATURE NEWS
  • ట్యాక్స్ ప్లానింగ్ ఇలా చేసుకోవాలి what is the need of tax planning FINICAL PLANNING
  • సేఫ్టీ, వడ్డీ విషయంలో దీన్ని మించిన స్కీమ్ లేదు! వీపీఎఫ్ గురించి తెలుసుకుందామా! No Scheme Beats VPF in Safety and Returns – Let’s Understand VPF FEATURE NEWS
  • WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT ఒక ఎన్ఆర్ఐ తన ఈపీఎఫ్‌ ఖాతాను ఏం చేయాలి FEATURE NEWS
  • మీ ఆర్థిక సర్వే సిద్ధమేనా? బ‌డ్జెట్‌కు ముందే ప‌రిశీలించండి! Is Your Financial Survey Ready? Review It Before the Budget! FINICAL PLANNING

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ఆన్‌లైన్‌ చెల్లింపులా.. కాస్త జాగ్ర‌త్త‌.. రుసుముల మోత త‌ప్ప‌దు! Online Payments? Stay Alert… Hidden Charges Can Hit Hard!
  • PPO నంబర్ మ‌ర్చిపోయారా? అయితే ఇక నో టెన్ష‌న్‌! EPFO పెన్షనర్లు ఇంట్లో నుంచే నిమిషాల్లో పొందొచ్చు! Forgot Your PPO Number? No Tension! EPFO Pensioners Can Retrieve It Online in Minutes from Home!
  • పిల్లల పేరిట నెలకు రూ.1000 దాచండి.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత పొందండి ! Save ₹1,000 a Month for Your Child.. Build a Massive Future Corpus!
  • సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడిని మూడు రెట్లు ఎలా పెంచుకోవాలో తెలుసా? Do You Know How to Triple Your Investment in Sukanya Samriddhi Yojana?
  • విహారయాత్ర కోసం వ్యక్తిగత రుణం.. కలల ట్రిప్‌న‌కు మార్గమా? లేక ఆర్థిక భారమా? Personal Loan for Travel.. A Gateway to Your Dream Trip or a Financial Burden?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల భ‌ద్ర‌తే ముఖ్యం safety is important to credit card users NEWS
  • టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ విష‌యాలు తెలుసుకోండి Taking Term Insurance? Know These Important Things.. FEATURE NEWS
  • ఈ కంపెనీల్లో భారీగా డివిడెంట్లు ! FEATURE NEWS
  • ఒక్క తప్పు డేట్.. రిటైర్మెంట్ డబ్బులు గల్లంతే! EPFO సీరియస్ వార్నింగ్ .. A Single Wrong Date Can Jeopardize Your Retirement! EPFO Issues Serious Alert FEATURE NEWS
  • క్రెడిట్‌ కార్డు మోసమా? సకాలంలో మేలుకుంటే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.! Credit Card Fraud? Timely Action Can Help Minimise Losses. FEATURE NEWS
  • ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్! డిసెంబర్‌ 1 నుంచి mCASH సర్వీస్ బంద్‌.. Alert for SBI Customers! mCASH Service to Be Discontinued from December 1 FEATURE NEWS
  • What to do before financial decision ఆర్థిక నిర్ణయాల‌కు ముందు ఓ సారి ఆలోచించండి FINICAL PLANNING
  • డిజిట‌ల్ గోల్డ్ కొన‌వ‌చ్చా..? Can We Buy Digital Gold? FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme