what is PLI scheme
- 20 కంపెనీలకు పీ ఎల్ ఐ స్కీం కింద ప్రోత్సాహకాలు
పీ ఎల్ ఐ స్కీం ద్వారా కేంద్ర ప్రభుత్వం మాన్యుఫాక్చరింగ్ కంపెనీలకు చేయూత అందిస్తోంది. అందులో భాగంగా ఆటోమొబైల్, ఆటోమొబైల్ విడిభాగాల పరిశ్రమలోని 20 కంపెనీల ప్రతిపాదనలను కేంద్రప్రభుత్వం ఆమోదించింది. టాటామోటార్స్, మారుతిసుజుకీ, హ్యుందాయ్, కియా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు ఈ అవకాశాన్ని కైవసం చేసుకున్నాయి. 18 శాతం వరకుప్రోత్సహకాలు ఇవ్వడం ద్వారా దేశం మొత్తం విడిభాగాల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీల ఆవిష్క రించేందుకు ఈ పథకం వర్తిస్తుంది.
central government support to auto industry
అశోక్ లేలాండ్, ఐచర్ మోటార్స్, ఫోర్డ్ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, కియా ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, పీసీఏ ఆటోమొబైల్స్, పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్, సుజుకీ మోటార్ గుజరాత్, టాటామోటార్స్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ కేటగిరీలో ద్విచక్ర, త్రిచక్ర వాహనతయారీదారులకు ప్రోత్సాహకాల కింద బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, పియాజియో వెహికల్స్, టీవీఎస్ మోటార్ ఎంపికయ్యాయి.
special benefits to auto industry
* నాన్ ఆటోమోటివ్ ఇన్వెస్టర్ కేటగిరీ కింద యాక్సిస్ క్లీన్ మొబిలిటీ, భూమా ఇన్నోవేటివ్ ట్రాన్స్ పోర్ట్ సొల్యూషన్స్, ఎలెస్ట్, హోప్ ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్, పవర్ హాల్ వెహికల్ కంపెనీలు రాయితీలకు అర్హత పొందాయి. మొత్తం రూ.25,938 కోట్లను ప్రోత్సాహకాలుగా ఇవ్వాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది.