
పొదుపు చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మన పూర్వీకులంతా సంప్రదాయ పద్ధతుల్లో డబ్బులు దాచుకుని ఆస్తులు కూడబెట్టుకునే వారు. అందుబాటులో ఉన్న బ్యాంకు డిపాజిట్లు, ఫిక్సిడ్ డిపాజిట్లు, ఎల్ ఐ సీలు, పోస్టాఫీస్ సేవింగ్స్, రికరింగ్ డిపాజిట్.. తదితర వాటిలో పొదుపు చేసేవారు. వీటి కన్నా మరి కొంత ప్రయోజనం చూకూర్చే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్ సీ), కిసాన్ వికాస్ పత్ర(కేవీపీ) లాంటి పథకాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ఇప్పడు కాలం మారింది. నేటి తరం యువత రిస్క్ చేయడానికి కూడా సిద్ధపడుతూ అధిక రాబడి మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి వాటిలో మొదటి వరుసలో నిలిచేవి మ్యూ చువల్ ఫండ్స్.
why mutual funds are best to invest
ఇది వరకూ మ్యూచువల్ ఫండ్స్, షేర్లపై పెద్దగా అవగాహన ఉండేది కాదు. కానీ ఆన్ లైన్ సౌకర్యాలు పెరిగిన తర్వాత ప్రతిరోజు ఈక్విటీల్లో హెచ్చుతగ్గులు తెలిసిపోతున్నాయి. దీంతో ఈక్విటీలపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. సిప్ అనేది మ్యూచువల్ పండ్స్ లో పెట్టుబడి పెట్టే ఒక మార్గం మాత్రమే. ఇందులో రిస్క్ తగ్గుతుంది కానీ మనం అనుకున్న రాబడి వస్తుందని చెప్పలేం. మార్కెట్ ఆధారంగా ఒక్కోసారి నష్టాలు కూడా రావచ్చు. అందుచేత ఈక్విటీ ఫండ్స్ లో ప్రవేశించే ముందు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండడం మంచిది. మార్కెట్ తక్కువలో ఉన్నప్పడు మరికొంత రుణాన్ని మదుపు చేస్తే ఎక్కువ యూనిట్స్ సమకూర్చుకోవచ్చు. దీని ద్వారా రాబడి పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ కి నిపుణులైన ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వీరు మదుపరుల తరపున ఈక్విటీ మార్కెట్లోనూ, వివిధ ప్రభుత్వ లేదా ప్రైవేటు బాండ్స్ లాంటి వాటిలోను పెట్టుబడులు పెడుతుంటారు.
how to sip in mutual funds
సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్
తక్కువ మదుపులతో క్రమం తప్పకుండా ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్ లోకి పెట్టుబడులు పెట్టే విధానమే సిప్. దీనికి బ్యాంకు ద్వారా సిప్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల లాభం, నష్టం అనేది ఏవరేజ్ అవుతుంది. దీని వల్ల స్టాక్ మార్కెట్‌లో ఉండే వాలటాలిటీ, భారీ హెచ్చుతగ్గులు ఇందులో ఉండవు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో, సంపదను సృష్టించడంలో సిప్ సహాయపడుతుంది. ఎలాంటి అనుభవం, తెలివి, టైం లేకపోయినా మ్యూచువల్ ఫండ్స్ లో మంచి లాభాలు సాధించడం సాధ్యమవుతుంది. మార్కెెట్ రేటు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. మార్కెట్ తక్కువలో ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టుబడి పెట్టినట్లయితే అది మరింత తక్కువకి వెళ్లొచ్చు. ఇలాంటి హెచ్చు తగ్గులను ఊహించలేం కాబట్టి ప్రతి నెలాఒక తేది అనుకొని ఆ తేదీన కొంత మొత్తం పెట్టడం వల్ల సగటున రిస్క్ తగ్గుతూ ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న వాటిలో అతి లాభదాయకమైన పొదుపు/ పెట్టుబడి సాధనం మ్యూచువల్ ఫండ్స్. మరింత అధ్యయం చేసి, పూర్తి సమాచారం తెలుసుకుని సిప్ చేయడం మొదలు పెట్టండి.