మ్యూచువల్ ఫండ్స్ `నమ్మకమైనవి.. లాభదాయకమైనవి`
why mutual funds are safe
మ్యూచువల్ ఫండ్ లో మనం పెట్టే డబ్బులు ఎక్కడికీ పోకుండా ఎటువంటి మోసం జరగకుండా ఒక పకడ్బంధీ వ్యవస్థ ఉంటుంది. అందుకే ఇది వందశాతం సురక్షితం. కానీ రిస్క్ అని ఎందుకంటారంటే, ఇది స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది కనుక ..` subjected to Maaket risk.. read all related documents` అనే హెచ్చరిక పెడతారు. ఇది మనల్ని అవగాహన పెంచుకోమని చెప్పడమే కానీ పెట్టుబడి పెట్టొద్దని కాదు.
what is structure of mutual fund company
మ్యూచువల్ ఫండ్ కంపెనీ అమరిక ఇలా..
ముందుగా ఎదో ఒక కంపెనీ లేదా ఎవరో ఒక స్పాన్సర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తారు.
ఈ ట్రస్ట్ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ( ఏ ఎం సీ)ని ఏర్పాటు చేస్తుంది.
ఏ ఎం సీ చాలా రకాల ఫండ్స్‌ని స్టార్ట్ చేస్తుంది. వీటికి సమర్థులైన ఫండ్ మేనేజర్‌ని నియమిస్తుంది.
ఇన్వెస్టర్లందరూ కలిపి ఇచ్చిన డబ్బుని ఫండ్ మేనేజర్లకి ఏ ఎం సీ ఇస్తుంది.
ఈ ఫండ్ మేనేజర్ మనం ఎంచుకున్న ఫండ్‌లో ఉన్న స్టాక్‌లను కొంటాడు.
ఇలా మనం పెట్టిన పెట్టుబడికి కాపలాదారుగా మొదట ఏర్పడిన ట్రస్టీ ఉంటారు. ఇక్కడ ఈ ట్రస్ట్ అనేది సెబీ ఎప్రూవ్డ్ కంపెనీ అయి ఉంటుంది. ఇలా జరిగే లావాదేవీలన్నింటినీ ఆర్టీఏ ఏజంట్ అని పిలువ బడే సెబీ గుర్తింపు సంస్థ చూడాల్సి ఉంటుంది. ఇలాంటి ఆర్టీఏ ఏజంట్లే NSDL లేదా CDSL..
పైన పేర్కొన్న సంస్థలన్నీ పెట్టుబడిదారుల సొమ్ముతో జరిగే లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్ స్థితిగతులను సెబీకి ఎప్పటికప్పడు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంత ఖచ్చితమైన స్ట్రక్చర్ ఉంది కనుకే మ్యూచువల్ ఫండ్ అనేది నష్టభయం లేనిది.
what are the charges in mutual funds
మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మార్కెట్ ఆధారంగా పైకీ కిందకూ రావచ్చు. కానీ డబ్బులు ఎక్కడికీ పోవు. ఇలా మన పెట్టుబడులను నిర్వహించి మనకు లాభాలను పంచేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి ఫండ్ హౌస్ మన దగ్గర కొంత చార్జీ చేస్తుంది. ఇది బయటకు కనిపించదు. ఫండ్‌లోనే ఈ చార్జీలను కట్ చేసుకుంటారు. దీన్ని ఎక్స్‌పెన్స్ రేషియో అంటారు. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక శాతం వరకూ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్‌కు కమీషన్ గా వెళ్తుంది. అంతకు మించి మరే ఛార్జీలు ఇక్కడ ఉండవు.
చాలా మంచి సమాచారం ఉంది.. ఇప్పటి వరకు మనమే మార్కెట్ లో పెడ్తారని అనుకున్న.. కొత్త వారికి అవగాహన కల్పించే లాగా ఉంది.. థాంక్ యూ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
Thank you for your comment