
what are the types of mutual funds
మ్యూచువల్ ఫండ్స్ చాలా రకాలుగా ఉంటాయి. వాటి పనితీరును బట్టి, వాటి పెట్టుబడి వ్యూహాన్ని బట్టి రకరకాలుగా విభజించవచ్చు. కానీ లక్విడిటీ ఆధారంగా చేసుకుని ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు.
* క్లోజ్ ఎండెడ్ ఫండ్స్
* ఓపెన్ ఎండెడ్ ఫండ్స్
క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటే వాళ్ళు నిర్ధేశించిన సమయంలో ఇన్వెస్ట్ చేయాలి. రిటర్న్ అమౌంట్ కూడా మెచ్యూరిటీ టైమ్ అయిన తర్వాత వస్తాయి.
ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఈ ఫండ్స్ లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ డబ్బులు ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు.
what are the categories in mutual funds
మ్యూచువల్ ఫండ్స్ లో ఐదు రకాల కేటగిరిలు ఉన్నాయి.
1.ఈక్విటీఫండ్స్
2. డెట్ ఫండ్స్
3.హైబ్రిడ్ ఫండ్స్
4.సొల్యూషన్ ఓరియంటెడ్ స్కీమ్
5.అదర్ స్కీమ్స్
types of equity mutual funds
ఈక్విటీలో ఇలా..
స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన కంపెనీల్లో టాప్ 100 కంపెనీలను లార్జ్ క్యాప్ అంటారు. 101 నుంచి 250 వరకు ఏ కంపెనీలు ఉంటాయో వాటిని మిడ్ క్యాప్ అంటారు. 251 కంపెనీల నుంచి ఉన్న వాటిని స్మాల్ క్యాప్ కంపెనీలు అంటారు.
లార్జ్ క్యాప్ ఫండ్స్ …
ఈ లార్జ్ క్యాప్ లో టాప్ 100 కంపెనీలలో 80 శాతం పోర్ట్ ఫోలియోని ఇన్వెస్ట్ చేయాలి. మిగిలిన 20 శాతం ఫండ్ మేనేజర్ మిడ్ క్యాప్ లో గాని స్మాల్ క్యాప్ లో గాని పెట్టవచ్చు.లార్జ్, మిడ్ క్యాప్ కేటగిరి
ఇందులో 35శాతం లార్జ్ క్యాప్ పోర్ట్ ఫోలియో లో ఇన్వెస్ట్ చేయాలి. 35శాతం మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలి. మిగిలిన 30శాతం పోర్ట్ఫోలియోని ఫండ్ మేనేజర్ తనకు నచ్చినట్టుగా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.మల్టీ క్యాప్ కేటగిరి
ఫండ్ మేనేజర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు. కాకపోతే 65శాతం పోర్ట్ఫోలియోను ఈక్విటీ ఫండ్స్ లో ఉంచాలి. మిగిలినది డెట్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు.
ఇందులో రిస్కు తగ్గుతుంది.మిడ్ క్యాప్ కేటగిరి..
మినిమమ్ 65శాతం పోర్ట్ ఫోలియోను మిడ్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి.
స్మాల్ క్యాప్ కేటగిరి..
ఇందులో 65శాతం పోర్ట్‌ఫోలియోను స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టాలి. మిగిలిన 35 శాతం పోర్ట్ ఫోలియో ని మిడ్ క్యాప్ లో లేదా లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.ఈఎల్ ఎస్ ఎస్ ఫండ్స్
ఇవి ట్యాక్స్ కోసం ఉద్దేశించినవి. ఈ కేటగిరి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3సం లోపు డబ్బులు తీసుకోవడం కుదరదు. 3 సంవత్సరాలు దాటిన తరువాత మాత్రమే డబ్బులు తీసుకోగలం. ఇందులో చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌కు సెక్షన్ 80 సీ కింద లక్షా 50 వేల వరకు ట్యాక్స్ మినహాయింపు వస్తుంది.