స్టాక్ మార్కెట్ లో స్మాల్ కేస్ ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి What is Small Case Investing in Stock Market?
What is Small Case Investing in Stock Market?
స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఇటీవల వచ్చిని ఒక కొత్త పెట్టుబడి విధానం స్మాల్‌కేస్. అంటే అతి కొద్ది స్టాక్‌ల సమూహం ఇక్కడ ఉంటుంది. కేవలం సింగిల్ స్టాక్‌లో పెట్టుబడి పెట్టకుండా ఒక ప్రత్యేక వ్యూహం ఉన్న ఈ కొద్ది స్టాక్‌ల సమూహంలో పెట్టుబడి పెట్టడం ఇక్కడ సాధ్యమవుతుంది. దీని వల్ల నష్టభయం తగ్గి లాభాలను పొందడం సులువు.
-స్మాల్‌కేస్ అనేది ఒక పోర్ట్ ఫోలియో. ఇది ప్రత్యేక థీమ్ లేదా వ్యూహంతో ఏర్పాటు చేసింది.
-దీనికి తప్పకుండా డీ మ్యాట్ అకౌంట్ ఉండాల్సిందే.
-పెట్టుబడిదారులు తమ బ్రోకర్, డీమ్యాట్ ఖాతా ద్వారా నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు.
-మీకు ఉన్న డీ మ్యాట్ అకౌంట్‌లో ప్రతి బ్రోకర్ కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.
-మీ బ్రోకింగ్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ లో Smallcase.comకి రావాలి. ఉదాహరణకు మీకు HDFC సెక్యూరిటీస్‌లో ఖాతా ఉంటే, మీరు దాని నుంచి కూడా దానికి లాగిన్ చేయవచ్చు. జిరోదా, అప్‌స్టాక్స్.. ఇలా అన్ని బ్రోకింగ్ సంస్థలు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి.
How to invest in small case
* డీ మ్యాట్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరూ స్మాల్ కేస్‌లో ఇన్వెస్ట్ చేయ వచ్చు.
* డీ మ్యాట్‌లో లాగిన్ అయిన తర్వాత, మీరు ప్లాట్‌ఫామ్‌లో వివిధ పోర్ట్‌ఫోలియోలను చూడవచ్చు. వీటిని చిన్న కేసులు అంటారు. ఈ పోర్ట్‌ఫోలియోలు విభిన్న థీమ్‌లపై ఆధారపడి ఉంటాయి. మనం నేరుగా మనకి నచ్చిన పోర్ట్ ఫోలియోలో పెట్టుబడి పెట్టవచ్చు.
* మనం షేర్లను కొనుగోలు చేసినట్లే, నేరుగా స్మాల్ కేస్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ విధంగా ప్లాట్‌ఫాంను ఉపయోగించడం చాలా సులభం.
* ఇది మ్యూచువల్ ఫండ్స్, షేర్లను కొనుగోలు చేయడానికి పూర్తిగా భిన్నమైనది.
* ఈ ప్లాట్‌ఫాంలో మీరు విభిన్నమైన పోర్ట్ ఫోలియోను కొనుగోలు చేసే అవకావం ఉంది.
* ఈ ప్లాట్‌ఫాం 25 నుంచి 35 సంవత్సరాల యువతలో బాగా ప్రాచుర్యం పొందింది.
* ఒక స్మాల్ కేస్‌ను కొనుగోలు చేయాలంటే కొంత నిర్ణీత మొత్తం పెట్టాల్సి ఉంటుంది. ప్రతి పోర్ట్ ఫోలియో కనీస పెట్టుబడి మొత్తం ఈ ప్లాట్‌ఫారమ్‌లో నిర్ణయిస్తారు. పోర్ట్ ఫోలియో రూ.100 నుంచి మొదలై రూ.70-80 వేల వరకు ఉంటుంది.
* అనేక పోర్ట్ ఫోలియోలిలో పెట్టుబడిదారులు ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంది.
* ఇందులో మొత్తం డబ్బును ఒకేసారి పెట్టుబడి పెట్టొచ్చు. క్రమబద్ధమైన పెట్టుబడులు కూడా చేయవచ్చు.
* ఇందులో లాక్-ఇన్ లేదు. కాబట్టి పెట్టుబడిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు తీసుకోవచ్చు.
* స్మాల్ కేస్ అనేవి బ్రోకరేజ్ హౌసెస్ లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్స్ మేనేజ్ చేస్తారు.
డిమ్యాట్ అకౌంట్ ద్వారా మనం కావాలనుకుంటే మనకు నచ్చని స్మాల్‌కేస్‌ను మనమే క్రియేట్ చేసుకోవచ్చు.
what are the charges for small case investment
సాధారణంగా ఒక పోర్ట్ పోలియో మేనేజ్ చేయాలంటే కనీస పెట్టుబడి లక్షల్లో ఉండాలి. ఆ మేనేజర్‌కి దానికి తగ్గట్టుగా చార్జీలు చెల్లించాలి. కానీ చిన్న, చిన్న పెట్టుబడి పెట్టేవాళ్ళకి ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు. వీటన్నింటినీ అధిగమిస్తూ స్మాల్ కేస్ ఇన్వెస్టింగ్ అనే ఒక ప్లాట్ ఫామ్ వచ్చింది. ఆ ప్లాట్ ఫామ్ లో స్మాల్ కేస్ వెబ్ సైట్ లోకి వెళ్తే మనకి కొన్ని థీమ్స్ ఉంటాయి. మనం ఆ థీమ్స్ పై క్లిక్ చేసుకుంటే ఆ షేర్లపై ఇన్వెస్ట్ మెంట్ అయిపోతుంది. దీనిలో మళ్ళీ మనం సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
స్మాల్ కేస్ లో అప్లై చేస్తే రూ.100 మాత్రమే ఫీజు అది కూడా ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది. మనం సిప్ ద్వారా స్మాల్ కేస్ థీమ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే థీమ్ కి మాత్రం రూ.100 ఛార్జ్ ఉంటుంది. మిగతా ఏదైనా సంస్థల్లో బ్రోకరేజ్ ఉంటే మన బ్రోకింగ్ ఛార్జస్ ఎంతైతే ఉంటాయో స్మాల్ కేస్ లో కూడా అంతే ఛార్జస్ పడిపోతాయి. మన ఛార్జస్ ఎలా ఉంటాయో అనేది మనం లెక్కవేసుకుంటే సరిపోతుంది.
Small case is better than mutual funds
స్మాల్ కేస్ అనేది మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటరా
స్మాల్ కేస్ అనేది ఒక రకంగా మ్యూచువల్ ఫండ్‌కి దగ్గరగా ఉన్నప్పటికీ రెండింటికీ చాలా తేడాలున్నాయి.
రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఇది చాలా ఉపయోగపడే అవకాశం ఉంది.
మ్యూచువల్ ఫండ్స్ లో మనకి పెద్ద థీమ్స్ ఉంటాయి. ప్యూర్ డెట్ ఫండ్స్, ప్యూర్ ఈక్విటీ గ్రోత్స్ ఇలా రకారకాల బ్రాడ్ థీమ్స్ ఉంటాయి. బ్రాడ్ థీమ్స్ లో ఉన్నప్పుడు వాటిపై రిటర్న్స్ ఎక్కువ రావు.
ఇక్కడ సాధారణంగా 70 – 80 స్టాక్స్ మెంటైన్ చేస్తారు. అందువల్ల నష్టం, లాభం అనేవి యావరేజ్ అయి ప్రాఫిట్ తగ్గుతుంది.
స్మాల్ కేస్‌లో చాలా తక్కువ స్టాక్స్ ఉంటాయి. అందుకే వాటిలో రిటర్న్ కూడా ఎక్కువగా ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్లో నష్ట భయం చాలా తక్కువ. కానీ స్మాల్ కేస్‌లో మార్కెట్ ఆధారితంగానే ఉంటుంది.
స్మాల్ కేస్ లో ప్రత్యక్షంగా స్టాక్ మార్కెట్ లో పెట్టిన అనుభూతి కలుగుతుంది. మన డీమ్యాట్ అకౌంట్లో ఖచ్చితంగా ఆ షేర్స్ ఉంటాయి. కానీ మ్యూచువల్ ఫండ్‌లో ఆ ఫీల్ ఉండదు. మనం డైరెక్ట్ గా షేర్స్ ను ఫీల్ అవుతాం. ఆ షేర్స్ ఇచ్చిన డివిడెండ్ ను ఫీల్ అవుతాం. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ కంటే స్మాల్ కేస్ ఇన్వెస్టింగ్ బెటర్ ఆఫ్షన్ అని చెప్పుకోవచ్చు.
స్మాల్ కేస్‌లో ఎక్కువ థీమ్స్ ఉండడం వల్ల మనకి సెలక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది.
How does Small Case compare with Mutual Funds in expenses
మ్యూచువల్ ఫండ్స్ లో 1 శాతం ఎక్స్ పెన్స్ రేషియో ఉంటుంది. అంటే వాళ్ళు ఫండ్ మేనేజ్ చేస్తే కొంత అమౌంట్ ఫీజు తీసుకుంటారు. ఆ విషయం మనకి తెలియదు. మన అకౌంట్లో నుంచి ఎక్స్ పెన్స్ రేషియో రూపంలో కొంత పోతుంది. మనకి లాక్ ఇన్ పిరియడ్ ఉంటుంది. అందు వల్ల ముందుగా మనం డబ్బులు తీసుకుంటే 1 శాతం వరకూ అదనపు చార్జీలు పడతాయి.
స్మాల్ కేస్ లో మనకి లాకింగ్ పిరియడ్ ఉండదు. మనం ఏ రోజు ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఆ రోజు ఎగ్జిట్ అయిపోవచ్చు. స్మాల్ కేస్ ప్లాట్ ఫామ్ లో అకౌంట్ ఓపెనింగ్ ఛార్జస్ ఏమీ ఉండవు. అకౌంట్ మెంటైనెన్స్ ఛార్జస్ ఉండవు. ఎగ్జిట్ లోడ్ ఉండదు.
Leave a Reply