కార్పొరేట్ ఎఫ్ డీ లాభమేనా..?

corporate FDs are profitable or not

మ‌నంద‌రికీ తెలిసిన అత్యంత సంప్ర‌దాయ‌, సుర‌క్షిత పెట్టుబ‌డి సాధ‌నం ఫిక్స్‌డ్ డిపాజిట్‌. వీటిని మ‌నం చాలా వ‌ర‌కు బ్యాంకుల్లోనే చేస్తుంటాం. వీటిపై కొంత శాతం వ‌డ్డీని ఇచ్చి బ్యాంకులు రాబ‌డిని అందిస్తుంటాయి. అయితే ఇదే విధంగా ఎఫ్‌డీల‌ను కార్పొరేట్ సంస్థ‌లు కూడా అందిస్తున్నాయి. వీటినే కార్పొరేట్ ఎఫ్‌డీలు అంటారు. ఇవీ సుర‌క్షితమైన‌వే అయినా కొంచెం ప‌రిశీలించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

what are corporate FDs

కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ను పోలి ఉంటుంది. బ్యాంకు కన్నా కూడా మంచి రాబడిని ఇస్తుంది. కంపెనీని బట్టి రిస్క్ ఉంటుంది. కొన్ని కంపెనీలు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తాయి. కానీ ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి.

చాలామంది రిస్క్ ఎక్కువ‌గా ఉన్న పెట్టుబడుల నుంచి రిస్క్ తక్కువ‌గా ఉన్న పెట్టుబడులకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. మనకు రాబడి తక్కువ ఇచ్చినా కూడా ప్రమాణాలు బాగుండే ఆర్థిక సంస్థలకు ఎక్కువప్రాధాన్యం ఇస్తాం. ఈ రాబడినిచ్చే వాటిలో బాండ్లు, డిబెంచర్లు, డిపాజిట్‌ పత్రాలు, డెట్ ఫండ్ లు, ఫిక్స్డ్ డిపాజిట్లు మొదలైనవి ఉంటాయి.

బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు 5 నుంచి 5.5శాతం రాబడిని అందిస్తాయి. కానీ కార్పొరేట్ ఎఫ్ డీలు రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ ఇస్తాయి. ఈ కార్పొరేట్ సంస్థలు రేటింగ్ ఉండి, ఎక్కువ భద్రతా స్థాయిని కలిగి ఉంటాయి. వీటిలో 1-5 సంవత్సరాల డిపాజిట్ కు 7.50 శాతం-9శాతం వరకు రాబడి అందించేవి ఉన్నాయి.

కార్పొరేట్ ఎఫ్ డీ లకు రేటింగ్ సంస్థలు గ్రేడింగ్ లు ఇస్తాయి. ఈ టర్మ్ డిపాజిట్లను సాధారణంగా ఇక్రా, కేర్, క్రిసిల్ మొదలైన రేటింగ్ ఏజెన్సీల ద్వారా రేట్ చేస్తారు. తక్కువ వడ్డీ ఇచ్చినా ఎక్కువ కార్పొరేట్ ప్రమాణాలు పాటించే కంపెనీలకు సాధారణంగా ఏఏ నుంచి ఏఏఏ క్రెడిట్ రేటింగ్ ని ఇస్తాయి. రేటింగ్ త‌గ్గితే డిపాజిట్లకు భద్రతా స్థాయి తగ్గినట్టే.

how to select corporate FDs

మనం కార్పొరేట్ లో ఎక్కువ వడ్డీ రేటు వల్ల న ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను ఇస్తాయి. దీనికి కారణంగా ఎక్కువ రాబడిని పొందుతాం.

ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే ముందు కార్పొరేట్ కంపెనీ వివ‌రాలు తెలుసుకోవాలి. సంస్థ పాటిస్తున్న‌ ప్ర‌మాణాలను, లాభ‌న‌ష్టాల‌ను ప‌రిశీలించాలి.
* ఆయా కంపెనీలు తమ వాటాదారులకు రెగ్యులర్ డివిడెండ్ని చెల్లిస్తుందా లేదా తెలుసుకోవాలి.
* కంపెనీ బ్యాలెన్స్ షీట్ కనీసం 3ఏళ్ళు స్థిరమైన లాభాలను చూపించాలి. గత 5 ఏళ్ళు ఆ కంపెనీ పొజిషన్ ని పరిశీలించాలి.
* ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. స్టాక్ ఎక్స్చేంజీలో ఉన్న కంపెనీలు సెబీ నియంత్రణలో ఉంటాయి. కాబ‌ట్టి వీటిపై ఎటువంటి భ‌యం అక్క‌ర్లేదు.

Author photo
Publication date:
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *