మన కుటుంబం కోసం చేసే మంచి పనులలో లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనం కొన్ని విషయాలను పరిశీలించాలి. అందులో వచ్చే ప్రత్యేక సదుపాయాలు, అదనపు వెసులుబాట్ల గురించి తెలుసుకోవాలి. మనం ఎంత ఎక్కువ ప్రీమియం తీసుకుంటే మనకు అంత ఎక్కువ క్లెయిమ్ వస్తుంది. ఇది మనతో పాటు మన కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది.
హెల్త్ ఇన్సురెన్స్ లో రెండు రకాలు ఉన్నాయి.
1.Floater Health Insurance: ఈ ఇన్సురెన్స్ కుటుంబం మొత్తానికి వర్తిస్తుంది.
2. Individual Health Insurance: ఈ ఇన్సురెన్స్ ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది.
ఇప్పుడు చాలా హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీలు ఉన్నాయి. అయితే మనం ఏ కంపెనీలో ఇన్సురెన్స్ చేస్తే మంచిది తెలుసుకుందాం. మన అవసరాలకు తగ్గట్టు ఉన్న కంపెనీలను ఎంచుకోవాలి.
* మనకు ప్రీమియం ఎక్కువయినా మంచి కంపెనీలో హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవాలి.
* అనారోగ్య కారణంగా లోకల్ ఆసుపత్రిలో చేరినపుడు అ ఆసుపత్రికి మనం హెల్త్ ఇన్సురెన్స్ చేసే కంపెనీ అనుసంధానం అయి ఉందో లేదో చూసుకోవాలి.
* ఎటువంటి లిటికేషన్ లేకుండా ఉన్న కంపెనీలలో హెల్త్ ఇన్సురెన్స్ చేసుకోవాలి.
* కేరీ ఫార్వర్డ్ ఆప్షన్ ఎంత ఉందో పరిశీలించాలి.
* మనకు ఆ కంపెనీ ఎటువంటి వ్యాధులకు కవరేజీ ఇస్తున్నారు అని తెలుసుకోవాలి.
* ఏ కంపెనీ అయితే వెయిటింగ్ పిరియడ్ తక్కువ ఉంటుందో ఆ కంపెనీని చేసుకుంటే మనకు లాభం.
* ఇది వరకు ఆ కంపెనీ క్లెయింలను ఎంత ఎక్కువగా ఇచ్చిందో రివ్యూస్ చూసి పరిశీలించాలి.
నో క్లెయిమ్ భోనస్…
మనం ప్రీమియం కట్టిన తర్వాత ఎటువంటి ట్రీట్ మెంట్ తీసుకోలేదు. కాబట్టి ఈ ఇన్సురెన్స్ వలన మనకు ఏంటి లాభం. దీనినే నో క్లెయిమ్ భోనస్ అంటారు. మనం ఏ కంపెనీ అయితే నో క్లెయిమ్ భోనస్ ఎక్కువ ఇస్తుందో ఆ కంపెనీలో హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవడం మంచిది.
ఎంత అవసరమో గుర్తించాలి
Find out how much is needed
చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ప్రీమియం ఎంత అని అంటారు. ప్రీమియం ఎంతని కాదు. అసలు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవసరమో గుర్తించాలి. ఇప్పుడు బాగానే ఉన్నాం కదా.. యుక్త వయసులోనే ఉన్నాం.. ఏ అనారోగ్య సమస్యలు లేవు కాదా.. మనకి కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది కదా .. ఇంకెందుకు హెల్త్ ఇన్సూరెన్స్ అని ఆలోచించడం సరికాదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మరోవైపు హాస్పిటల్ ఖర్చులు ఏటా మూడు రెట్లు పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో చిన్న సర్జరీ కూడా రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి చేరినా రూపాయి కట్టకుండా వైద్యం పొందాలంటే తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటున్నారు ఆర్థిక నిపుణులు.
రూ. కోటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం
Rs. 1 crore health insurance required
రోజురోజుకూ పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా.. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యబీమా తప్పనిసరి అయింది. అయితే ఏటా వైద్య చికిత్స ఖర్చులు పెరిగిపోతుండడంతో రూ. కోటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. రూ. కోటి రూపాయల వరకు ఆరోగ్య కవరేజీని అందించే అనేక బీమా పాలసీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. క్లిష్టమైన అనారోగ్యాలు కలిగిన కుటుంబాలకు ఇటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్యాన్సర్లు, మూత్రపిండాలు, కాలేయం, గుండె మార్పిడి వంటి ప్రధాన అవయవ మార్పిడికి సంబంధించిన చికిత్సలకు కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులలో రూ.25 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఖర్చులు అవుతున్నాయి. అంతేకాకుండా ఈ చికిత్సలు దీర్ఘకాలికంగా కొనసాగుతూ, తరచూ స్క్రీనింగ్ టెస్ట్లు వంటి అవసరాలు ఉంటాయి. ఇలాంటి వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని రూ.1 కోటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం. ఎక్కువ బీమా మొత్తాన్ని ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ప్రాథమిక అవసరం
health insurance is a basic requirement
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రాథమిక అవసరం. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఇది అత్యవసర సమయంలో మీకు సహాయపడుతుంది. క్యాష్‌ఫ్లోను కాపాడటం.. అనుకోని ఖర్చులను ఎదుర్కోవడానికి ప్రీమియం చెల్లించడం చాలా అవసరం. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కీలక భాగంగా ఉండాలి. తద్వారా ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు. అనుకోని పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీకు నష్టాల నుండి రక్షణ ఇస్తుంది. ఇది మీ ఆర్థిక రక్షణకు అండగా నిలుస్తుంది.
తక్కువ ఖర్చుతో ఎక్కువ కవరేజీ
More coverage at less cost
యుక్త వయసులో ఉన్నప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ కవరేజీని పొందొచ్చు. అవసరం ఏర్పడినప్పుడు ఆసుపత్రిలో చేరడమే కాకుండా డే-కేర్ విధానాలు, ప్రీ/పోస్ట్-హాస్పిటలైజేషన్, ఓపీడీ ఖర్చులు మొదలైనవి కూడా బీమా సంస్థ కవర్ చేస్తుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు సాధారణంగా బాధ్యతలు పరిమితంగా ఉంటాయి. అలాంటప్పుడు వ్యక్తిగత ఆరోగ్య బీమాను ఎంచుకుని ఆపై అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. రైడర్స్‌ను కూడా కొనుగోలు చేయొచ్చు. దీంతో మీ పాలసీ పరిధిని మరింత మెరుగుపర్చుకోవచ్చు. యుక్త వయసులో ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం వల్ల తక్కువ ప్రీమియం నుంచి ప్రయోజనం పొందడమే కాకుండా సహ చెల్లింపు, క్యాపింగ్ మొదలైన పరిమితులు లేకుండా ఆరోగ్య రక్షణ పొందొచ్చు. ఆరోగ్య బీమా పాలసీని పునరుద్ధరించడానికి గరిష్ఠ వయసు సాధారణంగా 65-70 సంవత్సరాలు. కానీ, మీరు యుక్త వయసులో పాలసీ కొనుగోలు చేస్తే జీవితకాల పునరుద్ధరణ ఎంపికను పొందొచ్చు. యుక్త వయసులో ఆరోగ్య బీమా పాలసీ దరఖాస్తు చేసుకున్నప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులకు వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా వారి ప్రీమియాన్ని నిర్ణయిస్తారు. అంతేకాకుండా రిస్క్ పరిమితిని బట్టి బీమా సంస్థలు పాలసీని తిరస్కరించే అవకాశముంది. యుక్త వయసులో బీమా తీసుకునే వారికి ఈ పరిస్థితి ఉండదు. యవ్వనంలో ఆరోగ్య సమస్యలు తక్కువ కాబట్టి మీ బీమా పాలసీ తిరస్కరించే అవకాశం సాధారణంగా ఉండదు.
వయసును బట్టీ ప్రీమియం
సాధారణంగా బీమా ప్రొవైడర్ వసూలు చేసే ప్రీమియం మొత్తం పాలసీదారుడి ప్రస్తుత వయసుపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి రూ.5 లక్షల విలువ గల ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే ప్రీమియం సుమారుగా రూ.5,500-6,000 వరకు ఉంటుంది. 35 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకున్నప్పుడు బీమా ప్రీమియం సుమారుగా రూ.7,000- 7,500 వరకు ఉంటుంది. 45 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకుంటే ప్రీమియం సుమారుగా రూ.8,500- 9,000 వరకు ఉంటుంది. 60 ఏళ్ల సీనియర్ సిటిజన్ పాలసీ తీసుకుంటే రూ.15,000-21,000 వరకు అవుతుంది.
పన్ను మినహాయింపు.. Tax exemption
యుక్త వయసులో ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం వల్ల పాలసీదారుడు ఎక్కువ కాలం పాటు పన్ను ప్రయోజనాలను పొందగలుగుతారు. తద్వారా చెల్లించే ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం సెక్షన్ 80D కింద పాలసీదారుడు మినహాయింపు పొందొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల వరకు పన్ను మినహాయింపులను క్లెయిం చేయొచ్చు. దీర్ఘకాలం పాటు పన్నులను ఆదా చేసుకోవడానికి అవకాశముంటుంది.
కంపెనీ ఇన్సూరెన్స్ సరిపోతుందా
Is the company insurance enough
సాధారణంగా మీరు పనిచేసే కంపెనీలు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తున్నాయి. అయితే కంపెనీ ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించినప్పటికీ మీకు, మీ కుటుంబానికి సొంతంగా వేరే ఆరోగ్య బీమా పాలసీ ఉంటేనే మంచిది. సాధారణంగా కార్పొరేట్ పాలసీతో పోలిస్తే వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలో ఎక్కువ ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. కంపెనీ ఇన్సూరెన్స్ పాలసీలో అందించే సగటు బీమా మొత్తం రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉండొచ్చు. ప్రస్తుత కాలంలో ఈ బీమా మొత్తం ఏ మాత్రం సరిపోదు. ప్రతి కుటుంబానికి కనీసం రూ.10-15 లక్షల ఆరోగ్య బీమా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
* చాలా వరకు బృంద బీమా పాలసీలు తల్లితండ్రులను కవర్ చేయవు. కొన్ని పాలసీలలో జీవిత భాగస్వామి, పిల్లలకు కూడా కవరేజ్ ఉండదు. ఇలాంటి పాలసీలు అత్యవసర పరిస్థితుల్లో ఆర్ధిక ఒత్తిడికి గురి చేస్తాయి. కార్పొరేట్ పాలసీ అందరికీ సరిపోయేంతా విస్తృతమైన ఆరోగ్య భద్రతను అందించలేదు. ఈ నేపథ్యంలో కుటుంబానికి తగినంత ఆరోగ్య బీమా కవరేజీని తీసుకోవాలి.
* మీరు ఉద్యోగం మారాలని నిర్ణయించుకున్నా, ఉద్యోగ విరమణ చేసినా లేదా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా కంపెనీ బీమా పాలసీ ఇక ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా/ఫ్యామిలీ అంతటికీ ఆరోగ్య బీమా పాలసీ తీసుకోక తప్పదు. ఇలాంటి పరిస్థితిని ముందుగానే గ్రహించి, ఉద్యోగులు కంపెనీ పాలసీపై ఆధారపడకుండా వ్యక్తిగతంగా వేరే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం ఉత్తమం.