
మనలో చాలా మందికి తక్కువ జీతమే వస్తుండవచ్చు. కనీసం 20 వేల రూపాయలు, అంతకంటే తక్కవే జీతం వచ్చేవారి సంఖ్య ఎక్కువే. అయితే ఇలాంటి అల్పాదాయ వర్గాల వారు కూడా ధనవంతులవవచ్చా అనే ప్రశ్న మనలో చాలా మందికి కలుగుతుంది. అయితే దీనికి సమాధానం అవుననే చెప్పవచ్చు. కొంచెం క్రమశిక్షణ, సరైన ప్లానింగ్ ఉంటే ఇది సాధ్యమే. అయితే ధనవంతులవడానికి పొదుపు, పెట్టుబడి అనేది చాలా అవసరం. కానీ పెట్టుబడి కన్నా ముందు మనం ఫైనాన్సియల్ ప్లానింగ్ చేసుకుని మానసికంగా సిద్ధమవడం చాలా అవసరం.
If your salary is low, do financial planning like this
తక్కువ జీతమైతే ఇలా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి
ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మనకి రాబోయే అవసరాలు గుర్తించి, వాటికి ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుని మధ్యలో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే దానిని ఎదుర్కోగలిగే ఆర్థిక స్థైర్యం కలిగి ఉండడం.
ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత వచ్చే పరిణామాలకి మనం ఇబ్బందులు పాలవుకుండా ఉండాలంటే ప్లానింగ్ తప్పనిసరి. అనుకోని పరిస్థితుల్లో మనకి ఇబ్బంది లేకుండా, మన రిటైర్మెంట్ తర్వాత కూడా ధైర్యంగా ఉండడానికి ఉపయోగపడేదే ఈ ప్లానింగ్.
ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యడం అనుకుంటారు. కానీ అదొక్కటే కాదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే జరగరానిది జరిగితే ఏమిటి? అనుకోని సంఘటనలు జరిగితే పరిస్థితి ఏమిటి ? రాబోయే అవసరాలకు కావలిసినది ఎంత ? దానిని ఎలా ఇన్వెస్ట్ చేయగలుగుతాం. ఇవ్వన్నీ ముందే ఆలోచించి సిద్ధంగా ఉండడం.
* మనం ఇన్వెస్ట్ చేసేటపుడు మనం ఏకారణంతో ఇన్వెస్ట్ చేస్తున్నామో తెలుసుకుంటే బెటర్ గా మేనేజ్ చేసుకోవచ్చు. అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారని మనం ఇన్వెస్ట్ చెయ్యకుండా, దేని కోసం చేస్తున్నామో అనేది తెలుసుకుని, అప్పుడు చేయాలి.
* ఫైనాన్సియల్ ప్లానింగ్‌లో ఇన్సూరెన్స్ అనేది కీలకం. మన జీవితానికి, ఆరోగ్యానికి బీమా చేసుకుంటే మనకు ఆర్థికంగా భరోసా దొరుకుంది. ఆరోగ్య బీమా చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే జబ్బులు, అనారోగ్యాల చికిత్సలకు మనం ఏమీ చెల్లించక్కర్లేదు. ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స పొందవచ్చు.
జీవిత బీమా చేసుకుంటే రేపు మనం అర్ధాంతరంగా చనిపోయినా మన కుంటుంబానికి కావాలిసినంత ఆర్థికభరోసా చేకూరుతుంది.
* ప్రతి ఒక్కరూ పిల్లల చదువుల కోసం ఇన్వెస్ట్ చేస్తారు. కానీ పిల్లల చదువులకు ఎంత కావాలో క్లియర్ గా చెప్పలేం. మనం మన పిల్లల చదువులకు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టగలం అనేది తెలుసుకోవాలి.
దానికోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి.
* వచ్చిన డబ్బులను ఎవ్వరూ పారేయరు. ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ, ఇక్కడ పెట్టడం కంటే ఎందులో పెడితే బాగుంటుందో తెలుసుకోవడమే ఫైనాన్షియల్ ప్లానింగ్.
* ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలనుకున్నప్పుడు మనం మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించాలి. మనీని మనం మేనేజ్ చేసేటప్పుడు ఎమోషన్స్ బాగా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందుకే మన మనీని ఒక ప్రోఫెషనల్ మేనేజ్ చేసినపుడు బెటర్ గా ఉంటుంది.
* ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే రాబోయే అవసరాలు ఏమేమి ఉన్నాయి..? అది ఏ సంవత్సరంలో వస్తుంది..? దానికి కావలిసిన కార్పస్ ఎంత.. ? ఆ కార్పస్ ని బిల్డ్ చేయడానికి మనకి ఉన్న ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్స్ ఏమిటి..? వాటిలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ ఏమిటి.. ? ఇవన్నీ తెలుసుకోవాలి.
* మనకి ఏం కావాలనుకుంటున్నామో, ఎప్పుడు కావాలనుకుంటున్నామో, ఎంత కావాలనుకుంటున్నామో ముందుగా నిర్ణయించుకోవాలి. మనం ఎంచుకున్న ఆ ప్రొడక్ట్ అనేది మన టైమ్ కి సెట్ అవ్వాలి. అందులో ఉన్న రిస్క్, వలటాలిటీని మనం బేర్ చేసుకోగలగాలి. అదే టైమ్ లో మన రిక్వైర్ మెంట్ ఫిల్ చేసుకోగలగాలి. ఒక్కక్కరి లక్ష్యం బట్టి ఎందులో ఇన్వెస్ట్ చెయ్యలో తెలుసుకోగలగాలి.
* ప్యూచర్ గురించి ప్లానింగ్ చేసినపుడు ప్రోపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని చేయగలుగుతాం. అనుకోకుండా జరిగే సంఘటనలను మేనేజ్ చెయ్యగలుగుతాం. మనం ఎంత అమౌంట్ పెట్టినా ఎందుకు పెడుతున్నామో తెలియకపోతే మనకి ప్రశాంతత ఉండదు.
ఫైనాన్షియల్ ప్లానింగ్ అయిన తర్వాత మనం చూడాల్సింది ఇన్వెస్ట్‌మెంట్.ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనల్ని ధనవంతులుగా, మరింత మెరుగైన జీవన విధానం పొందేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనకు మంచి లాభాలను ఇచ్చేదై ఉండాలి. ఎందులో ఇది సాధ్యపడుతుందో చూద్దాం.
how to become rich with low salary
మనకు వచ్చిన తక్కువ జీతంతో ధనవంతులం అవ్వగలమా..? ఖచ్చితంగా కాదు. మనకు నెలకు 20,000 జీతం వస్తే మనం వెల్త్ ను క్రియేట్ చేయడమనేది కష్టమే అని చెప్పుకోవాలి. నిజంగా నెలవారి జీతం వచ్చినవారు ధనవంతులు అవ్వడం కుదరదా.. మరిఎలా.. ?
ఒక వేళ లక్షరూపాయల జీతం వచ్చినా చాలా మంది ధనవంతులవలేరు. ఎందుకంటే ఉద్యోగస్థుడిలా ఆలోచించి కుటుంబ నిర్వహకుడిలా ఖర్చు చేస్తే మిగిలేది సున్నా.
ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం గ్రహించాల్సి ఉంది. 10 వేల జీతగాడికీ ఖర్చులు ఉంటాయి.. లక్ష రూపాయల జీతగాడికీ అందుకు తగ్గ ఖర్చులుంటాయి. ఇద్దరి పరిస్థితుల్లోనూ ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు డిజైన్ అయిపోతాయి. ఫైనల్‌గా నెలాఖరుకు ఇద్దరి పరిస్థితీ ఒక్కటే. ఒక వేళ జీతం పెరిగినా అందుకు తగ్గ ఖర్చులూ పెరిగిపోతుంటాయి. అందుకే ఇక్కడ మారాల్సింది జీతం కాదు.. మన ఆలోచన. మనం ఖర్చు చేసే విధానం.
why should we invest first
ముందు పొదుపు.. తర్వాతే ఖర్చు
ముందు మనకు జీతం రాగానే ఖర్చులు అవ్వగా మిగిలినది ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే మనం ఎప్పుడూ ధనవంతులు అవ్వలేం. 1930లో The Richest Man in Babylon అనే పుస్తకాన్ని రచించిన George Samuel Clason ఇదే విషయాన్ని చెప్పారు. ఈ పుస్తకంలో నెలజీతం వచ్చిన వారు ధనవంతులు అవ్వాలంటే ఏమి చేయాలనేది వివరించారు. ఈ పుస్తకం ప్రకారం Pay Yourself First అనేది ప్రాథమిక సూత్రంగా చెప్పుకోవచ్చు.
మనకు ముందు నెలజీతం రాగానే దానిలోనుంచి 1000 లేదా 2,000 మనకు ఎంత వీలైతే అంత ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్స్ లో కానీ మనకు అందుబాటులో ఉన్న మెరుగైన పొదుపు సాధనంలో ఇన్వెస్ట్ చేసి మిగిలిన డబ్బులతో మనం లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఇన్వెస్ట్ చేసిన ఈ డబ్బు 20 సంవత్సరాల తర్వాత మన పిల్లలను కోటీశ్వరులు చేస్తుంది. మనకు నెలజీతం రాగానే ముందు ఖర్చు పెట్టకుండా కొంత డబ్బును సేవ్ చేసి మిగిలిన డబ్బులతో ఖర్చు పెట్టాలి. ఈ పద్దతి ప్రకారం చేస్తే ఖచ్చితంగా ధనవంతులు అవ్వ వచ్చు.
make crore with thousand per month
ఆశ్చర్యకర విషయం ఏంటంటే..
28 సంవత్సరాల పాటు నెలకు కేవలం 1000 రూపాయలను మనం మంచి మ్యూచువల్ ఫండ్‌లో దాచుకుంటూ పోతే 18 శాతం రిటర్న్‌తో అది కోటి రూపాయలు అవుతుంది. ఇది మోసం కాదు, అత్యాశ కూడా కాదు. ఇది సాధ్యమే. ఓ సారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఆశ్చర్య పోతారు. ఇక్కడ మనం పెడుతున్న డబ్బు 3లక్షల 36 వేల రూపాయలు మాత్రమే. కానీ టైం కాంపౌండింగ్ వల్ల ఇంత పెద్ద మొత్తం ప్రాఫిట్ పొందగలుగుతున్నాం.
ముందు ఖచ్చితంగా కొంత మనీని సేవ్ చేయండి.. ఆ తర్వాత మన పిల్లలు ధనవంతులు అవుతారు. మనం The Richest Man in Babylon లాంటి పుస్తకాలు చదివితే ఫైనాన్షియల్గా మరిన్ని ఐడియాస్ వస్తాయి.