
ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ ప్రజలకు తినడానికి ఆహారం కూడా దొరకడం లేదు. నిత్యవసర వస్తువులు కోసం పెద్ద, పెద్ద లైన్లులో నిలబడి ఉండాల్సి వస్తుంది. రోజురోజుకూ అక్కడ ధరలు పెరుగుతున్నాయి. షాపులన్ని వస్తువులు లేక ఖాళీగా ఉన్నాయి. పెట్రోల్ బంకుల దగ్గర జనాలను కంట్రోల్ చేయలేక శ్రీలంక గవర్నమెంట్ తన మిలట్రీని ఉపయోగిస్తుంది. ఎగ్జామ్స్ ను కండక్ట్ చేయడానికి పేపర్స్, ఇంకు లేక ఎగ్జామ్స్ ను రద్దు చేసింది. న్యూస్ పేపర్స్ ప్రింటింగ్ ను కూడా ఆపేశారు. ఈ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోలేక శ్రీలంక ప్రజలు డబ్బులను సంపాదించడానికి సముద్ర మార్గం ద్వారా ఇండియాకు వలస వస్తున్నారు. అలా అక్రమంగా రావడం వల్ల మనదేశం వాళ్ళను అరెస్టు చేస్తుంది. రాబోయే రోజులలో అలా వలస వచ్చే సంఖ్య పెరుగుతుందని మనదేశ గవర్నమెంట్ భావిస్తోంది.
ఫారెన్ కరెన్సీ లేక
ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి అప్పు ఉంటుంది. ఆ అప్పును ఎవరి దగ్గర తీసుకుంటుందంటే ఆ దేశంలో ఉన్న బ్యాంకుల దగ్గర లేదా స్టాక్ మార్కెట్ లో బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా లేదా వేరే దేశాల దగ్గర లేదా ఇంటర్నేషనల్ బ్యాంకు దగ్గర అప్పు తీసుకుంటుంది. తీసుకున్న అప్పును తిగిరి ఇన్ స్టాల్ మెంట్ లో చెల్లించాలి. ఈ ఇన్ స్టాల్ మెంట్ అనేవి కొన్ని అప్పులకి నెలకొకసారి లేదా సంవత్సరానికి ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది. కొన్నింటికి 5 సంవత్సరాలకి చెల్లించాల్సి ఉంటుంది. కొన్నింటికి 10 సంవత్సరాల కొకసారి చెల్లించవలిసి ఉంటుంది. ఒక వేళ దేశం వేరే దేశాలు దగ్గర గాని లేదా ఇంటర్నెషనల్ బ్యాంక్స్ దగ్గర గాని అప్పు తీసుకుంటే దానిని ఎక్స్ టర్నల్ డెబిట్ అంటారు. వేరే దేశాల నుంచి అప్పును డాలర్స్ లోనే తీసుకుంటారు. ఎందుకంటే డాలర్స్ స్టాండర్డ్ కరెన్సీ. డాలర్స్ లో తీసుకున్న అప్పు డాలర్స్ లోనే తిరిగి చెల్లించాలి. ఈ విధంగా చూస్తే ప్రస్తుతం శ్రీలంకకి 56 బిలియన్ డాలర్స్ ఎక్స్ టర్నల్ అప్పు ఉంది. ఈ సంవత్సరం శ్రీలంక 6 బిలియన్ డాలర్స్ ఇన్ స్టాల్ మెంట్ కట్టాలి. కాని శ్రీలంక దగ్గర ఫారన్ కరెన్సీ కేవలం 2 బిలియన్ డాలర్స్ మాత్రమే ఉన్నాయి. మరి ఎం చేయగలదు..
impact of concessionary loans on sri lanka
కమర్షయల్ లోన్స్‌తోనే ఇబ్బంది
ఏ దేశం అయినా వేరే దేశాలు దగ్గర అప్పు తీసుకోవడం సహజం. కాని ఆ అప్పును ఎవరి దగ్గర తీసుకున్నామో ఎందుకు తీసుకున్నామో, తిరిగి చెల్లించగలమో లేదా అన్నది ముఖ్యం. కాని శ్రీలంక అప్పు వరల్డ్ బ్యాంకు నుంచి, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ దగ్గర తీసుకునేది. ఈ బ్యాంకులలో తక్కువ వడ్డీ ఎక్కువ రీపేమెంట్ పిరియడ్ ఉంటుంది. ఇలాంటి వాటిని Concessionary Loans అంటారు. ఇలాంటి అప్పు తీర్చడం శ్రీలంకకి పెద్ద కష్టం కాదు. కాని 2010లో తమ దేశాన్ని బాగా డెవలప్ చేయడానికి తమ దేశ ప్రజలకోసం పెద్ద, పెద్ద డెవలప్ మెంట్ ప్రోజెక్ట్ ను కట్టాలనుకుంది. ఆ ప్రోజెక్టుల కోసం చాలా డబ్బు అవసరం. దానికోసం వేరే దేశాల దగ్గర అప్పుతీసుకుంది. ఎందుకంటే ఆ దేశానికి వచ్చే ఆదాయం సరిపోదు. ఇలా వేరే దేశాలు దగ్గర తీసుకున్న అప్పును కమర్షియల్ లోన్స్ అంటారు. కాని ఇందులో వడ్డీ ఎక్కువ రీపేమెంట్ పిరియడ్ తక్కువ. ఆ అప్పు తీసుకున్న డబ్బులతో శ్రీలంక హైవే ప్రోజెక్ట్ ని నిర్మించింది. అలా కట్టిన దానిలో ఒకటి HAMBANTOTA PORT. ఇది శ్రీలంకలో సెకండ్ లార్జెస్ట్ పోర్ట్. శ్రీలంక అప్పులు తీసుకునే టైంలో తమ దేశానికి డాలర్స్ ఇన్కమ్ బాగానే ఉండేది. శ్రీలంకకి డాలర్స్ ఎక్కువగా టూరిజం నుంచి వచ్చేవి. అలాగే శ్రీలంక టీ, కాఫీ పంటలను ఎక్కువగా ఎక్స్ పోర్ట్ చేయడం వలన కూడా డాలర్స్ ఎక్కువగా వచ్చేవి. కానీ శ్రీలంక వీటిపైన ఆధారపడుతూ కొత్త సెక్టార్స్ ను పెద్దగా ప్రమోట్ చేయలేదు. అందువల్ల డాలర్స్ ఇన్ కమ్ అనేది ప్రతి సంవత్సరం పెరగకుండా ఉండిపోయాయి. అందు కోసం ఈ అప్పు చెల్లించలేక 2017లో శ్రీలంక హంబన్ తోట పోర్ట్ లో 85 శాతం షేర్ ని 1.12 బిలియన్ డాలర్స్ కి చైనాకు అమ్మివేసింది.
దెబ్బ మీద దెబ్బ
2019లో శ్రీలంకలో చర్చ్ లలో, లగ్జరీ హోటల్స్ లో బాంబు పేలుళ్లు సంభవించాయి. అందులో 269 మంది మరణించారు. వీళ్ళలో 45 మంది ఫార్నర్స్ కూడా ఉన్నారు. ఈ పేలుళ్ల వల్ల చాలామంది విదేశీయులు శ్రీలంకకి ట్రావెల్ చేయవద్దని చెప్పారు. అందువల్ల టూరిస్ట్ ల సంఖ్య తగ్గిపోయింది. 2020లో కరోనా వచ్చింది. దీనివలన పూర్తిగా పర్యాటక రంగం దెబ్బతింది. 2021లో శ్రీలంక కెమికల్ ఫెర్టిలైజర్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడం పూర్తిగా నిషేధించింది. సహజ సిద్దమైన ఎరువులతో పంటను సాగు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీని వలన రైతులు బాగా నష్టపోయారు. పంట దిగుబడి తగ్గిపోయింది. ఇందువల్ల షాపులన్నీ ఖాళీగా ఉంటున్నాయి. అందువల్ల శ్రీలంకలో ఆహార ఇబ్బందులు వచ్చాయి. వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఫారన్ కరెన్సీ కూడా లేదు.
what is sovereign credit rating
ఏదైనా ఒక దేశానికి SOVEREIGN CREDIT RATING అని ఉంటుంది. దేశానికి SOVEREIGN CREDIT RATING తక్కువగా ఉంటే లోన్స్ ఇవ్వరు. ఒక దేశం తీసుకున్న అప్పు టైం కి ఇవ్వకపోతే SOVEREIGN CREDIT RATING తగ్గిపోతుంది. అప్పుడు ఆ దేశానికి వేరే దేశం లోన్స్ ఇవ్వవు.
ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి శ్రీలంక DEBT RESTRUCTURING చేస్తుంది. అంటే కొన్ని సంవత్సరాలు ఇన్ స్టాల్ మెంట్ ని చెల్లించడానికి వాయిదా వేయడం. ఆలా చేస్తే దేశంలో ఉన్న ఫారన్ కరెన్సీని అప్పులు కట్టడం ఆపేసి ప్రజలపై ఖర్చుపెట్టవచ్చు అని శ్రీలంక భావిస్తుంది. అందుకే శ్రీలంక తమ దేశానికి అప్పు ఇచ్చిన దేశాలకు DEBT RESTRUCTURING అడుగుతుంది.