ఐపీవోకు ఎల్ ఐ సీ..
lic launches indias largest ipo
ఐపీవోకు ఎల్ ఐ సీ..
ఈ ఏడాదే రానున్న మరో నాలుగు ప్రభుత్వ సంస్థలు
నిధుల సమీకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. డిస్ ఇన్వెస్ట్‌మెంట్ లో భాగంగా ప్రభుత్వం ప్రవేటీకరణ మార్గం ఎంచుకోవడంతో కొన్ని ప్రభుత్వ సంస్థలు ఐపీవోకు వస్తున్నాయి. తమ PSU ల ద్వారా ప్రభుత్వం కూడా నిధులను సమీకరిస్తుంది. గత కొన్నేళ్లలో ప్రభుత్వం ప్రవేటీకరణ, విలీనం, పెట్టుబడుల ఉపసంహరణ, షేర్ల విక్రయం ద్వారా నిధులను సమీకరించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2022లో పలు ఐపీవోలతో ముందుకు వస్తోంది. ఈ ఏడాది వచ్చే ఐదు ఐపీవోలను ఇక్కడ చూద్దాం… ఇందులో ముఖ్యమైనది ఎల్ఐసీ..
what are the psu ipos in 2022
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వరంగ సంస్థ.. భారత స్టాక్ మార్కెట్ లో అతిపెద్ద ఐపీవోగా నిలువనుంది. సమాచారం మేరకు ఎల్ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పూర్తి అవుతుంది. 2022 లో భారత క్యాపిటల్ మార్కెట్ వృద్ధికి ఎల్ఐసీ ఐపీవో కీలకం కానుంది.
ఎల్ఐసీ ఐపీవోకు వీలుగా కేంద్రం లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ చట్టంలో సవరణలు చేస్తూ చైర్మన్ పదవిని మరో ఏడాది పాటు పొడిగించింది.
ecgc limited ipo
ఈసీజీసీ లిమిటెడ్
ప్రభుత్వరంగ సంస్థలు ఈసీజీసీ లిమిటెడ్, నేషనల్ లీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఈ రెండు కూడా ఐపీవోకు వస్తున్నాయి. ఈసీజీసీ అంటే ఎక్స్ పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ప్రభుత్వ రంగ క్రెడిట్ ప్రొవైడర్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఉంది. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఈ కంపెనీ వివిధ ఆన్ లైన్ సేవలు అందిస్తుంది.
national seeds corporation ipo
నేషనల్ సీడ్స్ కార్పొరేషన్
నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్(NSC) కూడా ఐపీవో కు వస్తుంది. ఇది వ్యవసాయ కార్పోరేషన్, రైతు సంక్షేమశాఖ, వ్యవసాయ కార్పోరేషన్, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో ఉంది. NSC విత్తన పరీక్ష, నాణ్యత నియంత్రణ కోసం భోపాల్, ఢిల్లీ, సూరత్ నగర్, సికింద్రాబాద్ లలో నాలుగు క్వాలిటీ కంట్రోల్ లేబోరేటరీలను ఏర్పాటు చేసింది. ఇందులో 25శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మినీరత్న ఎన్ఎస్సీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 29.92 కోట్ల లాభాన్ని ( ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్) ఆర్జించింది. మార్చి 31, 2020 నాటికి దీని విలువ రూ.646.37 కోట్లు.
wapcos ipo
2022 లో WAPCOS లిమిటెడ్..
WAPCOS (వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్) ప్రభుత్వ రంగ సంస్థ. విద్యుత్, నీళ్ళు, ఇన్ఫ్రా రంగాలకు సంబంధించినది. ఈ మినీరత్న కంపెనీ ఆఫ్ఘనిస్తాన్ తో పాటు వివిధ దేశాల్లో సేవలు అందిస్తోంది. ఐపీవోపై దూకుడుగా ముందుకు వెళ్ళినప్పటికి, కరోనా కారణంగా ఆలస్యమైంది. WAPCOS ప్రస్తుతం తన అంతర్జాతీయ వ్యాపారాలన్నింటి పైన సమాచారం సేకరిస్తోంది. ఇది కొద్దినెలల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత ఐపీవోకు రావొచ్చు.
neepco ipo
నార్త్ ఈస్టర్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
నార్త్ ఈస్టర్ ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్(NEEPCO)… ప్రభుత్వ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిదారు ఎన్టీపీసీ అనుబంధ సంస్థ. అసెట్ మానిటైజేషన్లో భాగంగా ఇది ఐపీవోకు వస్తోంది.
ఎన్టీపీసీ మరో రెండు అనుబంధ సంస్థల్లో ఈ పెట్టుబడులు పెడుతోంది. పవనశక్తి పైన దృష్టి సాధించి, ముందు ముందు కాలంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే మార్గాన్ని అనుసరిస్తోంది . 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కావొచ్చు.
Leave a Reply