
ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీకి పెరుగుతున్న క్రేజ్ తెలిసిందే.. రూ.వందల్లో పెట్టిన వారు లక్షల్లో లాభాలు ఆర్జించిన మాట వాస్తవమే. కానీ ఇది పూర్తి ప్రవేట్ వ్యవహారం. సురక్షితం కానిదీ.. ప్రభుత్వ పర్యవేక్షణకు చిక్కనిది. కంటికి కనిపించనిది.. ఎవరి కంట్రోల్ లేనిదీ.. అంతా ఆన్‌లైన్‌లోనే.. మోసాలకు, అసాంఘిక చర్యలకు అవకాశం ఉండడంతో ఒక రకమైన భయం ప్రభుత్వాల్లో, వ్యవస్థల్లో కలగడంతో కొన్నిదేశాల్లో క్రిప్టో కరెన్సీని నిషేధించారు. దీంతో ఇన్వెస్టర్లు భయపడి దీనిని రిస్క్ గా భావించి దూరం జరుగుతున్నారు. దీనితో భారత ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొద్ది కాలంగా కసరత్తు చేస్తోంది. ఫలితంగా కొత్త బడ్జెట్‌లో దీనికి సంబంధించిన ప్రకటనను ఆర్థికమంత్రి తెరపైకి తీసుకువచ్చారు.
ఈ సంవత్సరం డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ మరింత అభివృద్ధి చెందుతుందని అనుకున్నారు. బ్లాక్ చెయిన్ సాంకేతికతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీకి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా డిజిటల్ కరెన్సీ ఊతమిస్తుందన్నారు.
what is digital currency
మనం తరచుగా వింటున్న క్రిఫ్టో కరెన్సీ లాంటిదే ఈ డిజిటల్ కరెన్సీ కూడా.
అయితే క్రిప్టో కరెన్సీలా ఇది అనామక కరెన్సీ కాదు. డిజిటల్ కరెన్సీని దేశాల ఆర్థిక వ్యవస్థలకు మూలమైన సెంట్రల్ బ్యాంక్ లు జారీ చేస్తాయి. మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని జారీ చేస్తుంది. మార్కెట్ లో బహిరంగ వేలం పాట ద్వారా డిజిటల్ కరెన్సీ విలువను నిర్ణయిస్తారు. డిమాండ్ అండ్ సప్లయ్ సూత్రం ఆధారంగానే దీని విలువలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ కరెన్సీ యజమానులను ఆర్బీఐ గుర్తిస్తుంది. ఎంత పరిమాణంలో డిజిటల్ కరెన్సీని జారీ చేయాలో నిర్ణయించే అధికారం పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ చేతిలోనే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ గానీ, లేదా ఇతర దేశాలకు సెంట్రల్ బ్యాంక్ లు గానీ అనుసరించే అసంబద్ధ, అవివేక విధానాలను నియంత్రించగల సామర్థ్యం డిజిటల్ కరెన్సీకి లేదు.
how much powerfull digital currency is
క్రిఫ్టో కరెన్సీ తరహాలో ఆర్థిక వ్యవస్థను అస్థిరత్వం పాలు చేయగల సత్తా ఈ డిజిటల్ కరెన్సీకి లేదు. పేపర్ కరెన్సీ తరహాలోనే ఇదికూడా పూర్తిగా ఆర్బీఐ ఆధీనంలోనే ఉంటుంది. క్రిఫ్టో కరెన్సీలా నేర కార్యకలాపాలకు ఇది ఉపయోగపడదు. పేపర్ కరెన్సీలతో పోలిస్తే వీటితో జరిపే లావాదేవీల వ్యయం తక్కువ. నామ మాత్రపు ఖర్చుతో భద్రంగా నిల్వ చేసుకోగలగడం డిజిటల్ కరెన్సీ వల్ల కలిగే మరో ప్రయోజనం. ఎంత పరిమాణంలో డిజిటల్ కరెన్సీని జారీ చేయాలో నిర్ణయించే అధికారం పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ చేతిలోనే ఉంటుంది. ఇక ఇన్వెస్టర్లు భరోసాతో ఉండి పొదుపు చేయవచ్చు.