
క్రెడిట్ కార్డు… ఇటీవల కాలంలో అందరికీ సర్వసాధారణమైపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా చాలా మంది ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డు గురించి మీకు పూర్తిగా తెలుసా లేదా అన్న విషయం ఒక సారి పరిశీలించాలి. బాగా తెలుసుకున్న వారికి , ఉపయోగించుకునే వారికి క్రెడిట్ కార్డు ఒక వరం. కనీస అవగాహన లేకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించేవారికి మాత్రం క్రెడిట్ కార్డు ఒక శాపమే అని చెప్పాలి.
know these things before using credit cards
క్రెడిట్ కార్డు ఉపయోగించేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. క్రమం తప్పకుండా బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లు, స్టేట్‌మెంట్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి.
ప్రతినెలా క్రెడిట్ కార్డుకు సంబంధించిన ఒక స్టేట్ మెంట్ వస్తుంటుంది. ఈ-మెయిల్ ద్వారా గానీ, కొరియర్ ద్వారా గానీ, కొన్ని సార్లు రెండు విదానాలోనూ ఈ స్టేట్ మెంట్ మీకు చేరుతుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్ లైన్ లోనూ స్టేట్ మెంట్ చూడొచ్చు.క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అనేది మీ కార్డు వినియోగానికి సంబంధించిన వివరణాత్మక ప్రతి. ఇందులో మీరు బిల్లింగ్ కాలవ్యవదిలో చేసిన కొనుగోళ్ళు, చెల్లింపులు, క్రెడిట్ బ్యాలెన్స్, రివార్డ్ పాయింట్లు మొదలైనవన్నీ ఉంటాయి.
పూర్తి వివరాలకోసం స్టేట్ మెంట్ మొత్తాన్ని చదివేందుకు ఆసక్తి చూపరు. చెల్లించాల్సిన బిల్లు మొత్తాన్ని చూసుకుని పక్కన పెట్టేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏదైనా లావాదేవీ తప్పుగా నమోదైతే అంతిమంగా నష్టపోయేది మీరే అవుతారు. అందువల్ల నెలవారీ క్రెడిట్ స్టేట్ మెంట్ ను జాగ్రత్తగా తనిఖీ చేయాలి. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే బ్యాంకును సంప్రదించి సరిచేసుకోవచ్చు.
how to use credit card properly
* ఇది మీ క్రెడిట్ కార్డ్ పై బ్యాంక్ నిర్ణయించిన పరిమితి, కార్డుపై ఖర్చు చేసేందుకు మీకు అనుమతి ఉన్న మొత్తం. క్రెడిట్ పరిమితిని ఎప్పటికప్పుడు సవరించవచ్చు.
* క్రెడిట్ కార్డుల ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఈ రివార్డ్ పాయింట్లు. వీటికి కొంత గడువు ఉంటుంది. గడువులోగా రిడీమ్ చేసుకోకపోతే పాయింట్లు రద్దయ్యే అవకాశం ఉంది. అందువల్ల వీటిని గడవుకు ముందే రిడీమ్ చేసుకోవాలి. వీటిని సరిగా ఉపయేగించినట్లయితే గణనీయమైన ప్రయోజనాలను పొందవచ్చు.
* స్టేట్ మెంట్ గడువు తేదితో అయోమయం చెందకూడదు. స్టేట్ మెంట్ గడువుతేది అంటే మీ స్టేట్ మెంట్ జనరేట్ అయిన తేది మాత్రమే. దీని ద్వారా స్టేట్ మెంట్ ఎప్పుడు జనరేట్ అయ్యింది. బిల్లింగ్ సైకిల్ ఎప్పటి నుంచి ప్రారంభ మవుతుంది అనే విషయాలు తెలుస్తాయి.
* ఇది బకాయి మొత్తాన్ని కార్డ్ జారీచేసే సంస్థకు జమ చేయవలిసిన తేది. మీరు చెక్ ద్వారా మొత్తాన్ని పరిష్కరిస్తుంటే, క్లియరెన్స్ కోసం 2-3 రోజులు పట్టొచ్చని గుర్తుంచుకోండి.
* చెల్లింపు గడువు తేది తర్వాత మూడురోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా బకాయిలు చెల్లించకపోతే.. చెల్లించాల్సిన మొత్తంపై ఆలస్యం చెల్లింపు కింద వడ్డీని లెక్కిస్తారు. ఇది తదుపరి స్టేట్ మెంట్ లో కనిపిస్తుంది. అయితే కొన్ని క్రెడిట్ కార్డ్ సంస్థలు 20 నుంచి 25 రోజులు కూడా గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాయి.
* మునుపటి నెలలో ఖర్చు చేసింది మాత్రమే కాకుండా, వర్తించే వడ్డీ లేదా ఆలస్యంగా చెల్లించే ఛార్జీలు, మునుపటి బిల్లులో చెల్లించాల్సిన మొత్తం, సేవా ఛార్జీలు, ఓవర్ డ్రాన్ ఫీజు, లావాదేవీల రుసుము, నగదు ముందస్తు ఛార్జీలు, మీ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము, ఇవన్నీ కలిపి చెల్లించాల్సిన మొత్తం అవుతుంది.
* బిల్లు మొత్తం చెల్లించలేని స్థితిలో మినిమమ్ డ్యూ మొత్తాన్ని చెల్లించి ఆలస్య ఫీజులను నివారించవచ్చు. ఇది సాధారణంగా చెల్లించాల్సిన మొత్తంలో 5శాతం ఉంటుంది. కనీస మొత్తాన్ని చెల్లించినప్పటికీ, బకాయి ఉన్న పూర్తి బిల్లు చెల్లించేవరకు వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. కనీస చెల్లింపు కేవలం ఆలస్య రుసుము పడకుండా మాత్రమే ఆపుతుంది.
* స్టోర్ లో, ఆన్ లైన్ లో క్రెడిట్ కార్డును ఉపయోగించి చేసిన అన్ని లావాదేవీలు.. నిర్వహించిన తేదీ, లావాదేవీ విలువతో సహా పూర్తి వివరాలు ఈ జాబితాలో ఉంటాయి. ఏమీ తప్పు లేదని నిర్ధారించడానికి వీటిని జాగ్రత్తగా చూడటం ముఖ్యం. ఒక నెలలో క్రెడిట్ కార్డును ఉపయోగించి ఎంతఖర్చు చేస్తున్నారో ఈ వివరాలను పరిశీలించి తెలుసుకోవచ్చు. మీ ఖర్చు అలవాట్లను విశ్లేషించుకొని, దీర్ఘకాలంలో ఎక్కువ పొదుపు చేసేందుకు,తక్కువ ఖర్చు చేసేందుకు ఇది సహాయపడుతుంది.
* వరుసగా రెండు స్టేట్ మెంట్ తేదీల మధ్యకాలాన్ని బిల్లింగ్ సైకిల్ అంటారు. సాధారణంగా బిల్లింగ్ సైకిల్ 30 రోజుల వ్యవధిని కలిగి ఉంటుంది. ఆ 30 రోజుల్లో చేసిన లావాదేవీలన్నీ క్రెడిట్ కార్డ్ స్టేట్ మెంట్ లో ప్రతిబింబిస్తాయి. బిల్లింగ్ సైకిల్ కార్డు జారీ చేసిన సంస్థపై ఆధారపడి ఉంటుంది.