Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

‘ఐటీఆర్‌ హోల్డ్‌’ అంటే రిజెక్ష‌న్ కాదు..! స్పష్టత ఇచ్చిన ఐటీ విభాగం! ITR on Hold’ Is Not a Rejection..! IT Department Clarifies

Posted on 25/12/2025 By admin No Comments on ‘ఐటీఆర్‌ హోల్డ్‌’ అంటే రిజెక్ష‌న్ కాదు..! స్పష్టత ఇచ్చిన ఐటీ విభాగం! ITR on Hold’ Is Not a Rejection..! IT Department Clarifies

ఇటీవల ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలు చేసిన పలువురు పన్ను చెల్లింపుదారులకు ‘ITR on Hold’ అనే సందేశాలు రావడంతో గందరగోళం నెలకొంది. రిఫండ్‌ రాదేమోనన్న భయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై తాజాగా ఆదాయపు పన్ను విభాగం స్పష్టత ఇచ్చింది. ఐటీ విభాగం తెలిపిన వివరాల ప్రకారం… ‘ఐటీఆర్‌ హోల్డ్‌’ అన్నది తిరస్కరణ (రెజెక్షన్‌) కాదని స్పష్టం చేసింది. కొన్ని సాంకేతిక కారణాలు, సమాచారం సరిపోలని సందర్భాల్లో మాత్రమే రిటర్నులను తాత్కాలికంగా నిలిపివేస్తామని తెలిపింది. అన్ని వివ‌రాలు స‌రిచూసిన త‌ర్వాత‌ వెంటనే రిటర్ను ప్రాసెసింగ్‌ పూర్తవుతుందని, అర్హత ఉంటే రిఫండ్‌ కూడా విడుదల అవుతుందని ఐటీ విభాగం తెలిపింది. కాబట్టి ‘ఐటీఆర్‌ హోల్డ్‌’ సందేశం చూసి భయపడాల్సిన అవసరం లేదని, పోర్టల్‌లో సూచనల మేరకు చర్యలు తీసుకుంటే సరిపోతుందని అధికారులు సూచించారు. కాబట్టి ‘హోల్డ్‌’ సందేశాలతో అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఐటీఆర్‌ను సమీక్షించుకోవాలని సూచించింది.

ITR on Hold అంటే ఏమిటి? What Does ‘ITR on Hold’ Mean?
ITR on Hold అంటే… మీరు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ను తాత్కాలికంగా ప్రాసెసింగ్‌ నిలిపివేయడం మాత్రమే. ఐటీఆర్‌లో చూపిన ఆదాయం, మినహాయింపుల్లో వ్యత్యాసాలు కనిపిస్తేనే ‘హోల్డ్‌’లో పెడతారు. ఫారమ్‌ 26ఏఎస్‌, ఏఐఎస్‌ డేటాతో వివరాలు సరిపోలకపోయినా, అర్హత లేకున్నా మినహాయింపులు/డిడక్షన్లు క్లెయిమ్‌ చేసినట్టు అనుమానం ఉంటే ITR on Hold అనే సందేశం వ‌స్తుంది. అదేవిధంగా అధిక రిఫండ్‌ క్లెయిమ్‌ చేసిన సందర్భాల్లో అదనపు తనిఖీ అవసరమైనా, బ్యాంకు ఖాతా ధృవీకరణ, ఆధార్‌–పాన్‌ లింక్‌ వంటి సాంకేతిక సమస్యలు ఉంటే హోల్డ్‌లో పెట్టే అవ‌కాశం ఉంది. ‘ITR on Hold’ అనేది నోటీసు కాదు. శిక్ష కూడా కాదు. చాలా సందర్భాల్లో ఇది నడ్జ్‌ (NUDGE) క్యాంపెయిన్‌లో భాగంగా వచ్చే అలర్ట్‌ మాత్రమే. ప‌న్ను చెల్లింపుదారులు ఐటీ పోర్టల్‌లో లాగిన్‌ అయి రిటర్న్‌ స్టేటస్‌ చెక్‌ చేయాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే రివైజ్డ్‌ ఐటీఆర్‌ దాఖలు చేయాలి. అర్హత ఉంటే రిఫండ్‌ తప్పకుండా జమ అవుతుంది. కొన్నిసార్లు ‘హోల్డ్‌’ సందేశం వచ్చినా, రిఫండ్‌ ఇప్పటికే ఖాతాలో జమ అయిన ఉదాహరణలూ ఉన్నాయి. మొత్తానికి, ‘ITR on Hold’ అనేది అప్రమత్తం చేసే సూచన మాత్రమే. భయపడకుండా, మీ ఐటీఆర్‌ వివరాలను మరోసారి పరిశీలించుకుంటే సరిపోతుందని ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది

ఎందుకు ‘హోల్డ్‌’లోకి వెళ్తుంది? Why Does an ITR Go on ‘Hold’?

(ITR on Hold) టిడిఎస్‌, టిసిఎస్‌ వివరాలు ఫారమ్‌ 26ఏఎస్‌, ఏఐఎస్‌తో సరిపోలకపోతే, బ్యాంకు ఖాతా ధృవీకరణ పూర్తికాకపోతే, ఆధార్‌–పాన్‌ లింక్‌ సమస్యలు ఉంటే, అధిక రిఫండ్‌ క్లెయిమ్‌ చేసిన సందర్భాల్లో అదనపు తనిఖీ అవసరమైతే ఐటీఆర్‌ హోల్డ్‌లోకి వెళ్తుంది.

పన్ను చెల్లింపుదారులు ఏం చేయాలి? What Should Taxpayers Do?

ఐటీఆర్‌ హోల్డ్‌(ITR on Hold)లోకి వెళ్లిన సంద‌ర్భాల‌లో ప‌న్ను చెల్లింపుదారులు వెంట‌నే ఐటీ పోర్టల్‌లో లాగిన్‌ అయి నోటిఫికేషన్లు, ఈ-ప్రొసీడింగ్స్‌ విభాగం పరిశీలించాలి. ఐటీఆర్‌లో చూపిన మినహాయింపులు, డిడక్షన్లు మరోసారి పరిశీలించాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే సవరించిన (రివైజ్డ్‌) ఐటీఆర్‌ దాఖలు చేయాలి. కోరిన వివరాలు లేదా పత్రాలు అప్లోడ్‌ చేయాలి. అవసరమైతే రివైజ్డ్‌ రిటర్న్‌ దాఖలు చేయాలి. అవసరమైతే 2025 డిసెంబరు 31లోగా రివైజ్డ్‌ రిటర్నులు సమర్పించుకోవచ్చు.

రిఫండ్‌ జమ అయినా.. Even If the Refund Is Credited…

– (ITR on Hold)ఆదాయపు పన్ను విభాగం ఇటీవల పన్ను చెల్లింపుదారులకు పెద్దఎత్తున సందేశాలు పంపడం చర్చనీయాంశంగా మారింది. రిఫండ్‌ క్లెయిమ్స్‌లో వ్యత్యాసాలున్నాయని, అందుకే ఐటీ రిఫండ్‌ను హోల్డ్‌లో పెట్టామని ఆ సందేశాల్లో పేర్కొన్నట్లు పలువురు తెలిపారు. అంతేకాదు.. డిసెంబర్‌ 31లోపు రివైజ్డ్‌ రిటర్నులు దాఖలు చేయాలని సూచించినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.
– ఈ నేపథ్యంలో పలువురు తమ అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఓ యూజర్‌ మాట్లాడుతూ… తనకు కూడా ‘ఐటీఆర్‌ హోల్డ్‌లో పెట్టాం’ అన్న సందేశం వచ్చిందని పేర్కొన్నాడు. పూర్తి వివరాలు ఇ-మెయిల్‌లో పంపినట్లు అందులో ఉన్నప్పటికీ, తనకు ఎలాంటి ఇ-మెయిల్‌ రాలేదని తెలిపాడు. అయితే ఐటీ పోర్టల్‌లో లాగిన్‌ అయి చూసినప్పుడు మాత్రం ‘మీ రిఫండ్‌ మీ ఖాతాలో క్రెడిట్‌ అయ్యింది’ అని చూపిస్తోందని రాసుకొచ్చాడు.
– ఇలాంటి అనుభవాలు మరెందరో పంచుకోవడంతో పన్ను చెల్లింపుదారుల్లో అయోమయం పెరిగింది. ఒకవైపు రిఫండ్‌ జమ అయి ఉండగా, మరోవైపు ‘హోల్డ్‌’ సందేశాలు రావడం గందరగోళానికి దారి తీస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.
– ఇదిలా ఉండగా, ఆదాయపు పన్ను విభాగం ఇప్పటికే ఇచ్చిన స్పష్టత ప్రకారం… ఈ అలర్ట్‌లు తుది నిర్ణయం కాదని, ఐటీఆర్‌ ఫైలింగ్‌లో పొరపాట్లకు ఆస్కారం ఉన్నందున స్వచ్ఛందంగా రిటర్నులను సమీక్షించుకోవాలని సూచించేందుకే పంపినవని అధికారులు చెబుతున్నారు. రిఫండ్‌ ఇప్పటికే జమ అయినవారు భయపడాల్సిన అవసరం లేదని, ఏదైనా సందేహం ఉంటే ఐటీ పోర్టల్‌లో వివరాలు పరిశీలించాలని సూచిస్తున్నారు.
– మొత్తానికి, ‘ఐటీఆర్‌ హోల్డ్‌’ సందేశాలే గానీ, అన్ని కేసుల్లో రిఫండ్‌ ఆగిపోయినట్లుకాదని, పోర్టల్‌ స్టేటస్‌నే ప్రామాణికంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వివరణ ఇచ్చిన ఆదాయపు పన్ను విభాగం..Income Tax Department Clarifies
(ITR on Hold) పన్ను చెల్లింపుదారుల్లో ఇటీవల గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఆదాయపు పన్ను విభాగం స్పష్టత ఇచ్చింది. రిఫండ్‌ హోల్డ్‌ అంటూ వస్తున్న సందేశాలు ‘నడ్జ్‌ (NUDGE) క్యాంపెయిన్‌’లో భాగమేనని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా తమ ఐటీఆర్‌లను మరోసారి పరిశీలించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ అలర్ట్‌లు పంపినట్లు తెలిపింది. ఐటీ విభాగం వివరణ ప్రకారం…కొంతమంది అర్హత లేకున్నా తప్పుడు మినహాయింపులు చూపించి రిఫండ్‌ కోసం క్లెయిమ్‌ చేసినట్లు గుర్తించినట్టు పేర్కొంది. ఇదే క్రమంలో ఐటీఆర్‌లో పేర్కొన్న మినహాయింపులు సరైనవేనా? కాదా? అన్నది పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా సరిచూసుకోవాలని సూచించేందుకే ఈ సందేశాలు పంపినట్లు తెలిపింది. మినహాయింపు క్లెయిమ్‌లు సరిగ్గా ఉన్నట్లయితే ఎటువంటి తదుపరి చర్యలు అవసరం లేదని ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది. కాబట్టి ‘హోల్డ్‌’ సందేశాలతో అనవసరంగా ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఐటీ పోర్టల్‌లోని వివరాలను ఆధారంగా తీసుకొని నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచించారు.

నడ్జ్‌ (NUDGE) క్యాంపెయిన్ అంటే ఏమిటి? What Is the NUDGE Campaign?

ఇటీవల ఆదాయపు పన్ను విభాగం పంపుతున్న ‘నడ్జ్‌’ (NUDGE) సందేశాలపై పన్ను చెల్లింపుదారుల్లో ఆసక్తి, సందేహాలు పెరిగాయి. అసలు నడ్జ్‌ క్యాంపెయిన్‌ అంటే ఏమిటి? ఎందుకు ఈ సందేశాలు పంపుతున్నారు? అన్న దానిపై ఐటీ విభాగం వివరణ ఇచ్చింది. వాస్త‌వంగా నడ్జ్‌ క్యాంపెయిన్‌ అనేది పన్ను చెల్లింపుదారులను భయపెట్టడం కోసం కాదు. స్వచ్ఛందంగా తప్పులను సరిదిద్దుకునేలా ‘సూచన’ ఇచ్చే విధానం మాత్రమే.

నడ్జ్‌ క్యాంపెయిన్‌ ఉద్దేశం ఏమిటంటే? What Is the Objective of the NUDGE Campaign?

ఐటీఆర్‌ ఫైలింగ్‌లో జరిగిన పొరపాట్లను గుర్తుచేయడం. అర్హత లేకున్నా చూపిన మినహాయింపులు, డిడక్షన్లపై అప్రమత్తం చేయడం. తప్పుడు రిఫండ్‌ క్లెయిమ్‌లను ముందే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడం.. న్యాయపరమైన చర్యలకు ముందే స్వచ్ఛంద సవరణకు అవకాశం కల్పించడం నడ్జ్‌ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమ‌ని ఆదాయపు పన్ను విభాగం అధికారులు చెబుతున్నారు.

ఇది నోటీసా? శిక్షా? Is This a Notice or a Penalty?

నడ్జ్‌ (NUDGE)క్యాంపెయిన్‌లో భాగంగా వచ్చే సందేశాలు నోటీసులు కావు. ఇవి తుది నిర్ణయం కూడా కాదు. కేవలం ‘మీ రిటర్న్‌ను ఒకసారి చెక్‌ చేసుకోండి’ అన్న సూచన మాత్రమే. ఈ నోటీసు వ‌చ్చిన వెంట‌నే పన్ను చెల్లింపుదారులు అప్ర‌మ‌త్తం కావల్సి ఉంది. ఐటీఆర్‌లో చూపిన ఆదాయం, మినహాయింపులు మరోసారి పరిశీలించాలి. పొరపాట్లు ఉంటే రివైజ్డ్‌ ఐటీఆర్‌ దాఖలు చేయాలి. వివరాలు సరిగ్గా ఉంటే ఎలాంటి చర్యలు అవసరం లేదు. ఈ చ‌ర్య‌ల వ‌ల్ల ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. నోటీసులు, జరిమానాల భయం లేకుండా తప్పులు సరిచేసుకునే అవకాశం ద‌క్కుతుంది. న్యాయపరమైన వివాదాలు తగ్గుతాయి. మొత్తానికి, నడ్జ్‌ క్యాంపెయిన్‌ అనేది ‘భయంతో కాదు… అవగాహనతో పన్ను చెల్లించాలి’ అన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన చర్య. కాబట్టి ఇలాంటి సందేశాలు వచ్చినా గందరగోళం చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

 

 

271
FEATURE NEWS Tags:Even If the Refund Is Credited…, Income Tax Department Clarifies, Is This a Notice or a Penalty?, What Does ‘ITR on Hold’ Mean?, What Is the NUDGE Campaign?, What Is the Objective of the NUDGE Campaign?, What Should Taxpayers Do?, Why Does an ITR Go on ‘Hold’?

Post navigation

Previous Post: ఖాతాలో డబ్బు కట్ అయినా ఏటీఎం నుండి నగదు రాలేదా? ఇటువంటి ప‌రిస్థితుల్లో ఏం చేయాలంటే..! Money Debited but Not Dispensed from ATM? Here’s What to Do in Such Situations!
Next Post: జనవరి 2026 లోపు ఇలా చేయండి ..! బీమా, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్‌, సిల్వ‌ర్‌, స్టాక్ మార్కెట్లలో పెట్టుబ‌డి వ్యూహాలు..! Investment Strategies, Insurance, Mutual Funds, and Stock Market Tips Until January 2026

Related Posts

  • ట్రంప్‌ వ్యాఖ్యలతో మార్కెట్లలో కలకలం… లాభాల జోరు ఒక్క రోజుకే పరిమితం.. Trump Remarks Rattle Markets… Rally Short-Lived FEATURE NEWS
  • అంతర్జాతీయంగా రికార్డు స్థాయికి పసిడి ధర .. తొలిసారిగా ఔన్సు 5000 డాలర్లకు.. రెండేళ్లలోనే ధర రెట్టింపు! Gold Hits Record High Internationally: Price Reaches $5,000 per Ounce for the First Time, Doubles in Two Years! FEATURE NEWS
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget FEATURE NEWS
  • 2026 బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల ఆశలు .. Investors’ Expectations from Budget 2026 FEATURE NEWS
  • జోరుగా వెండి విక్రయాలు.. ! వారంలోనే 100 టన్నుల అమ్మ‌కం! Massive Silver Sell-Off: 100 Tonnes Sold in Just One Week! FEATURE NEWS
  • మీ ఆలోచ‌నే మీ ఆస్తి Your thoughts are your property FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • యుద్ధం ఉన్నా.. బంగారం, వెండి ధ‌ర‌లు ఎందుకు పడిపోతున్నాయి? Why Are Gold and Silver Prices Falling Despite the War? FEATURE NEWS
  • అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుకు చెక్‌! MONEY TIPS
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్ల‌ను కుదిపేసిన ఐటీ షేర్లు.. IT Stocks Rattle the Stock Markets MARKET
  • వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మార్చ‌న‌ప్ప‌టికీ.. రుణ‌గ్ర‌హీత‌ల‌పై భారం ప‌డుతుందా? Even If the RBI Doesn’t Change Interest Rates… Will Borrowers Still Face a Burden? FEATURE NEWS
  • హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో చేయకూడని ముఖ్యమైన పొరపాట్లు | హెల్త్ ఇన్స్యూరెన్స్ కొనడానికి ఉత్తమ సమయం Top Health Insurance Mistakes to Avoid | Best Time to Buy Health Insurance INSURANCE
  • మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు హెచ్చరిక: కేవైసీ పేరుతో కొత్త మోసాల ముప్పు .. Alert for Mutual Fund Investors: New KYC Scams on the Rise FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme