దేశంలో పన్ను విధానాన్ని మరింత సరళీకృతం చేయాలన్న లక్ష్యంతో ఆదాయపు పన్ను శాఖ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానం ( TDS Rules Revamped) … ముఖ్యంగా చిన్న పెట్టుబడిదారులు, సీనియర్ సిటిజన్లు, తక్కువ ఆదాయం ఉన్నవారికి పెద్ద ఉపశమనాన్ని ఇవ్వనుంది. ఇప్పటి వరకు టీడీఎస్ (TDS) మినహాయింపుల కోసం వేర్వేరు ఫారాలు సమర్పించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం తొలగిపోయింది. ఫారం 15G, 15Hలను పూర్తిగా రద్దు చేసి… వాటి స్థానంలో ఒకే ఫారం—ఫారం 121—ను ప్రవేశపెట్టడం ఈ మార్పులో ప్రధాన అంశం. ఈ నిర్ణయం 2026-27 అసెస్మెంట్ ఇయర్ నుంచి అమల్లోకి వచ్చి… పన్ను చెల్లింపుదారులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. ముఖ్యంగా “పన్ను బాధ్యత లేని వారికి టీడీఎస్ ఎందుకు కట్ అవుతుంది?” అనే సమస్యకు ఇది ఒక సమర్థమైన పరిష్కారంగా భావిస్తున్నారు.
పాత విధానానికి గుడ్‌బై… కొత్త సింపుల్ సిస్టమ్‌కు వెల్కమ్
Goodbye to Old Forms – Welcome to a Unified System
ఇప్పటి వరకు ఆదాయపు పన్ను వ్యవస్థలో 15G, 15H అనే రెండు వేర్వేరు ఫారాలు ఉండేవి. 60 సంవత్సరాల లోపు ఉన్నవారు 15G సమర్పించాల్సి ఉండేది. 60 ఏళ్లు దాటిన వారు 15H వాడేవారు. ఈ వయోభేదం కారణంగా చాలామందికి సందేహాలు, పొరపాట్లు జరుగుతుండేవి. ఈ సమస్యను గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ… ఇప్పుడు ఒకే ఫారం 121ను తీసుకొచ్చింది. వయస్సుతో సంబంధం లేకుండా… ఎవరికైనా పన్ను బాధ్యత లేకపోతే ఈ ఒకే ఫారం ( TDS Rules Revamped) సరిపోతుంది. దీని వల్ల నిబంధనలు సులభంగా అర్థమవుతాయి. ఫారాల గందరగోళం పూర్తిగా తొలగిపోతుంది.
ఫారం 121 అంటే ఏమిటి? What is Form 121?
ఫారం 121 అనేది ఒక స్వీయ ప్రకటన పత్రం (Self Declaration Form). ఈ ఫారం ద్వారా మీరు “నా మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి రాదు” అని అధికారికంగా తెలియజేస్తారు. ఈ ప్రకటనను బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, ఇతర చెల్లింపుదారులు పరిగణలోకి తీసుకుని… మీ ఆదాయంపై టీడీఎస్ కట్ చేయకుండా మినహాయింపు ఇస్తాయి. అంటే… మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా ముందుగానే టీడీఎస్ కట్ అయ్యే పరిస్థితి ఇక తగ్గుతుంది.
ఎవరికి ఉపయోగం? Who Benefits from Form 121?
ఈ కొత్త ఫారం ( TDS Rules Revamped)ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్నవారికి ఉపయోగపడుతుంది. బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ పొందే వారు, పెన్షన్ పొందేవారు, చిన్న పెట్టుబడిదారులు… వీరందరికీ ఇది ఎంతో ఉపయుక్తం. ఇప్పటి వరకు చాలామంది టీడీఎస్ కట్ అయిన తర్వాత రీఫండ్ కోసం రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఫారం 121 సమర్పిస్తే… ముందుగానే మినహాయింపు లభిస్తుంది. దీంతో ఆ ప్రక్రియలో సమయం, శ్రమ తగ్గుతుంది.
ఏ ఆదాయాలకు వర్తిస్తుంది? Applicable Income Sources
ఫారం 121 పరిధిలోకి అనేక రకాల ఆదాయాలు వస్తాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, సేవింగ్స్ ఖాతా వడ్డీ, పెన్షన్, పీఎఫ్ విత్‌డ్రాయల్స్, అద్దె ఆదాయం, ఇన్సూరెన్స్ కమిషన్, మ్యూచువల్ ఫండ్ డివిడెండ్లు వంటి ఆదాయాలపై ఈ మినహాయింపు వర్తిస్తుంది. అంటే… మీ మొత్తం ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే… ఈ ఫారం ద్వారా టీడీఎస్ నుంచి తప్పించుకోవచ్చు.
UIN వ్యవస్థ… పారదర్శకతకు కొత్త అడుగు.. UIN System – A Step Towards Transparency
కొత్త విధానంలో ( TDS Rules Revamped)మరో ముఖ్యమైన అంశం… యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (UIN). మీరు సమర్పించే ప్రతి ఫారం 121కు ఒక ప్రత్యేక కోడ్ జారీ అవుతుంది. ఇది 26 అక్షరాలతో ఉండే యూనిక్ నంబర్. ఈ UIN ద్వారా ప్రతి డిక్లరేషన్‌ను ట్రాక్ చేయడం సులభమవుతుంది. పన్ను శాఖకు కూడా డేటా నిర్వహణ మరింత పారదర్శకంగా ఉంటుంది. ఒకే వ్యక్తి పలు చోట్ల ఫారం సమర్పించినా… అన్నీ సులభంగా గుర్తించవచ్చు.
బ్యాంకులు, సంస్థల బాధ్యతలు పెరిగినట్లే.. Increased Responsibility for Banks and Institutions
ఈ కొత్త విధానంతో( TDS Rules Revamped) బ్యాంకులు, ఇతర చెల్లింపుదారుల బాధ్యత కూడా పెరిగింది. వారు ప్రతి ఫారం 121ను సక్రమంగా రికార్డ్ చేయాలి. అంతేకాదు, త్రైమాసిక నివేదికలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదికల్లో టీడీఎస్ మినహాయింపుల వివరాలు ఉండాలి. దీని వల్ల పన్ను శాఖ పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం అవుతుంది. తప్పులు, దుర్వినియోగం అవకాశాలు తగ్గుతాయి.
పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి లాభం? Benefits for Taxpayers
ఫారం 121 వల్ల ప్రధానంగా లభించే లాభం… సింప్లిసిటీ. ఒకే ఫారం ద్వారా అన్ని వయస్సులవారు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. టీడీఎస్( TDS Rules Revamped) కట్ అయ్యి… తర్వాత రీఫండ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం తగ్గుతుంది. ఆర్థిక నిర్వహణ కూడా సులభమవుతుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఇది పెద్ద ఊరటనిస్తుంది.
జాగ్రత్తలు కూడా అవసరం.. Need for Caution and Accuracy
అయితే ఈ ఫారం సమర్పించే ముందు… మీ ఆదాయం నిజంగా పన్ను పరిధిలోకి రాదా అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. తప్పుగా డిక్లరేషన్ ఇస్తే… తర్వాత సమస్యలు ఎదురవుతాయి. పన్ను శాఖ ఇప్పుడు డిజిటల్ పద్ధతుల్లో డేటాను పరిశీలిస్తోంది. కాబట్టి తప్పుడు వివరాలు ఇవ్వడం ప్రమాదకరం. సరైన సమాచారం ఆధారంగా మాత్రమే ఫారం సమర్పించాలి. మొత్తానికి… ఫారం 15G, 15Hలను రద్దు చేసి ఫారం 121ను ప్రవేశపెట్టడం… పన్ను విధానాన్ని సరళీకృతం చేసే దిశగా ఒక కీలక ముందడుగు. ఇది పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కలిగించడమే కాకుండా… పారదర్శకతను కూడా పెంచుతుంది. వయోభేదం లేకుండా ఒకే ఫారం ఉపయోగించడం వల్ల గందరగోళం తగ్గుతుంది. UIN వ్యవస్థతో ట్రాకింగ్ సులభమవుతుంది. బ్యాంకులు, సంస్థలు కూడా మరింత బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి… మీ ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోతే… కొత్త ఫారం 121 గురించి తెలుసుకుని సరైన విధంగా ఉపయోగించుకోవడం మంచిది. లేకపోతే… అనవసరంగా టీడీఎస్ కట్ అయి… తర్వాత రీఫండ్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది.
