
what is gig economy
సాధారణంగా ఉద్యోగులు, వ్యాపారులకు నిత్యం ప్రతినెలా స్థిరంగా ఆదాయం వస్తుంది. వాళ్ల ఖర్చులు, లెక్కలు అన్నీ పక్కాగా ఉంటాయి. వాళ్ల ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా పకడ్బంధీగా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి స్థిర ఆదాయం లేని క్రియేటివ్ ఫీల్డ్, కాంట్రాక్ట్ వర్కర్స్, ప్రాజెక్ట్ కోసం మాత్రం పనిచేసేవారి పరిస్థితి వేరు. ఇలాంటి పరిస్థితి ఉన్నవారంతా గిగ్ ఎకానమీలోకి వస్తారు.
who are in gig economy
కాంట్రాక్ట్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెంట్, కేరక్టర్ ఆర్టిస్ట్, సీరియల్ లో పనిచేసే వీడియో ఎడిటర్స్, టెక్నికల్ స్టాఫ్, ఫ్రీ లాన్సర్స్, క్రియేటివ్ ఫీల్డ్ కి చెందిన వారందరికీ ప్రాజెక్ట్, లేదా పని ఉన్నప్పుడు మాత్రమే డబ్బు వస్తుంది. ఆ పని ముగిసిన తర్వాత ఏ ఆదాయం ఉండదు. కొంతమంది సీజనల్ బిజినెస్ చేస్తారు. అంటే వాళ్ళ బిజినెస్ అంతా ఆ సీజన్ లోనే ఉంటుంది. ఇలాంటివాళ్ళందరూ గిగ్ ఎకానమీ సర్కిల్ లోకి వస్తారు. అయితే మరి వీరి ఫైనాన్సియల్స్ ఎలా అనే సందేహం వాళ్ల లోనూ, బయటి వాళ్లకూ కలుగుతుంది. వీళ్లు ఎలా ప్లానింగ్ చేసుకోవాలో ఓ సారి చూద్దాం.
ఎమర్జన్సీ ఫండ్ పెట్టుకోవాలి
మనకి నెలకి అయ్యే మొత్తం ఖర్చు లెక్కవేసుకుని ఆ మేరకు సుమారు 6 నెలలకు అవసరమయ్యే మొత్తాన్ని అత్యవసర నిధిగా దాచిపెట్టుకోవాలి. దీన్ని సురక్షితమైన చోట, వీలైనంత అధిక వడ్డీ వచ్చే మార్గంలో పొదుపు చేయాలి. అలాంటి అవసరం ఏదైనా వస్తే వెంటనే తీసుకోవడానికి సులువుగా ఉండాలి.
how to plan for fixed income
స్థిర ఆదాయం వచ్చేలా..
మనకి ఇన్ కమ్ రెగ్యులర్ గా రాదు కాబట్టి, పని ఉన్నప్పడు ఒక్కసారిగా వచ్చే మొత్తాన్ని, ఎమర్జన్సీ ఫండ్ గా ఏర్పాటు చేసుకున్న డబ్బును పాసివ్ ఇన్ కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి.
వడ్డీకి అప్పు ఇవ్వడం, నెల నెలా ఆదాయం వచ్చేలా మంచి రాబడి వచ్చే చోట పెట్టుబడి పెట్టాలి.
* ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్‌లో ఏక మొత్తంలో డబ్బులు పెట్టి ఎస్ డబ్ల్యూ పీ (సిస్టమెటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్) ద్వారా నెల నెలా వడ్డీ ఆదాయాన్ని పొందడం.
* మనం పాసివ్ ఇన్ కమ్ వచ్చే మార్గాల్లో నుంచి మంచి బిజినెస్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. మనం ఖాళీగా ఉన్న సమయాల్లో దానిని స్టార్ట్ చేసి, చక్కని టీంను డెవలెప్ చేసుకోవాలి. ఇంక దానిపై ఆదాయం వచ్చేలా చూసుకుంటే రెగ్యులర్ ఇన్కం జనరేట్ అవుతుంది.
ఇన్సూరెన్స్ తప్పనిసరి
రెగ్యులర్ ఇన్ కమ్ రానివాళ్ళకు ఎలాంటి హెల్త్ ఇన్సురెన్స్ ఇవ్వరు. వీళ్ళు పర్సనల్ గా హెల్త్ ఇన్సురెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఒక మంచి హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీలో ఇన్సురెన్స్ తీసుకోవాలి.
మన లైఫ్ ఇన్సురెన్స్ గానీ టర్మ్ ఇన్సురెన్స్ గానీ సుమారు కోటి రూపాయలకు ఉండాలి. టర్మ్ ఇన్సురెన్స్ ని కట్టడం ఖచ్చితంగా స్టార్ట్ చెయ్యాలి.
రిటైర్మెంట్ ప్లాన్..
మనం సంపాదించినపుడే మన రిటైర్ మెంట్ ప్లాన్ చేసుకోవాలి. దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒక వేళ మనం సెక్యూర్ గా ఉండాలంటే పీపీఎఫ్, ఎన్‌పీఎస్ ఉన్నాయి. లేదా రిటైర్ మెంట్ టైమ్ కి మంచి మ్యూచువల్ ఫండ్స్ లో నైనా ఇన్వెస్ట్ చేస్తే చాలా ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు మనం మన ఫ్యామిలీ పై ఆధారపడనవసరం లేదు.
ఇవి చేయకూడదు..
* డబ్బులు బాగా వచ్చేటపుడు ఎక్కువు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇది సరైనది కాదు.
* సరియైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడంతో ఇబ్బందులు పడతారు.
* హెల్త్ ఇన్సురెన్స్ లేదా టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకోరు. కానీ ఇవి తప్పనిసరి
* బిజినెస్ ఖర్చులను, ఫ్యామిలీ ఖర్చులను కలిపి లెక్కిస్తారు.
* రెగ్యులర్ గా ఇన్ కమ్ రానివాళ్ళు ఈఎమ్ఐ జోలికి వెళ్ళకూడదు. బ్యాంకులోన్లు తీసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరి అయితే అప్పడు మీ ఆదాయ వివరాలన్నింటినీ సమీక్షించుకుని ముందుకు వెళ్లాలి.