Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

జీడీపీ జోష్‌..!ఆరు త్రైమాసికాల గరిష్ఠానికి ఆర్థిక వృద్ధి! GDP Surge! Growth Hits Six-Quarter High

Posted on 29/11/2025 By admin No Comments on జీడీపీ జోష్‌..!ఆరు త్రైమాసికాల గరిష్ఠానికి ఆర్థిక వృద్ధి! GDP Surge! Growth Hits Six-Quarter High

దేశ ఆర్థిక వ్యవస్థ మరోసారి దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నా, ప్రధాన దేశాలు వృద్ధిలో వెనుకబడినా… భారత్ మాత్రం వేగంగా ముందుకు సాగుతోంది. వరుసగా ఆరు త్రైమాసికాల తర్వాత, జిడిపి వృద్ధి రేటు మళ్లీ గరిష్ఠాలను తాకింది. జులై–సెప్టెంబర్‌ (Q2) కాలానికి గాను 8.2% వృద్ధిని భారత ఆర్థిక వ్యవస్థ నమోదుచేసింది. గత ఏడాది ఇదే కాలంలో 7.6% ఉండగా, ఈసారి మరింత దూకుడు కనబరచినట్టు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. జీఎస్‌టీ 2.0లో భాగంగా విధించిన పన్ను కోతలు, వినియోగాన్ని పెంచడం కోసం తీసుకున్న చర్యలు, తయారీ రంగంలో ఉత్సాహం, మౌలిక వసతులపై ప్రభుత్వ భారీ వ్యయాలునీ కలిసి వృద్ధికి బలమైన పునాది వేసినట్టు నిపుణులు చెబుతున్నారు.

ప్ర‌పంచం దృష్టి భార‌త్ వైపు .. Global Spotlight on India’s Growth

జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదు చేసిన 8.2% వృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని మాత్రమే కాదు, బలమైన పునరుజ్జీవనాన్ని స్పష్టంగా చూపుతోంది. జీఎస్‌టీ కోతలు వినియోగాన్ని, తయారీని, సేవల రంగాన్ని ఉత్సాహపరిచాయి. ప్రభుత్వ మూలధన వ్యయం, పెరిగిన పెట్టుబడులు, పెరుగుతున్న వినియోగం భారత వృద్ధికి త్రివేణి సంగమమయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దృష్టిని మళ్లీ తనవైపుకు తిప్పుకుంటోంది… ఇక వచ్చే త్రైమాసికాలు ఈ ఉత్సాహాన్ని ఎంత వరకైనా కొనసాగిస్తాయో చూడాలి.

పుంజుకున్న తయారీ రంగం ..Manufacturing Bounces Back Strong

తయారీ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావిస్తారు. గత కొన్నేళ్లుగా ఎదురైన మాంద్య ఒత్తిడులు, సరఫరా వ్యవస్థలో వచ్చిన అంతరాయాలు, ప్రపంచ మార్కెట్లలో తగ్గుతున్న డిమాండ్.. ఈ రంగాన్ని బలహీన పరచిన విషయం తెలిసిందే. అయితే ఈ త్రైమాసికంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తయారీ రంగం వృద్ధి 13.6% న‌మోదైంది. ఆటో, ఎలక్ట్రానిక్స్‌, ఇంజినీరింగ్‌, కెమికల్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలన్నీ మెరుగైన పనితీరును కనబర్చాయి. ఎగుమతుల్లో స్వల్ప పునరుద్ధరణతో అదనపు ఊతం లభించింది. “గ్లోబల్‌ స్లోడౌన్‌ ఉన్నా, భారత తయారీ రంగం పెరిగిన దేశీయ డిమాండ్‌, పన్ను రాయితీలు . ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (PLI) స్కీమ్ల వల్ల గట్టిగా నిలబడింది.

సేవల రంగం స్థిరంగా…Services Sector Remains Solid

దేశ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద వాటా సేవల రంగానిది. ఈ త్రైమాసికంలో సేవల రంగం స్థిరమైన వృద్ధిని చూపింది. ఫైనాన్షియల్‌ సర్వీసులు, ఇన్సూరెన్స్‌, కన్సల్టింగ్‌, పర్యాటకం, ఐటీ–ఐటీఈఎస్‌ రంగాలు విస్తరించాయి. డిజిటల్‌ చెల్లింపుల విస్తరణ, బ్యాంకింగ్‌ రంగంలో రుణాల వృద్ధి సేవల విభాగానికి ఊతమిచ్చాయి. జీఎస్‌టీ కోతలు ముఖ్యంగా రవాణా, హోటల్స్‌, రెడీమేడ్‌ దుస్తులు, వినియోగ సరుకులపై ఉండడంతో… వినియోగదారులు మరింతగా ఖర్చు చేయడం సేవల రంగానికి బలమైన మద్దతు ఇచ్చింది.

జీఎస్‌టీ కోతలతో పెరిగిన వినియోగం.. GST Cuts Spark Consumer Demand

జీఎస్‌టీ కౌన్సిల్‌ ఇటీవల చేసిన 375కు పైగా వస్తువులపై పన్ను తగ్గింపులు మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపాయి. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించడం వల్ల, మార్కెట్లో ఖర్చు పెరిగి ఆర్థిక వ్యవస్థ చురుకుదనాన్ని పొందింది. దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌, రెస్టారెంట్‌ సేవలు, విద్యుత్‌ సామగ్రి, కాస్మెటిక్స్‌ వంటి విభాగాల్లో అమ్మకాలు గణనీయంగా పెరుగుదల, చిన్న మధ్య తరహా వ్యాపారాలు పన్ను భారాన్ని తగ్గించుకోవడంతో ఉత్పత్తి వ్యయాలు తగ్గాయి. పెరిగిన అమ్మకాల వల్ల తయారీదారులు ఉత్పత్తి పెంచి, ఉద్యోగాల సృష్టి కూడా జరిగింది. జీఎస్‌టీ కోతలు డిమాండ్‌ను పెంచాయి. డిమాండ్‌ పెరిగితే ..ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే–ఉద్యోగాలు, ఆదాయం పెరుగుతాయి. అదే మొత్తం ఆర్థిక వృద్ధికి కార‌ణమ‌ని నిపుణులు చెబుతున్నారు.

వ్యవసాయం కొంత మందగించినా… Farm Sector Slows, Economy Steady

వాతావ‌ర‌ణ‌ పరిస్థితులు, వర్షాల లోపం, కొన్ని ప్రాంతాల్లో ఆలస్యమైన పంటలు వ్యవసాయ రంగాన్ని కొంచెం వెనక్కి నెట్టాయి. ఈ త్రైమాసికంలో వ్యవసాయ రంగ వృద్ధి 1.4%కి తగ్గింది. అయితే నిపుణుల అభిప్రాయం “వ్యవసాయం మందగించినా, పరిశ్రమలు, సేవల రంగం పుంజుకోవడంతో మొత్తం ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం కనిపించలేదు.”

పెరిగిన ప్రభుత్వ మూలధన వ్యయం ..Capital Spending Boosts Growth

రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, డిజిటల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌.. దాదాపు అన్ని విభాగాల్లో ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టింది. ఈ మూలధన వ్యయం ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌లా పనిచేసింది. కేంద్ర ప్రభుత్వ క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ 29% పెరుగుదల న‌మోదైంది. రాష్ట్రాలు కూడా మౌలిక వసతుల కోసం భారీగా నిధులు కేటాయించాయి. నిర్మాణ రంగం 10% వృద్ధిని నమోదు చేసింది. ప్రభుత్వ ఖర్చులు పెరగడం వల్ల మార్కెట్లో డబ్బు ప్రవాహం పెరిగి, ప్రైవేటు రంగం కూడా పెట్టుబడుల కోసం ముందుకొచ్చింది. మ‌రోవైపు మదుపరుల విశ్వాసం తిరిగి పెరుగుతోంది. జులై–సెప్టెంబర్‌ త్రైమాసికం గణాంకాల తరువాత… దేశీయ, విదేశీ మదుపరులు భారత వృద్ధి సామర్థ్యంపై మరింత నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) మళ్లీ చైతన్యవంతమయ్యాయి. స్టార్టప్‌ రంగంలో కూడా కొత్త పెట్టుబడులు మొదలయ్యాయి. పునరుత్పాదక శక్తి, ఫార్మా, ఐటీ, ఈ–కామర్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల రంగాల్లో పెట్టుబడి ప్రవాహం పెరుగుతోంది. స్టాక్‌మార్కెట్‌లో కూడా వృద్ధి అంచనాలతో పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ పాజిటివ్‌గా కొనసాగుతోంది.

ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మధ్య భారత ప్రతిభ.. India Outshines Amid Global Slowdown

అమెరికా, చైనా, యూరోప్‌ వంటి ప్రధాన దేశాల్లో వృద్ధి రేట్లు తగ్గిపోతున్నాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల … ఇవన్నీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే భారత్ మాత్రం వేరే దారిలో సాగుతోందని విశ్లేషకులు అంటున్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణలో కొనసాగుతుండడం, యువతలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతుండటం, స్టార్టప్‌–ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ లోకాన్ని ఆకర్షించడం .. భారత ఆర్థిక వ్యవస్థను ఇతర దేశాల కంటే స్థిరంగా నిలబెట్టినట్టు తేలింది.

పెరిగిన పన్ను ఆదాయం ..Stronger Tax Revenues Lift Outlook

జీఎస్‌టీ కోతలు ఉన్నప్పటికీ, మొత్తం పన్ను ఆదాయం మాత్రం పెరుగుతుండటం విశేషం. డిజిటల్‌ లావాదేవీల పెరుగుదల, బిల్లింగ్‌ వ్యవస్థ పారదర్శకత, పన్ను ఎగవేతపై కఠిన చర్యలే ఇందుకు కార‌ణాలుగా ఆర్థిక‌వేత్త‌లు చెబుతున్నారు. జీఎస్‌టీ వసూళ్లు నెలకొకసారి ₹1.6 లక్షల కోట్లను దాటుతున్నాయి. ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్నుల్లో కూడా పెరుగుదల ప్రభుత్వ ఆర్థిక స్థితిని బలపర్చాయి.

భవిష్యత్తులో వృద్ధి .. India Poised for Stronger Future Growth

నిపుణుల అంచనా ప్రకారం రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి 7%–7.5% మధ్య కొనసాగొచ్చు. జీఎస్‌టీ కోతల ప్రభావం ఇంకా కొన్ని నెలలు కొనసాగుతుంది. పండుగల సీజన్‌ అమ్మకాలు, పెట్టుబడి ప్రవాహం వృద్ధికి సహకరిస్తాయి. ప్రపంచ పరిస్థితులు కొంత మెరుగుపడితే ఎగుమతుల్లో మంచి వృద్ధి న‌మోద‌య్యే అవకాశం ఉంది. అయితే వ్యవసాయం, అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి తదుపరి వృద్ధికి సవాళ్లుగా నిలవొచ్చని నిపుణులు చెబుతున్నారు. పరిశ్రమలు పెట్టుబడులను పెంచుతున్నాయి. గ్లోబల్ డిమాండ్ క్రమంగా మెరుగుపడుతోంది. అంతర్గత వినియోగం కూడా బలపడుతోంది. ఈ ధోరణి కొనసాగితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27)లో కూడా జీడీపీ వృద్ధి బాగానే న‌మోద‌వుతుంద‌ని నిపుణులు అంచనా.

 

210
FEATURE NEWS Tags:Capital Spending Boosts Growth, Economy Steady, Farm Sector Slows, Global Spotlight on India’s Growth, GST Cuts Spark Consumer Demand, India Outshines Amid Global Slowdown, India Poised for Stronger Future Growth, Manufacturing Bounces Back Strong, Services Sector Remains Solid, Stronger Tax Revenues Lift Outlook

Post navigation

Previous Post: బాండ్లపై పెరుగుతున్న ఆసక్తి! సెబీ హెచ్చ‌రిక‌లు! Rising Interest in Bonds! SEBI Issues Fresh Warnings
Next Post: బంగారం ధరలు నిర్ణయించే స్థాయికి భారత్ చేరుకుంటుందా? Is India Rising to Become a Gold Price Maker?

Related Posts

  • కొత్త ఆదాయపు పన్ను నియమాలు ఇవే..! Here Are the New Income Tax Rules! FEATURE NEWS
  • ప్రభుత్వేతర చందాదార్లకు శుభ‌వార్త‌.. ఇక‌పై ఎన్‌పీఎస్‌లో 80% నిధులు వెనక్కి తీసుకోవచ్చు Good News for NPS Investors.. Now You Can Withdraw Up to 80% of NPS Funds! FEATURE NEWS
  • టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే how to start term insurance FEATURE NEWS
  • మినిమమ్‌ బ్యాలెన్స్ క‌ష్టాల‌కు చెక్‌… జీరో బ్యాలెన్స్‌ ఖాతాతో ఉపశమనం Relief From Minimum Balance Penalties: Zero Balance Account Option FEATURE NEWS
  • సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడిని మూడు రెట్లు ఎలా పెంచుకోవాలో తెలుసా? Do You Know How to Triple Your Investment in Sukanya Samriddhi Yojana? FEATURE NEWS
  • 2024 సంవత్సరంలో Health insuranceలో మార్పులు తెలుసుకుందాం Let’s know the changes in health insurance in the year 2024 FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • టోల్ ప్లాజా దాటుతున్నారా? ఈ పత్రాలు లేకపోతే క‌ష్ట‌మే! No Valid Documents? Digital System Issues eChallan Instantly FEATURE NEWS
  • ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ … కీలక వడ్డీ రేట్లపై మ‌రో కోత RBI Delivers Good News Again: Another Cut in Key Interest Rates FEATURE NEWS
  • WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT ఒక ఎన్ఆర్ఐ తన ఈపీఎఫ్‌ ఖాతాను ఏం చేయాలి FEATURE NEWS
  • ఇక నేరుగా అమెరికా స్టాక్ మార్కెట్‌లోనూ పెట్టుబ‌డులు పెట్టొచ్చు..! Direct Access to US Stocks from India MARKET
  • డిజిట‌ల్ గోల్డ్ కొన‌వ‌చ్చా..? Can We Buy Digital Gold? FEATURE NEWS
  • శ్రీలంక సంక్షోభానికి కార‌ణం ఇదేనా what is the reason behind srilanka crisis NEWS
  • క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవ‌డ ఎలా? How to Increase Your Credit Card Limit FEATURE NEWS
  • థింక్‌ అండ్ గ్రో రిచ్ బుక్ స‌మ‌రీ Think and grow rich book summery telugu BOOKS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme