Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS
  • రూ.1000తో ప్రారంభం… ఐదేళ్లలో లక్షల సంపద సాధ్యమేనా? Start with ₹1,000… Can You Build Lakhs in 5 Years? FEATURE NEWS
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.61 వేల ఆదాయం… పీపీఎఫ్‌తో సాధ్యమేనా? ₹61,000 Monthly Income After Retirement.. Can PPF Make It Possible? FEATURE NEWS
  • పోస్ట్ ఆఫీస్ NSC vs బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ FD… లాభాల్లో ఏది బెస్ట్? Post Office NSC vs Bank Tax Saving FD.. Which Wins on Returns? FEATURE NEWS
  • నెలకు రూ.5,000తో లక్షల సొమ్ము… PPF, ELSS, NPSలలో ఏది బెస్ట్ అంటే? ₹5,000 Monthly Investment: Which Is Best—PPF, ELSS, or NPS to Build Wealth? FEATURE NEWS
  • అక్షయ తృతీయ ప్రత్యేకం..పసిడి–వెండి పెట్టుబడులు… సంపదకు కొత్త దారి .. Akshaya Tritiya Special.. Gold & Silver Investments – A Path to Wealth Creation FEATURE NEWS
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని ఎంత‌కాలం కొన‌సాగిస్తే లాభాదాయకం How long does it take to maintain a mutual fund investment to be profitable

Posted on 11/10/202512/10/2025 By admin No Comments on మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని ఎంత‌కాలం కొన‌సాగిస్తే లాభాదాయకం How long does it take to maintain a mutual fund investment to be profitable

ఈ కాలంలో చాలా మంది మదుపరులు మ్యూచువల్ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్​ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) గణాంకాల ప్రకారం, మ్యూచువల్​ ఫండ్ల నిర్వహణలో ఉన్న సగటు ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.46.71 లక్షల కోట్లు. ​ ఇటీవ‌ల మ్యూచువ‌ల్ ఫండ్లలోకి దాదాపు రూ.20,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా ఇండియన్ ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలో మ్యూచువల్ ఫండ్లకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Mutual Fund Long Term Investment Benefits
మ్యూచువల్ ఫండ్ దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు
మ్యూచువల్ ఫండ్స్​లో దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కానీ దాదాపు 51 శాతం మంది కేవలం ఒక్క ఏడాదిలోపే తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. మరో 29 శాతం మదుపరులు మాత్రమే తమ పెట్టుబడిని రెండేళ్లకు మించి కొనసాగిస్తున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

నష్టభయం ఉన్న‌ప్పటికీ..
కొన్ని మ్యూచువల్​ ఫండ్లలో నష్టభయం కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరికొన్నింటిలో నష్టభయం కాస్త తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్​ తీసుకుంటే వీటిలో రిస్కు, రాబడి రెండూ తక్కువగానే ఉంటాయి. అదే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్ విషయానికి వస్తే వీటిలో రిస్క్​, రివార్డ్ రెండూ ఎక్కువగానే ఉంటాయి(Mutual Fund Long Term Investment Benefits). అంటే నష్టభయం ఎక్కువగా ఉన్న చోట, దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. అందుకే స్వల్ప నష్టభయం ఉన్న పథకాల్లో కనీసం 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకూ పెట్టుబడులను కొనసాగించాలి. అదే నష్టభయం ఎక్కువగా ఉన్న పథకాల్లో కనీసం 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు పెట్టుబడులను కొనసాగించాలి. అప్పుడే మార్కెట్‌ అస్థిరతను తట్టుకొని, మంచి లాభాలు పొందేందుకు వీలవుతుంది.

పన్నుల భారం తగ్గాలంటే..
మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను స్థూలంగా డెట్‌, ఈక్విటీలుగా వర్గీకరించవచ్చు. వీటిపై వచ్చే లాభాలపై పన్నులు వేర్వేరుగా ఉంటాయి. వాస్తవానికి నిర్ణీత డెట్‌ ఫండ్ల నుంచి వచ్చిన లాభాలను మీ వ్యక్తిగత ఆదాయంలో భాగంగా కలిపి చూపించి, అందుకు వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది(Mutual Fund Long Term Investment Benefits). అదే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లపై వచ్చిన లాభాలను ఒక ఏడాదిలోపు స్వీకరిస్తే ఆ మొత్తంపై 15 శాతం వరకు స్వల్పకాలిక మూలధన రాబడి పన్ను చెల్లించాలి. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించినప్పుడు దానిపై వచ్చిన లాభాలను దీర్ఘకాలిక మూలధన రాబడిగా పరిగణిస్తారు. అప్పుడు ఏడాదికి రూ.1,00,000కు మించి వచ్చిన లాభాలపై 10 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఎగ్జిట్ లోడ్ పడకుండా..
కొన్ని మ్యూచువల్​ ఫండ్స్​లోని పెట్టుబడులను నిర్ణీత వ్యవధి కంటే ముందే ఉపసంహరించుకున్నప్పుడు అమ్మకపు రుసుము (ఎగ్జిట్‌ లోడ్‌) చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు కొన్ని మ్యూచువల్​ ఫండ్లు పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి ఒక ఏడాదిలోపు యూనిట్లను విక్రయిస్తే.. 1 శాతం వరకు రుసుమును వసూలు చేస్తాయి. వాస్తవానికి రిడీమ్ చేసిన యూనిట్ల విలువ ఆధారంగా (ఎగ్జిట్ లోడ్) రుసుము వసూలు చేస్తాయి. కనుక ఇలాంటి అనవసర వ్యయాలు జరగకుండా ఉండాలంటే లాకిన్ పీరియడ్ ముగిసే వరకైనా పెట్టుబడులను కొనసాగించడం మంచిది.

సమీక్షించుకోవాలి..
చాలా మంది తాము ఇన్వెస్ట్ చేసిన ఫండ్‌ పనితీరు బాగా లేనప్పుడు పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ సూచీలు కుదుటపడ్డాక ఇవి వేగంగా కోలుకుంటాయి. కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దీర్ఘకాలంలో ఫండ్‌ పనితీరు ఎలా ఉందో పరిశీలించాలి. అదే విభాగంలోని ఇతర మ్యూచువల్​ ఫండ్లతో పోల్చి చూసుకోవాలి. ఒక వేళ మీరు పెట్టుబడి పెట్టిన మ్యూచువల్ ఫండ్​ పనితీరు ఏ మాత్రం బాగా లేకపోతే అప్పుడు మాత్రమే దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. ఒక వేళ ప్రామాణిక సూచీలకు అనుగుణంగానే రాబడిని అందిస్తుంటే మరి కొంత కాలం మీ పెట్టుబడులను కొనసాగించే ప్రయత్నం చేయాలి.

లక్ష్యం నెరవేరేదాక .. Until the goal is achieved
వాస్తవానికి మీ ప్రతి పెట్టుబడికీ ఒక లక్ష్యం ఉండాలి. ఇందుకోసం దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లాలి. ఎంచుకున్న పథకంలో అనుకున్న మొత్తం జమ అయ్యేదాకా వేచి చూడాలి. ఎప్పుడూ చిన్న చిన్న అవసరాల కోసం దీర్ఘకాలిక పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా జాగ్రత్త పడాలి. మీరు ఆశించిన మొత్తం సమకూరిన వెంటనే సదరు మ్యూచువల్ ఫండ్​ నుంచి మీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలి. ఇలా చేస్తే కచ్చితంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

* మీరు కనీసం 3 ఏళ్లపాటు పెట్టుబడులను కొనసాగించాలని అనుకుంటే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) లేదా క్లోజ్డ్‌ ఎండెడ్‌ ఫండ్‌ పథకాల్లో ఇన్వెస్ట్​ చేయాలి. ఎందుకంటే ఈఎల్‌ఎస్‌ఎస్‌లకు 3 ఏళ్ల లాకిన్‌ పీరియడ్​ ఉంటుంది. అలాగే క్లోజ్డ్‌ ఎండెడ్‌ పథకాలకు సాధారణంగా 3 ఏళ్లు నుంచి 5 ఏళ్ల వరకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. కనుక తొందరపాటుతో పెట్టుబడులను వెనక్కు తీసుకోకుండా ఇవి అడ్డుకుంటాయి.

* ఒక్కో ఫండ్‌ను ఒక్కో ల‌క్ష్యం కోసం పెట్టుకోండి Invest each fund for a specific goal

– రిటైర్మెంట్ కోసం ఒక ఫండ్ అనుకోండి. అందులో కొంచెం అమౌంట్‌తో సిప్ పెట్టుకోండి. దీన్ని మీరు దీర్ఘ‌కాలం కొన‌సాగించాల్సి ఉంటుంది.

– మీ పిల్ల‌ల భ‌విష్య‌త్తు, వారి చ‌దువుల కోసం ఒక ఫండ్ పెట్టుకోండి. అందులో కొంచెం ఎక్కువ అమౌంట్ తో సిప్‌ పెట్టుకోండి. పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల ల‌క్ష్యం తో దీన్ని కొన‌సాగించండి. ఇందులో స్టెప్ అప్ ఆప్ష‌న్ ను ఏక్టివేట్ చేసుకోండి. అంటే మీ ఆదాయం పెరిగేట‌ప్పుడు మీ సిప్ అమౌంట్ కూడా పెరుగుతుంది.

– మీ కుటుంబ అవ‌స‌రాల కోసం మ‌రో ఫండ్ పెట్టుకోండి. అంటే బంగారం లేదా కారు వంటి పెద్ద వ‌స్తువులు కొనాల‌నుకుంటే అందుకోసం ముందుగానే ఒక సిప్ పెట్టుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఈ ఫండ్‌లో మీకు వీలైన‌ప్పుడు మ‌రి కొంత సొమ్మును అద‌నంగా జ‌మ చేసుకుంటూ ఉండండి. ఏదైనా అవ‌స‌రం అనుకున్న‌ప్పుడు కొంచెం తీసుకోండి. ఇలా చేయ‌డం వ‌ల్ల మీకు ఆర్థిక భారం రాకుండా మీ అవ‌స‌రాలు తీరుతాయి.

ఇలా మీకున్న దీర్ఘ కాల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని 4 లేదా 5 మ్యూచువ‌ల్ ఫండ్స్‌తో ఒక పోర్టుఫోలియోని ఏర్ప‌రుచుకోండి. ఇలా ఒక ప్లానింగ్‌తో ఇన్వెస్ట్ చేసుకుంటే మీ జీవితం శుభ‌ప్ర‌దం అవుతుంది.

221
FINICAL PLANNING, MUTUAL FUNDS Tags:How long does it take to maintain a mutual fund investment to be profitable, Mutual Fund Investment Tips, Mutual Fund Long Term Investment Benefits, Until the goal is achieved

Post navigation

Previous Post: Unclaimed Deposits  లెక్క తేల్చండి..!   “మీ డబ్బు – మీ హక్కు”  గురించి తెలుసుకోండి!  Check Your Unclaimed Deposits! Learn About “Your Money – Your Right”!
Next Post: FDలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా..? అధిక వడ్డీ రేట్లు చెల్లిస్తున్న బ్యాంకులివే.. Planning to Invest in an FD..? Here Are the Banks Offering the Highest Interest Rates..

Related Posts

  • Investment Vs Loan Repayment పెట్టుబడి Vs రుణం చెల్లింపు.. ఏది లాభ‌దాయ‌కం FEATURE NEWS
  • జాబ్ చేయాలా? బిజినెస్ స్టార్ట్‌ చేయాలా? ఇవి తెలుసుకొని డిసైడ్‌ అవ్వండి! Job or Business – How to Choose the Right Career Path? FEATURE NEWS
  • WHAT IS THE FINANCIAL FREEDOM?ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి? FINICAL PLANNING
  • డిజిటల్ గోల్డ్ కొనొద్దు.. సెబీ హెచ్చరిక.. ! Don’t Buy Digital Gold… SEBI Issues Warning! FEATURE NEWS
  • ఎంత సంపాదిస్తున్నా.. డబ్బులు మిగ‌ల‌ట్లేదా..? అయితే ఈ తప్పులే కారణం! Earning More but Saving Nothing? Here’s What You’re Doing Wrong! FINICAL PLANNING
  • గోల్డ్/రియ‌ల్ఎస్టేట్/ఈక్విటీ… ఏది బెస్ట్‌.? FINICAL PLANNING

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • రూ.1000తో ప్రారంభం… ఐదేళ్లలో లక్షల సంపద సాధ్యమేనా? Start with ₹1,000… Can You Build Lakhs in 5 Years?
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.61 వేల ఆదాయం… పీపీఎఫ్‌తో సాధ్యమేనా? ₹61,000 Monthly Income After Retirement.. Can PPF Make It Possible?
  • పోస్ట్ ఆఫీస్ NSC vs బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ FD… లాభాల్లో ఏది బెస్ట్? Post Office NSC vs Bank Tax Saving FD.. Which Wins on Returns?
  • నెలకు రూ.5,000తో లక్షల సొమ్ము… PPF, ELSS, NPSలలో ఏది బెస్ట్ అంటే? ₹5,000 Monthly Investment: Which Is Best—PPF, ELSS, or NPS to Build Wealth?
  • అక్షయ తృతీయ ప్రత్యేకం..పసిడి–వెండి పెట్టుబడులు… సంపదకు కొత్త దారి .. Akshaya Tritiya Special.. Gold & Silver Investments – A Path to Wealth Creation
  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • క్రెడిట్ స్కోర్ పెరిగేదెలా how to improve credit score FEATURE NEWS
  • రీట్స్ అంటే ఏమిటి What Is The REITs INVESTMENTS
  • హోం లోన్ త్వ‌రగా తీర్చొద్దు.. ఎందుకంటే why dont we repay home loan early FINICAL PLANNING
  • డిసెంబర్ 31 లోపు ఈ 5 పనులు పూర్తి చేయకపోతే భారీ పెనాల్టీలు తప్పవు.. Miss These 5 Tasks Before December 31? Be Ready for Hefty Penalties! FEATURE NEWS
  • పాత ఇంటిని అమ్మేస్తున్నారా..? అయితే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోకుంటే న‌ష్ట‌మే! Selling Your Old House? Ignore These Precautions and You Could Lose Lakhs! FEATURE NEWS
  • కేవైసీ (Know Your Customer) విధానం మరింత కఠినతరం.. KYC (Know Your Customer) Norms Tightened Further FEATURE NEWS
  • పెర‌గ‌నున్న విమాన రంగ ఆదాయం.. NEWS
  • ఇంట్రాడే ట్రేడింగ్ అంటే what is intraday trading MARKET

Copyright © 2026.

Powered by PressBook News Dark theme