అప్పులు లేకుండా జీవిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదే పెట్టుబడులు పెడితే ఆర్థిక లాభాలు వచ్చి, భవిష్యత్ ఆనందమయం అవుతుంది. కానీ, ఈ రెండింటినీ సాధించడం అంత సులువైన పని కాదు. ఒక వేళ మీకు ఇప్పటికే అప్పులు ఉంటే, ముందు వాటిని తీర్చడానికి ప్రయత్నించాలా? లేదంటే మీ చేతిలో ఉన్న డబ్బులతో భవిష్యత్ కోసం పెట్టుబడులు పెట్టాలా? ఈ రెండింటిలో ఏది మంచిదనే దానిపై ఆర్థిక నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అప్పు తీర్చడం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది, ఆర్థిక భద్రత పెరుగుతుంది. అయితే పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఏది బెస్ట్ అనేది వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి, లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. లోన్ రీపేమెంట్ చేయడం వల్ల అప్పుల భారం తగ్గుతుంది. వడ్డీ చెల్లింపులు ఆదా అవుతాయి, ఆర్థిక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. అయితే తక్కువ రాబడి వల్ల పెట్టుబడి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. కాగా దీర్ఘకాలంలో సంపద పెరగనుంది.
అధిక వడ్డీ రేటు ఉన్న అప్పులు ఉంటే ముందుగా వాటిని తీర్చడం మంచిది. తక్కువ వడ్డీ రేటు ఉన్న అప్పులు ఉంటే రాబడి ఎక్కువగా ఉండే పెట్టుబడులను పరిశీలించవచ్చు. ఆర్థిక లక్ష్యాలు, నష్ట భయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక నిపుణుడిని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.
రుణం తీసుకునే ముందు..
Before Taking a Loan
పిల్లల చదువులు, ఆసుపత్రి బిల్లులు, ఇంటి మరమ్మతులు, వస్తు, సేవల కొనుగోళ్లు ఇలా రకరకాల ఖర్చుల కోసం చాలా డబ్బులు అవసరం అవుతాయి. అందుకే చాలా మంది ఈ ఖర్చుల కోసం వ్యక్తిగత రుణం తీసుకుంటూ ఉంటారు. కొన్ని తప్పని పరిస్థితుల్లో పెట్టుబడులను కూడా వాయిదా వేస్తుంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు అన్నింటి కంటే ముఖ్యంగా రుణానికి సంబంధించిన నియమ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే క్రమపద్ధతిలో అప్పులు తీర్చడానికి, మదుపు చేయడానికి వీలవుతుంది.
వడ్డీ రేటు, వాయిదాలు, వ్యవధి..
Interest Rate, EMIs, and Loan Tenure
ఎలాంటి లోన్స్ తీసుకున్నా, వడ్డీ రేటు మాత్రం కనీస స్థాయిలోనే ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పర్సనల్ లోన్ వడ్డీ రేటు వీలైనంత తక్కువగా ఉండాలి. అప్పుడే వడ్డీ భారం తగ్గుతుంది. మీరు చెల్లించే రుణ వాయిదాలు అన్నీ కలిపి, మీ మొత్తం ఆదాయంలో 30 శాతానికంటే మించి ఉండకూడదు. అప్పు తీసుకునే ముందే, దానిని ఎన్నాళ్లలో తీర్చగలరో అంచనా వేసుకోవాలి. వీలైనంత తక్కువ వ్యవధితో రుణాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే వడ్డీ భారం తగ్గుతుంది. మిగిలిన సొమ్మును మదుపు చేయడానికి వీలవుతుంది. మీ ఆదాయం పెరిగినప్పుడు, బ్యాంకును సంప్రదించి ఈఎంఐ పెంచుకోవాలి. దీని ద్వారా రుణ వ్యవధి, వడ్డీ భారం రెండూ తగ్గుతాయి. ఒక వేళ మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు జమ అయితే, ముందస్తుగానే అప్పు మొత్తాన్ని తీర్చేందుకు ప్రయత్నించాలి. అయితే కొన్ని బ్యాంకులు, ముందస్తుగా రుణం చెల్లించేవారి నుంచి, 5 శాతం వరకూ అపరాధ రుసుము వసూలు చేస్తుంటాయి. ఈ విషయాన్ని మీరు గమించాలి. వీలైనంత తొందరగా అప్పు తీర్చాలి. అ తర్వాతే పెట్టుబడుల గురించి ఆలోచించాలి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ మీ దగ్గర కొద్ది మొత్తమే మిగులు ఉంటే, సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు.
అప్పు తీసుకుని మదుపు చేయవచ్చా
Is It Okay to Take a Loan for Investment
కొంత మంది అప్పు తీసుకొని, ఆ డబ్బుతో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ఇది ఎంతమాత్రం మంచిదికాదు. ప్రస్తుతం పలు బ్యాంకులు పర్సనల్ లోన్స్‌పై కనిష్ఠంగా 9.15 శాతం నుంచి గరిష్ఠంగా 36 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇది చాలా ఎక్కువ వడ్డీ రేటు. ఇంత ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకుని, పెట్టుబడులు పెడితే నష్టపోక తప్పదు. ఎందుకంటే, నేడు ఇంత ఎక్కువ వడ్డీ రేటును అందించే పొదుపు, మదుపు పథకాలు ఏమీ లేవు. కొన్నిసార్లు ముందస్తుగా వ్యక్తిగత రుణం తీర్చడం సాధ్యం కాకపోవచ్చు. బ్యాంకు నిబంధనల ప్రకారం, నిర్దిష్ట వ్యవధి తరువాత మాత్రమే లోన్ తీర్చాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో, మీ దగ్గర ఉన్న సొమ్మును లిక్విడ్ ఫండ్లలో, స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మదుపు చేయాలి. వీటి ద్వారా వచ్చిన రాబడిని, మీ రుణాలను తీర్చడానికి ఉపయోగించాలి.
కానీ మనలో చాలా మందికి ఉండే జీవితకాల కల సొంత ఇళ్లు. అందుకే హోం లోన్ తీసుకుని ఇంటిని కొనుక్కోవడమో, లేదా కట్టుకోవడమో చేస్తుంటారు. ఇలాంటి వాళ్లు కూడా రుణం తీసుకున్న కొన్నళ్ల తరువాత డబ్బు ఉన్నప్పడు అప్పు తీర్చాలా లేదా ఆ డబ్బుతో ఏదైనా పెట్టుబడి పెట్టాలా అని ఆలోచిస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భంలో హోం లోన్ గుర్తించి పూర్తిగా తెలుసుకోవాలి. హోం లోన్ విధి విధానాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి.
హోమ్ లోన్ టిప్స్
Home Loan Tips in Telugu
సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గృహ రుణం తీసుకునేటప్పుడు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన టిప్స్ ఇవి..
* హోమ్ లోన్ పొందేందుకు ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను ఒకసారి తనిఖీ చేయండి.
CIBIL స్కోర్ 750 పైగా ఉంటే మంచి వడ్డీ రేటుకు అర్హత కలుగుతుంది.
* అన్ని బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలను పోల్చండి. SBI, HDFC, ICICI, LIC HFL వంటి పెద్ద బ్యాంకుల్లో ముందుగా పరిశీలించండి.
* లాక్ ఇన్ కాలం (Lock-in Period) తెలుసుకోండి కొన్ని రుణాలకి ముందుగా చెల్లించే వీలుండదు లేదా చెల్లిస్తే పెనాల్టీ ఉంటుంది.
ఈ షరతులు తెలుసుకోండి
Know these conditions
* EMI అఫోర్డబిలిటీని అంచనా వేయండి. మీ నెలవారీ ఆదాయంలో 30% లోపు మాత్రమే EMI ఉండేలా చూసుకోండి. మీకు లభించే EMI calculatorను ఉపయోగించి ముందుగా లెక్కించుకోండి.
* పార్టియల్ ప్రిపేమెంట్(Partial Prepayment)ను వినియోగించండి. అదనంగా ఆదాయం వచ్చినప్పుడు కొంత మొత్తం రుణానికి చెల్లించండి. దీని వల్ల వడ్డీ భారం తగ్గుతుంది. రుణ కాలం తక్కువవుతుంది.
* ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు మొదట తక్కువగా కనిపించవచ్చు కానీ తర్వాత పెరగవచ్చు. ఫిక్స్‌డ్ రేట్లు స్థిరంగా ఉంటాయి – మార్కెట్ పెరిగినా తగ్గినా మారవు.
ఇన్‌షూరెన్స్‌ను పరిగణించండి
Consider insurance
హోమ్ లోన్‌కు సంబంధించి లైఫ్ ఇన్‌షూరెన్స్ లేదా హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ ఉండటం మంచిది. అకాల మరణం లేదా ఉద్యోగ నష్టం వచ్చినా లోన్ ఈఎంఐ లను బ్యాంకే చెల్లించుకుంటుంది. ఈ ప్లాన్ అనేది కుటుంబాన్ని రక్షించగలుగుతుంది.
ఇన్‌కం ట్యాక్స్ ప్రయోజనాలు పొందండి
Get income tax benefits
హోమ్ లోన్‌పై సెక్షన్ 80C కింద ప్రిన్సిపల్ మీద ₹1.5 లక్షల వరకు మినహాయింపు. సెక్షన్ 24(b) కింద వడ్డీపై ₹2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.
ప్రాసెసింగ్ టైమ్ & డాక్యుమెంటేషన్
Processing Time & Documentation
బ్యాంకులు అడిగే సాధారణ డాక్యుమెంట్లు అయిన ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ (salary slips, IT returns) పత్రాలను సమర్పించడం వల్ల లోన్ వేగంగా వచ్చే అవకాశం ఉంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) వంటి స్కీమ్‌లలో సబ్సిడీ లభించవచ్చు. అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి. మీరు మీ గృహ రుణాన్ని తక్కువ వడ్డీ రేటు ఉన్న ఇతర బ్యాంకులకు బదిలీ చేయవచ్చు.
ఖర్చులను నియంత్రించాలి
Costs should be controlled
గృహ రుణం తీసుకున్న తర్వాత, మీ ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేసి, అనవసరమైన వాటికి దూరంగా ఉండండి. దీని ద్వారా మీ EMI లను
సకాలంలో చెల్లించవచ్చు.

