what is algo trading..? ఆల్గో ట్రేడింగ్ అంటే ఏమిటి…?
what is algo trading
ట్రేడింగ్ చేయాలంటే ప్రత్యక్షంగా స్టాక్ మార్కెట్‌లో చాలా టైం కేటాయించాల్సి ఉంటుంది. నిత్యం కూర్చొని మార్కెట్‌ని వాచ్ చేస్తూ ట్రేడ్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం కొంచెం కష్టమైన పని. చాలా ఓపిక, తీరిక కూడా ఉండాలి. అంతే కాకుండా ఈ క్రమంలో వచ్చే ఎమోషన్స్‌ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ లాభాలకు గ్యారెంటీ లేదు. కానీ ఇలాంటి కష్టాలకు కొంత వరకు చెక్ పెట్టేందుకు తీసుకువచ్చిన విధానమే ఆల్గో ట్రేడింగ్. ఇక్కడ మనం ఏమీ చెయ్యనక్కర్లేదు. మనం చెప్పినట్టు విని కంప్యూటరే పని చేసుకుంటుంది. దీనివల్ల మనకు టైం సేవ్.. ఎమోషన్ కానక్కర్లేదు. కానీ లాభనష్టాలు మాత్రం చెప్పలేం. ఇదంతా కేవలం ఓ సాఫ్ట్ వేర్ మాత్రమే. అయితే ఇక్కడ ఎంత వెసులుబాటుఉందో అంతే మొత్తంలో మోసపోయేందుకు అవకాశంఉంది. అయితే దీనిగురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
అల్గో ట్రేడింగ్ అంటే ఏదైనా ఆర్ఢర్ ను ఆటోమేటెగ్గా ఎగ్జిక్యూటివ్ లాజిక్ తో తనంతట తానే జనరేట్ అయ్యేలా చేయడం. అల్గో ట్రేడింగ్ వ్యవస్థ ఎప్పటికప్పుడు లైవ్ లో షేర్ల ధరలను పరిశీలించి, ఇన్వెస్టర్లు సూచించిన ప్రమాణాలకు తగినట్లుగా ఆర్డర్ పెడుతుంది. దీని వల్ల మాన్యువల్ గా ఆర్డర్ల ను పెట్టడంతో పాటు, లైవ్ లో షేర్ల ధరలను పరిశీలిస్తూ ఉండడం నుంచి మదుపరికి ఉపశమనం కలుగుతుంది. ప్రతిపాదిత వ్యవస్థలో రిటైల్ మదుపర్లు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ యాక్సెస్ తో పాటు ఆటోమేషన్ ఆఫ్ ట్రేడ్స్ ను వినియోగించుకుంటారు.
be careful with algo
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు నిరంతరం అల్గారిథమిక్ ట్రేడింగ్ పై అప్రమత్తంగా ఉండాలని సెబీ ఇటీవల హెచ్చరించింది. అనియంత్రిత సంస్థలు అందించే అల్గో ట్రేడింగ్ కు బాధితులుగా మారకూడదని సెబీ అప్రమత్తం చేసింది. ఎక్కువ రాబడి లేదా వారి వ్యూహాలకు ఎక్కువ రేటింగ్ ను చూపి ఇన్వెస్టర్లను మాయ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ట్రేడింగ్ లో భద్రతను పెంచడం కోసం, అవకతవకలు జరగకుండా చూసేందుకు అనుమతించిన అల్గారిథమిక్ ట్రేడింగ్ ను కొన్ని సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని, జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
use registered algos only
అనుమతి లేకుంటే వద్దు..
ప్రస్తుతం బ్రోకర్లు సమర్పించిన ఆల్గోకు ఎక్స్ఛేంజీలు అనుమతులు ఇస్తున్నాయి. కొన్ని అనుమతులు లేని వాటిని కూడా రిటైలర్లు వాడుతున్నారు. ఈ తరహా నియంత్రణ లేని లేదా అనుమతి లేని అల్గోల వల్ల మార్కెట్ కు నష్టభయం పెరుగుతుంది. అదే సమయంలో వీటిని వినియోగించి వ్యవస్థీకృత అవకతవకలకు పాల్పడే అవకాశమూ ఉంది. ఏదైనా అల్గో వ్యూహం విఫలమైతే రిటైల్ ఇన్వెస్టర్ కి భారీగా నష్టం వాటిల్లుతుందనడంలో సందేహం లేదు.
ఎలా నియంత్రించాలి
* థర్డ్ పార్టీ అల్గో ప్రొవైడర్లు వెండర్ల పై ఎటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కూడా లేదు. అందుకే వీటిని స్టాక్ బ్రోకర్ నియంత్రించాల్సి ఉంటుంది.
* ఏపీఐలు తమ అల్గో ట్రేడింగ్ ను ఒక విశిష్ట అల్గో ఐడీతో ట్యాగ్ చేయాలి. అప్పుడే ఆ అల్గోకు స్టాక్ ఎక్స్చేంజీ నుంచి అనుమతి వస్తుంది.
* ప్రతి అల్గో వ్యూహం ఎక్స్ఛేంజీ అనుమతి పొందాలి.
* అల్గోలను అనధికారికంగా ఎవరూ మార్చకుండా ఉండేందుకు అవసరమైన సాంకేతిక టూల్స్ ను బ్రోకర్లు వినియోగించుకోవాలి.
* బ్రోకర్లు సొంతంగా అల్గో వ్యూహాలను అభివృద్ధి చేసుకోవచ్చు. లేదంటే అనుమతి పొందిన వెండర్ ద్వారా పొందొచ్చు. అయితే ఇన్వెస్టర్ల నుంచి ఫిర్యాదు వస్తే మాత్రం స్టాక్ బ్రోకర్లే బాధ్యత వహించాలి.
what to know before using algos
ముఖ్యమైన విషయాలు ఇవీ..
* ఒక అల్గో వ్యూహం నుంచి మరోదానికి తరచూ మారవద్దు.
* ఒక వ్యూహాన్ని ఎంచుకున్న తర్వాత దాన్ని కనీసం ఏళ్ళ పాటు కొనసాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
* కనీసం రూ.5లక్షల పెట్టుబడితో అల్గో ట్రేడింగ్ లో అడుగుపెట్టడం మంచిది.
* ఒక ట్రేడింగ్ పై మన పెట్టుబడిలో 2-2.5 శాతానికి మించి ఖర్చుచేయవద్దు.
* అనియంత్రిత సంస్థలకు మన ట్రేడింగ్ అకౌంట్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ చెప్పకూడదు.
* మనకి అనుభవం లేకపోతే రిస్క్ ఎక్కువ ఉండే వ్యూహలకు దూరంగా ఉండడం మంచిది.
* ఒక అల్గో వ్యూహాన్ని ఎంచుకునే ముందు విన్ లాస్ రేషియో రాబడి ఎంత వరకు ఉంటుంది, నష్టపోతే ఏ స్థాయిలో డబ్బు కోల్పోయే అవకాశం ఉందో తెలుసుకోవాలి. కేవలం బుల్ మార్కెట్ లేదా బేర్ మార్కెట్ లో పనిచేస్తే కుదరదు.
olymp trade,
octafx,
zerodha streak,
5 paisa,
alice blue
arihanth capital.. etc
ఇవన్నీ ఆల్గో ట్రేడింగ్‌ను అందిస్తున్న సంస్థలు. వీటితో పాటు కొన్ని బ్రోకింగ్ ఏజెన్సీలు కూడా ఆల్గో సాఫ్ట్ వేర్‌ను అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఫ్రీగా ఈ సాఫ్ట్ వేర్‌ను అందింస్తుంటే చాలా సంస్థలు ఈ సాఫ్ట్‌వేర్ వాడేందుకు చార్జీలు వసూలు చేస్తున్నాయి. వీటి చార్జీలు మన ట్రేడింగ్ స్ట్రాటజీని బట్టి మారుతూ ఉంటాయి. వేల నుంచి లక్షల వరకూ వీటి చార్జీలు ఉంటాయి. అయితే ఈ సంకేతిక విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలని మాత్రం నిపుణులు సూచిస్తున్నారు.
Leave a Reply