How to Check EPF balance..? పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి..?
how to check EPF balance
పీపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉద్యోగులు చాలా సార్లు ప్రయత్నస్తుంటారు. కానీ తెలుసుకోవడంలో మాత్రం విఫలం అవుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న సాంకేతిక కాలంలో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఓ సారి అవేంటో చూద్దాం.
వివిధ మార్గాల ద్వారా మన పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఉద్యోగుల భవిష్య నిధి పీఎఫ్ డిపాజిట్లపై 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.10 శాతం వడ్డీ వస్తోంది. ఇది 40 ఏళ్ళ కనిష్ఠం. 2020-21, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో 8.50 శాతం వడ్డీ లభించగా, అంతకుముందు సంవత్సరంలో 8.65 శాతం వడ్డీ జమ అయ్యింది. ఉద్యోగులు ప్రతి నెలా తమ జీతంలో 12 శాతం మొత్తాన్ని పీఎఫ్ లో జమ చేయాలి. సంస్థ కూడా అంతే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో వేస్తుంది. ఉద్యోగులు కావాలంటే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా 100 శాతం వరకు కూడా డిపాజిట్ చేసే వెసులుబాటు ఉంది. పీపీఎఫ్ డిపాజిట్లకు కూడా ఈపీఎఫ్ వడ్డీరేటే వర్తిస్తుంది. పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాదారుల వివిధ మార్గాల ద్వారా ఖాతా బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు.
what is EPF website
ఈపీఎఫ్ వెబ్‌సైట్‌లో..
పీఎఫ్ సభ్యత్వం ఉన్న వ్యక్తులు www.epfindia.gov.in వెబ్ సైట్ కి వెళ్లి బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
అందులో` సర్వీసెస్’ ట్యాబ్ డ్రాప్ డౌన్ మెనూలో అందుబాటులో ఉండే `ఫర్ ఎంప్లాయీస్’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది. కింది భాగంలో ఉన్న`సర్వీసెస్’ లో `మెంబర్ పాస్ బుక్’ పై క్లిక్ చేస్తే మరో పేజీ వస్తుంది. ఇక్కడ యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి కింద ఇచ్చిన సమస్యను పరిష్కరించి దాని సమధానం పక్కన ఉన్న బాక్సులో టైప్ చేసి లాగిన్ పై క్లిక్ చేయడం ద్వారా ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.
what is UMANG app
ఉమాంగ్ యాప్‌లోనూ..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉమాంగ్ యాప్ ద్వారా మన పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు. దానికోసం ఉమంగ్ యాప్ లో `ఈపీఎఫ్ఓ’ ను ఎంచుకోవాలి. అందులో `ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్’ విభాగంలోకి వెళ్లి `వ్యూ పాస్ బుక్’ పై క్లిక్ చేయాలి. అప్పుడు మన యూఏఎన్ నంబర్ తో పాటు మన మొబైల్ నంబర్ కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ ను పొందవచ్చు. అయితే పీఎఫ్ ఖాతాలో మొబైల్ నంబర్ ముందే జత చేసి చూడాలి.
* ఈపీఎఫ్ఓతో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నుంచి 011-22901406 నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
* యూఏఎన్ యక్టివేట్ చేసుకున్న వారు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి EPFOHO UAN అని టైప్ చేసి 77382 99899 నంబర్ కి ఎస్ఎంఎస్ పంపించాలి. వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ మెసేజ్ వస్తుంది.
* యూనిఫైడ్ పోర్టల్ కి నేరుగా లాగిన్ అయ్యి కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. యూనిఫైడ్ పోర్టల్ పేజీలో మన యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్, క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి సైనిన్ చేయాలి. పాస్ బుక్ ఓపెన్ చేసి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ వివరాలను తెలుసుకోవచ్చు.
Nice jogi
Thank you