what are the benefits of stock split
సాధారణంగా మనం ఒక స్టాక్ కొనాలంటే ముందు ఆ షేర్ ధర ఎంత ఉందో చూస్తాం. తక్కువ ధరలో ఉంటే కొనేందుకు ఆసక్తి చూపిస్తాం. కానీ ఆ కంపెనీ మార్కెట్ విలువ ఎంత, లాభాల్లో ఉందా లేదా అని కూడా ఆలోచించం. అంటే షేర్ ప్రైస్ అనుకూలంగా ఉంటేనే ఇన్వెస్టర్లు కొనేందుకు మొగ్గు చూపుతారు. ఈ కారణాన్నే ప్రధానంగా చేసుకుని కొన్ని కంపెనీలు స్టాక్ స్ప్లిట్ చేస్తాయి.
ఒక కంపెనీ తన షేర్లను ఒక్కో షేర్‌ను ముక్కలుగా చేయడాన్ని స్టాక్ స్ల్పిట్ అంటారు. అంటే స్టాక్స్ ని విభజించడం అని అర్థం. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో తన షేర్ల సంఖ్యను పెంచాలనుకున్న, అలాగే తన షేర్ ప్రైస్ ని కుదించుకోవాలనుకున్న తన స్టాక్స్ ను స్ప్లిట్ చేస్తుంది.
ఈ విధానంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏమీ మారదు. అంటే విభజించిన తర్వాత కూడామొత్తం షేర్ల విలువ ఒకే విధంగా ఉంటుంది. కేవలం షేర్ల సంఖ్య మాత్రం పెరుగుతుంది.
సాధారణంగా ఈ స్టాక్స్ స్ప్లిట్ అనేది ఒక కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ కలిపి షేర్ ను ఎంత ధరకు ఎంత నిష్పత్తిలో స్ప్లిట్ చేయాలి అనే నిర్ణయిస్తారు.
stock split will encourage the small investors
చిన్న మదుపరుల కోసం..
స్టాక్స్ ను స్ప్లిట్ చేయడానికి మరొక కారణం ఏమిటంటే కంపెనీ తమ షేర్లను చిన్న, చిన్న పెట్టుబడిదారులు కూడా కొనడానికి వీలుగా ఉండడానికి, అలాగే లక్విడిటీ పెంచడానికి ఈ పద్ధతిని ఎంచుకుంటాయి. తక్కువ షేర్ ధర స్టాక్ ను మరింత లిక్విడ్ చేస్తుంది. మనకి కొనడానికి అమ్మడానికి సులభంగా ఉంటుంది. ఏదైనా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ షేర్ ను స్ప్లిట్ చేయడానికి నిర్ణయిస్తే వెంటనే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు.