is crypto investments are safe
క్రిప్టో కరెన్సీకి ఇప్పడు విపరీతంగా క్రేజ్ పెరుగుతోంది. ఎంతలా అంటే డైలీ న్యూస్ పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్ వేసేంత. జనాలను మరింతగా ఆకట్టుకునేందుకు క్రిప్టో లావాదేవీలు నిర్వహించే కంపెనీలు ఇలాంటి ఎన్నో జిమ్మిక్కులు చేస్తున్నాయి. అయితే ఇందులో పెట్టుబడులు పెట్టే ముందు ఏఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలో ఓ సారి చూద్దాం.
క్రిప్టో కరెన్సీ అంటే ఒక డిజిటల్ కరెన్సీ. క్రిప్టో కరెన్సీ వేగంగా పెరుగుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా 2021 సంవత్సరంలో దేశంలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా పెరిగింది. 2022 లో విడుదలైన ఓ నివేదిక ప్రకారం దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫైనాన్షియల్ యాప్స్ డౌన్ లోడ్ ఏకంగా 100 కోట్లు దాటాయి. వాటిలో క్రిప్టో కరెన్సీ యాప్స్ ఉండడం విశేషం. మనదేశంలో కోటి నుంచి 2.5 కోట్ల మంది క్రిప్టో కరెన్సీ లావాదేవీలు నిర్వహిస్తున్నారని వివిధ లెక్కలు చెబుతున్నాయి.
how many types of cryptos are there
పదివేల రకాల క్రిప్టోలు
క్రిప్టో కరెన్సీ అనగానే ముందుగా మనకు వినిపించేది. బిట్ కాయిన్స్. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10,000 కు పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నట్లు అంచనా . 10,000కు పైగా ఉన్న క్రిప్టో కరెన్సీలు అన్నింటికి మార్కెట్ ఉంటుందా లేదా అనే విషయం ముందుగా తెలుసుకోవాలి. కేవలం కొనేటపుడు కాకుండా అమ్మినపుడు కూడా వాటికి ఎంత డిమాండ్ ఉంటుందో బాగా పరిశీలించాలి. ఉన్నవాటిలో టాప్ 5 బెస్ట్ క్రిప్టోలను మాత్రమే మనం తీసుకోవాలి. మనం తీసుకునే కాయిన్ కి లిక్విడిటీ ఉండాలి.
రూ.100 పెట్టుబడి పెట్టడం సాధ్యమేనా ?
రూ.100 పెట్టుబడి పెట్టవచ్చు అనే ప్రకటనలు మనల్నీ తొందరగా ఆకర్షిస్తాయి. 2022, మార్చి 23 మధ్యాహ్నం సమయంలో బిట్ కాయిన్ విలువ రూ.33లక్షలు మన దేశంలో ఉంది.
చిన్న ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీ మార్కెట్లో పెట్టుబడి పెట్టడంవల్ల అద్భు తాలు జరిగిపోతాయనే ఆశ పడడం సరి కాదు. అయితే చిన్న ఇన్వెస్టర్లకు రిస్క్ ఎంత తక్కువగా ఉంటుందో అలాగే పెద్ద ఇన్వెస్టర్లకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మనం రూ .100 తో లేదా రూ.1000తో ఇన్వెస్ట్ చేసినా దీని గురించి మనకు అవగాహన ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలి.
dont trust adds on crypto currency
యాడ్స్ చూసి మోసపోవద్దు..
మనం ఇప్పటివరకు చూసిన చాలా క్రిప్టో కరెన్సీ ప్రకటనలు లాభాలను మాత్రమే చూపిస్తున్నాయి. కానీ రిస్క్ తో కూడినవని, నష్టాలు కూడా వచ్చాయని ఏ సంస్థ కూడా మనకు చెప్పదు.
ఏప్రిల్ 1 నుంచి వచ్చే ప్రతి ప్రకటనను క్రిప్టో లావాదేవీలను భారత్ లో రెగ్యులేట్ చెయ్యలేదని, అత్యంత ప్రమాదంతో కూడిన వ్యవహారమని డిస్ క్లైమర్ ఇచ్చి తీరాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రకటనలు ఇచ్చిన కంపెనీని అవసరమైతే సంప్రదించడానికి వీలుగా ఈ మెయిల్ అడ్రస్ గాని లేదా మొబైల్ నంబర్ గాని ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వివరాలు ఇచ్చిన కంపెనీలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. తీరాలి. ప్రకటనలు చూసి మోసపోవద్దు.
* ఈ ఆర్థిక సంవత్సరం లావాదేవీల నుంచి వర్చువల్ అసెట్స్ లావాదేవీలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 1 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.
దీనిని జీఎస్ టీ పరిధిలోకి తెచ్చే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.
అవును జోగి.. యాడ్స్ లో ఒక రోజు సమోసా తినకుంటే చాలు అని ఇస్తున్నారు.. ఆ 100 తో పెట్టుబడి పెట్టండి అంటున్నారు