అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో బంగారం, వెండి ధరలు (prices fall) శుక్రవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గత కొంతకాలంగా రాకెట్ వేగంతో దూసుకెళ్లిన ఈ విలువైన లోహాల ధరలు ఒక్కరోజులోనే భారీగా క్షీణించాయి. అమెరికా డాలర్ బలపడటం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, మదుపర్ల లాభాల స్వీకరణే ధరల తగ్గుదలకు కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అధిక ధరల ప్రభావంతో గతేడాది భారత్‌లో బంగారం కొనుగోళ్లు తగ్గాయని ప్రపంచ స్వర్ణమండలి వెల్లడించింది. ఈ ఏడాదీ బంగారం దిగుమతులు తగ్గే అవకాశముందని ఆ నివేదిక పేర్కొంది.
బంగారం ధర తగ్గుదల..Fall in Gold Prices
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,74,700గా నమోదైంది. గురువారం రాత్రి రూ.1,79,700గా ఉన్న ధరతో పోలిస్తే దాదాపు రూ.5 వేల మేర తగ్గడం గమనార్హం. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరుగుతోంది.
వెండి ధరలో భారీ పతనం.. Sharp Fall in Silver Prices
వెండి ధరలో అయితే మరింత భారీ పతనం (prices fall) చోటుచేసుకుంది. నిన్న రాత్రి హైదరాబాద్ విపణిలో రూ.3,99,600 వద్ద ఉన్న వెండి ధర శుక్రవారం ఉదయానికి రూ.3,70,000కు పడిపోయింది. అంటే ఒక్కరోజులోనే దాదాపు రూ.30 వేల మేర తగ్గింది. ఇటీవలి కాలంలో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం .. Impact of International Markets
అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు (prices fall)తగ్గుముఖం పట్టాయి. ఔన్సు బంగారం ధర 5,189 డాలర్లకు, ఔన్సు వెండి ధర 110 డాలర్లకు చేరింది. అమెరికా డాలర్ విలువ క్రమంగా బలపడటం కూడా ఈ లోహాలపై ఒత్తిడిని పెంచినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఫ్యూచర్స్ మార్కెట్‌లోనూ తగ్గుదల.. Decline in the Futures Market
ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లోనూ ధరలు (prices fall)భారీగా పడిపోయాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి డెలివరీకి వెండి ఫ్యూచర్స్ ధర శుక్రవారం రూ.12,169 తగ్గి రూ.3,87,724గా నమోదైంది. గురువారం ఒక దశలో వెండి ధర రూ.4.20 లక్షల జీవనకాల గరిష్ఠాన్ని తాకి చివరకు రూ.3,99,893 వద్ద ముగిసింది. అలాగే ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కు సంబంధించిన బంగారం ఫ్యూచర్స్ ధర రూ.2,162 తగ్గి 10 గ్రాములకు రూ.1,67,241గా ట్రేడైంది.
