భారత సోలార్ కంపెనీల మాడ్యూళ్లు, సెల్స్‌పై అమెరికా 126 శాతం కౌంటర్ వెయిలింగ్ సుంకం విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో, దేశీయ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా కుంగిపోయింది ( Shock on Indian Solar Stocks ). మొదట లాభాల దిశగా సాగిన సూచీలు, మధ్యాహ్నానికి వచ్చేసరికి అమ్మకాల తాకిడికి తట్టుకోలేకపోయాయి. చివరకు BSE Sensex 50.15 పాయింట్ల లాభంతో 82,276.07 వద్ద, Nifty 50 57.85 పాయింట్ల లాభంతో 25,482.5 వద్ద ముగిసినా, డే హై నుంచి సెన్సెక్స్ దాదాపు 674 పాయింట్లు వెనక్కి వచ్చేసింది. ఈ సంఖ్యల వెనుక దాగి ఉన్న అసలు కథ మాత్రం చాలా లోతైనది. సోలార్ షేర్లపై పడిన ఈ పిడుగుపాటు తాత్కాలికమా, దీర్ఘకాలికమా అన్నది కాలమే తేల్చాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం … గ్లోబల్ ఆర్థిక యుద్ధాల్లో, టారిఫ్‌ల తూటాలు ఎప్పుడూ మదుపరుల గుండెలనే ముందుగా తాకుతాయి.
మార్కెట్ ఎందుకు కుదేలైంది? Why the Market Trembled ?
భారత్ నుంచి అమెరికాకు వెళ్లే సౌర విద్యుత్ ఉత్పత్తులపై 125.87 శాతం ప్రాథమిక కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ (CVD) విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. భారత ప్రభుత్వం ఈ రంగానికి “సహేతుకం కాని” సబ్సిడీలు ఇస్తోందని, దాంతో భారత కంపెనీలు తక్కువ ధరలకే ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాయన్నది అమెరికా వాదన. ఈ సుంకాలు 2026 జులై 6 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇది విన్న వెంటనే సోలార్ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. ఐదు నుంచి 14 శాతం వరకు పలు కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఉదయం వరకూ లాభాల్ని ఆస్వాదించిన మదుపరులు, మధ్యాహ్నానికి రిస్క్ తగ్గించుకునే ప్రయత్నంలో షేర్లు విక్రయించడంతో మార్కెట్ ఊపిరాడకుండా మారింది.
సీవీడీ అంటే ఏమిటి? Countervailing Duty Explained ?
ఏ దేశంలో అయితే ప్రభుత్వ సబ్సిడీలు లభిస్తే, ఆ దేశ కంపెనీలు ఉత్పత్తులను తక్కువ ధరలకు ఎగుమతి చేయగలుగుతాయి. ఫలితంగా దిగుమతి చేసుకునే దేశంలోని స్థానిక కంపెనీల ఉత్పత్తులు పోటీలో నిలవలేక నష్టపోతాయి. అటువంటి పరిస్థితుల్లో తమ పరిశ్రమలను రక్షించుకోవడానికి దిగుమతి దేశాలు కౌంటర్‌వెయిలింగ్ సుంకాలను విధిస్తుంటాయి. ఇప్పుడు భారత సౌర ఉత్పత్తుల ( Shock on Indian Solar Stocks )విషయంలో అమెరికా అదే మార్గాన్ని ఎంచుకుంది.
సౌర బూమ్ నుంచి షాక్ వరకు.. Solar Boom to Solar Shock
ఇటీవలి సంవత్సరాల్లో భారత్ సౌర రంగంలో భారీ పురోగతి సాధించింది. దేశీయ తయారీకి ప్రోత్సాహం, దిగుమతులపై నియంత్రణ, పీఎల్‌ఐ పథకం వంటి చర్యలతో భారత కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలోనూ పట్టు సాధించాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో భారత మాడ్యూళ్లు, సెల్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. 2022లో కేవలం 83.86 మిలియన్ డాలర్లుగా ఉన్న భారత సౌర ఎగుమతులు, 2024 నాటికి 792.6 మిలియన్ డాలర్లకు ఎగబాకాయి. ఈ వేగవంతమైన వృద్ధే ఇప్పుడు అమెరికా నిర్ణయానికి ( Shock on Indian Solar Stocks ) నేపథ్యంగా మారింది.
ఏఐ భయం, ఐటీ షేర్ల పతనం.. IT Stocks Under AI Shadow
సోలార్ షేర్ల షాక్‌తో( Shock on Indian Solar Stocks ) పాటు మరో భయం మార్కెట్‌ను వెంటాడుతోంది. ఏఐ ప్రభావంతో ఐటీ కంపెనీల భవిష్యత్‌పై అనిశ్చితి పెరుగుతోంది. ఈ నెలలోనే నిఫ్టీ ఐటీ సూచీ 21 శాతం వరకు క్షీణించడం గత 23 ఏళ్లలో లేనిది. దీనివల్ల ఐటీ షేర్లలో పెట్టుబడి పెట్టిన పెద్ద సంస్థలకూ భారీ దెబ్బ తగిలింది. Life Insurance Corporation of India సుమారు రూ.38,000 కోట్ల నష్టాన్ని, మ్యూచువల్ ఫండ్స్ దాదాపు రూ.63,000 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఈ పతనానికి మరో కారణంగా ఏఐ స్టార్టప్‌ల వేగవంతమైన ఎదుగుదల నిలుస్తోంది. ముఖ్యంగా Anthropic వంటి సంస్థల మార్కెట్ క్యాప్ 38,000 కోట్ల డాలర్లకు చేరడం, భారత ఐటీ దిగ్గజాల విలువను మించి ఉండడం మదుపరుల్లో భయాన్ని రెచ్చగొడుతోంది. గత 15 రోజుల కరెక్షన్‌లో భారత ఐటీ దిగ్గజాలైన Tata Consultancy Services, Infosys, HCL Technologies, Wipro, Tech Mahindra షేర్లు 17 నుంచి 27 శాతం వరకు పడిపోయాయి. ప్రస్తుతం ఈ ఐదు కంపెనీల కలిపి మార్కెట్ క్యాప్ సుమారు 24,100 కోట్ల డాలర్లకే పరిమితమైంది. ఒకప్పుడు గ్లోబల్ ఐటీ రంగంలో భారత ఆధిపత్యానికి చిహ్నాలైన ఈ సంస్థలు, ఇప్పుడు ఏఐ కంపెనీల ఎదుట చిన్నబోతున్నాయన్న భావన మార్కెట్‌లో బలపడుతోంది.
ప్రభావం పరిమితమే అంటున్న కంపెనీలు.. Companies Say “Limited Impact”
సుంకాల ప్రభావం అంత తీవ్రంగా ఉండదని కొన్ని సోలార్ కంపెనీలు( Shock on Indian Solar Stocks ) చెబుతున్నాయి. విక్రమ్ సోలార్ మాటల్లో, భారత్‌లో తయారైన సెల్స్‌పై అమెరికా సుంకాలు వర్తించినా, అమెరికాకు పంపే ఆర్డర్లలో భారత సెల్స్‌ను ఉపయోగించడం లేదని, తక్కువ టారిఫ్‌లున్న ఇతర దేశాల నుంచి వాటిని సమకూర్చుకుంటున్నామని అంటోంది. వారీ ఎనర్జీస్ కూడా గతంలో 50 శాతం సుంకాలున్నప్పటికీ డెలివరీలు కొనసాగించామని, తాజా నిర్ణయంతో పెద్దగా ఇబ్బంది ఉండబోదని చెబుతోంది. ప్రీమియర్ ఎనర్జీస్ అయితే తాము అమెరికాకు ఎగుమతులు చేయడం లేదని, అందువల్ల ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.
95 శాతం అమెరికాకే.. 95% Exports Head to the US
2023 ఏప్రిల్ నుంచి 2025 నవంబరు మధ్య భారత్ నుంచి అమెరికాకు రూ.34,000 కోట్ల విలువైన సోలార్ సెల్స్, మాడ్యూళ్లు ఎగుమతి అయ్యాయి. గత మూడు త్రైమాసికాల్లో భారత సౌర ఎగుమతుల్లో 95 శాతానికి పైగా అమెరికాకే వెళ్లాయి. తాజా సుంకాల వల్ల అమెరికాలో తయారయ్యే మాడ్యూళ్లతో పోలిస్తే, భారత ఉత్పత్తులు కనీసం 30 శాతం ఖరీదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తున్న భారత కంపెనీలకు ఇది పెద్ద సవాలుగా( Shock on Indian Solar Stocks ) మారనుంది.
చైనాను కట్టడి చేసే ప్రయత్నమా? Is This an Attempt to Curb China?
( Shock on Indian Solar Stocks )ఈ పరిణామానికి మరో కోణమూ ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు, ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం చూస్తున్నాయి. భారత్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని వేగంగా ఎదిగింది. రూఫ్‌టాప్ సోలార్, పీఎం-కుసుమ్, సీపీఎస్‌యూ స్కీమ్ ఫేజ్-2 వంటి పథకాలతో దేశీయ తయారీకి ప్రోత్సాహం ఇచ్చింది. ఫలితంగా చైనా నుంచి దిగుమతులు తగ్గాయి. అయితే ఇప్పుడు అమెరికా సుంకాలు, ఈ గ్లోబల్ సరఫరా గొలుసులో కొత్త అనిశ్చితిని సృష్టిస్తున్నాయి.
ముందున్న దారి.. The Road Ahead
ఈ మొత్తం కథనం ( Shock on Indian Solar Stocks )ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో అవకాశాలు ఎంత వేగంగా వస్తాయో, అంతే వేగంగా సవాళ్లుగా మారుతాయి. సోలార్ రంగంలో భారత పురోగతి ప్రశంసనీయం. కానీ అమెరికా వంటి పెద్ద మార్కెట్లపై అధికంగా ఆధారపడటం ప్రమాదకరం. ఇక ఐటీ రంగంలో ఏఐ విప్లవం కొత్త అవకాశాలు తెచ్చిపెట్టినా, పాత బిజినెస్ మోడళ్లను ప్రశ్నిస్తోంది. ఈ రెండు రంగాల్లోనూ రాబోయే రోజులు “అనుకూలతకు అనుగుణంగా మారే సామర్థ్యం”నే విజయానికి కీలకంగా మారనుంది.
