what is tax benefit with section 80ccf
ఉదాహరణకు మనకు వార్షిక ఆదాయం రూ.5.50లక్షలు. ఆదాయపు చట్టాల నియమాల ప్రకారం రూ.2.50 లక్షలకు మించిన ఆదాయం పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే మనం రూ. 3 లక్షలకు పన్ను చెల్లించాలి. పన్ను భారాన్ని తగ్గించేందుకు సెక్షన్ 80 సీ కింద మినహాయింపు అందించే వివిధ పథకాల్లో రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టారు. ఇంకా పన్ను వర్తించే ఆదాయం రూ.1.50 లక్షలు ఉంది. ఇప్పుడు మరింత పన్ను మినహాయింపు పొందేందుకు ఉన్న మరో అవకాశం సెక్షన్ 80 సీసీఎఫ్. బ్యాంకులు అందించే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాండ్లలో రూ.40 వేలు పెట్టుబడి పెడితే సెక్షన్ 80 సీసీఎఫ్ ప్రకారం మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనిద్వారా గరిష్ఠంగా రూ. 20 వేల వరకు మినహాయింపు పొందవచ్చు.
మౌలిక సదుపాయాలతోనే దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్దికి లక్షల కోట్లు అవసరం. ప్రభుత్వానికి పన్నుల రపంలో నిధులు వస్తున్నా ఇంకా చాలా అవసరం ఉంటుంది. దీనికోసం నిదులను సమకూర్చేందుకు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను విడుదల చేస్తుంది. ఎక్కువ పెట్టుబడుడారులను ఆకర్షించేందుకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీసీఎఫ్ ను జోడించి ప్రోత్సకాలను అందిస్తుంది. ఆ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొంత వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ప్రయోజనం కలుగజేస్తుంది.
ట్యాక్స్ బాధితుల కోసమే..
additional benefit with section 80c
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం మనకు వచ్చే రూ.1.50 లక్షల మినహాయింపునకు అదనంగా 80 సీసీఎఫ్ ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. నిర్దిష్ట పథకాల్లో పెట్టుబడి పెట్టినవాళ్ళకు మాత్రమే ఈ సెక్షన్ కింద మినహాయింపు వర్తిస్తుంది. దీన్ని 2010లో రూపొందించగా 2011లో అమల్లోకి వచ్చింది. ఈ సెక్షన్ కింద ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇతర బాండ్లలో పెట్టిన పెట్టుబడులపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
మన జాతీయులకే..
section 80ccf only for indians
మన దేశంలో నివసించేవారికి మాత్రమే సెక్షన్ 80 సీసీఎఫ్ కింద లభించే మినహాయింపునకు అర్హులు.
ఎన్ఆర్ఐలకు విదేశీయులకు ఈ మినహాయింపు వర్తించదు. సంస్థలు, సంఘాలకు వర్తించదు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులతో పాటు హిందూ అవిబాజ్య కుటుంబాల వారు ఈ సెక్షన్ 80 సీసీఎఫ్ కింద లభించే మినహాయింపునకు అర్హులు. సెక్షన్ 80 సీసీఎఫ్ కింద ఒక వేళ ఉమ్మడి పెట్టుబడులు చేస్తే పన్ను ప్రయోజనాలు ఒక్కరికే లభిస్తాయి. మొదటి పెట్టుబడిపెట్టినవారు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. హిందూ అవిబాజ్య కుటుంబాల్లో కూడా ఒక సభ్యుడుకి మాత్రమే వర్తిస్తుంది.
* ప్రభుత్వ అనుమతితో బ్యాంకులు, కార్పొరేషన్లు జారీ చేసే పన్ను ఆదా బాండ్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాండ్లలో పెట్టిన పెట్టుబడులకు మాత్రమే సెక్షన్ 80 సీసీఎఫ్ కింద లభించే మినహాయింపు వర్తిస్తుంది.
సెక్షన్ 80 సీసీఎఫ్ కింద గరిష్ఠంగా రూ.20 వేల వరకు మినహాయింపు పొందవచ్చు. ఇంతకు మించి చేసిన పెట్టుబడులపై మినహాయింపు పొందే వీలుండదు.
* పన్ను ఆదా బాండ్లలో వచ్చే వడ్డీ ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. కాబట్టి వడ్డీ ఆదాయం పై పన్ను చెల్లించాలి. ఈ విధమైన బాండ్లు దీర్ఘకాల పరిమితులతో వస్తాయి. వీటి కాలపరిమితి 5 ఏళ్ళకు పైబడి ఉంటుంది. అది పూర్తయిన తర్వాత అమ్మడానికి వీలుంటుంది.