పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచే సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం అన్న విషయాన్ని ప్రతి తల్లిదండ్రి ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న విద్య ఖర్చులు, ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులు, విదేశీ విద్య వ్యయాలు చూసినప్పుడు సాధారణ పొదుపులు సరిపోవని చాలామందికి అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడులు, కంపౌండింగ్ ప్రయోజనాలు కలిగిన పథకాలపై తల్లిదండ్రుల దృష్టి కేంద్రీకృతమవుతోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన NPS వాత్సల్య (NPS Vatsalya) పథకం పిల్లల భవిష్యత్తు కోసం ఒక కొత్త మార్గంగా చర్చకు వచ్చింది. అయితే ఈ పథకం నిజంగా పిల్లల చదువు కోసం సరైన ఎంపికేనా? లేక దీన్ని కేవలం పొదుపు–పెన్షన్ దృష్టితోనే చూడాలా? అనే ప్రశ్నలు ఇప్పుడు తల్లిదండ్రుల్లో తలెత్తుతున్నాయి.
ఏమిటి NPS వాత్సల్య? What is NPS Vatsalya?
NPS వాత్సల్య (NPS Vatsalya) అనేది 2024లో PFRDA (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకం. ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పరిధిలోనే పనిచేస్తుంది. ఈ పథకంలో చిన్న పిల్లల పేరున ఖాతా తెరవచ్చు. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ ఈ ఖాతాను నిర్వహిస్తారు. పిల్లలు 18 ఏళ్లు పూర్తిచేసిన తర్వాత ఈ ఖాతా ఆటోమేటిక్‌గా అతడి పేరున ఉన్న NPS Tier-I ఖాతాగా మారుతుంది. చిన్న వయసులోనే పొదుపు అలవాటు పెంపొందించడం, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కల్పించడం, రిటైర్మెంట్ అవసరాలకు బలమైన పునాది వేయడం.. ఈ పథకంలోని ప్రధాన ఉద్దేశం.
విద్య నిధిగా ఉపయోగించవచ్చా? Can It Be Used as an Education Fund?
NPS వాత్సల్య (NPS Vatsalya) అనేది ప్రధానంగా పెన్షన్ ఆధారిత పొదుపు పథకం. అయినప్పటికీ చాలామంది తల్లిదండ్రులు దీన్ని పిల్లల చదువు ఖర్చులకు ఉపయోగించవచ్చా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల Exit, Withdrawal నిబంధనల్లో మార్పులు చేసింది. మొత్తం నిధిలో 80 శాతం వరకు లంప్సమ్గా తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన 20 శాతం తప్పనిసరిగా అన్యూటీ(నెలవారీ పెన్షన్)గా మార్చాలి. అంటే ఆ 20 శాతం మొత్తాన్ని నెలవారీ పెన్షన్ రూపంలో మాత్రమే పొందగలరు.
ప్రధాన లోపం..Main Drawback…
(NPS Vatsalya) పిల్లల ఉన్నత విద్య సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు ఒక్కసారిగా అవసరం అవుతుంది. ఇంజినీరింగ్, మెడిసిన్, విదేశీ విద్య వంటి సందర్భాల్లో లక్షల నుంచి కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అలాంటి సమయంలో మొత్తం నిధిని లంప్సమ్గా తీసుకునే వెసులుబాటు లేకపోవడం ఒక ప్రధాన లోపంగా నిపుణులు చెబుతున్నారు. 20 శాతం మొత్తాన్ని తప్పనిసరిగా అన్యూటీగా మార్చాల్సిన నిబంధన వల్ల చదువు సమయంలో అవసరమైన మొత్తం అందుబాటులోకి రాదు. పెన్షన్ అవసరం లేని వయసులోనే అన్యూటీ వర్తిస్తుంది. ఇది పథకాన్ని ఉపయోగించడంలో ప్రధాన అడ్డంకిగా మారుతోంది.
పన్ను విషయంలో స్పష్టత ఎంత? How Clear Is the Tax Treatment?
(NPS Vatsalya) పన్నుల అంశంలో కూడా పూర్తిస్థాయి స్పష్టత లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. లంప్సమ్గా తీసుకునే మొత్తంలో 60 శాతం వరకు పన్ను మినహాయింపు స్పష్టంగా ఉంది. మిగిలిన మొత్తంపై పన్ను విధింపు ఎలా ఉంటుందనే అంశంపై ఇంకా పూర్తి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఈ అస్పష్టత తల్లిదండ్రులను ఆలోచనలో పడేస్తోంది.
Partial Withdrawal పరిమితులు..Partial Withdrawal Limits
NPS వాత్సల్యలో (NPS Vatsalya) పాక్షిక ఉపసంహరణ (Partial Withdrawal) కు కూడా కఠినమైన పరిమితులు ఉన్నాయి. పిల్లలు 18 ఏళ్లకు చేరుకునేలోపు రెండు సార్లు మాత్రమే Withdrawal తీసుకోవచ్చు. 18 నుంచి 21 ఏళ్ల మధ్య మరో రెండు సార్లు మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. ప్రతి సారి మొత్తం పెట్టుబడిలో గరిష్టంగా 25 శాతం వరకు మాత్రమే Withdrawal తీసుకోవచ్చు. పెరుగుతున్న విద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే, ఈ పరిమిత ఉపసంహరణలు సరిపోవని నిపుణుల అభిప్రాయం.
ప్రయోజనాలు ఏమిటంటే? Key Benefits
(NPS Vatsalya) లోపాలు ఉన్నప్పటికీ, ఈ పథకానికి కొన్ని బలమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో పథకాన్ని ప్రారంభించొచ్చు. సంవత్సరానికి కేవలం రూ.250తో కూడా ఖాతా ప్రారంభించవచ్చు. తల్లిదండ్రులతో పాటు తాతలు, బంధువులు కూడా ఈ ఖాతాలో డబ్బు జమ చేయవచ్చు. ఈక్విటీ, డెట్ మిశ్రమ పెట్టుబడుల వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది.
ఎవరికి సరిపోతుంది? Who Is It Suitable For?
(NPS Vatsalya) పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలిక పొదుపు చేయాలనుకునేవారికి, రిటైర్మెంట్ దృష్టితో ముందే ప్రణాళిక వేసేవారికి ఇతర పెట్టుబడులతో పాటు అదనపు సేవింగ్‌గా చూసేవారికి ఈ పథకం తీసుకోవచ్చు.
ఎవరికి సరిపోదు? Who Is It Not Suitable For?
(NPS Vatsalya) పిల్లల విద్య , ఖర్చుల కోసం పూర్తి స్వేచ్ఛ కావాలనుకునేవారికి, అవసరమైనప్పుడు మొత్తం డబ్బు ఉపసంహరించుకోవాలనుకునేవారికి పన్ను స్పష్టత లేని పథకాలను నివారించాలనుకునేవారికి ఈ పథకం సరిపోదు.
నిపుణుల సూచన ఏమిటి? Experts’ Recommendation
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. “NPS వాత్సల్య (NPS Vatsalya) ను పిల్లల చదువు కోసం ఒకే పథకంగా కాకుండా, అదనపు ఎంపికగా మాత్రమే చూడాలి.
పిల్లల విద్య కోసం మ్యూచువల్ ఫండ్స్, సుకన్య సమృద్ధి, ఇతర ఫ్లెక్సిబుల్ పెట్టుబడులతో పాటు దీనిని కలిపితేనే సరైన సమతుల్యత ఉంటుంది.” NPS వాత్సల్య పిల్లల భవిష్యత్తు కోసం మంచి పొదుపు సాధనం. అయితే దీన్ని పూర్తిగా పిల్లల విద్య నిధిగా ఆధారపడటం సరైన నిర్ణయం కాదు. దీర్ఘకాలిక సేవింగ్, పెన్షన్ దృష్టితో ఇది ఉపయోగపడుతుంది. సరైన ఆర్థిక ప్రణాళికలో భాగంగా, ఇతర ఫ్లెక్సిబుల్ పెట్టుబడులతో కలిపి ఉపయోగిస్తేనే తల్లిదండ్రులకు నిజమైన భద్రత లభిస్తుంది. ఈ పథకాన్ని పిల్లల విద్య నిధిగా మాత్రమే ఆధారపడటం కష్టం. కానీ దీర్ఘకాలిక పొదుపు, పెన్షన్ కోసం అదనపు పథకంగా పరిగణించవచ్చు. విద్య ఖర్చులకు పూర్తి ఫ్లెక్సిబిల్ గణన కావాలంటే మ్యూచువల్ ఫండ్స్, SIPs, ఫ్లెక్సిబుల్ పెట్టుబడులుతో కలిపి ఉపయోగించడం మంచిది.
