Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

త్వరగా రిటైర్మెంట్ అవ్వాల‌నుకుంటున్నారా? అయితే 25x బడ్జెట్ సూత్రం మీకోసమే..! Want to Retire Early? The 25x Budget Rule Is for You!

Posted on 28/12/2025 By admin No Comments on త్వరగా రిటైర్మెంట్ అవ్వాల‌నుకుంటున్నారా? అయితే 25x బడ్జెట్ సూత్రం మీకోసమే..! Want to Retire Early? The 25x Budget Rule Is for You!

ఉద్యోగ జీవితానికి ముందే గుడ్‌బై చెప్పి, ఆర్థిక స్వాతంత్ర్యంతో జీవించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఫైనాన్స్‌ నిపుణులు సూచిస్తున్న సులభమైన, స్పష్టమైన మార్గదర్శి ‘25x సూత్రం ’ (25x Budget Rule). ఉద్యోగ జీవితం ముగించి, ఆర్థిక ఆందోళనలేకుండా ప్రశాంతంగా జీవించాలనుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అలాంటి వారికి ఇప్పుడు ఫైనాన్స్‌ నిపుణులు సూచిస్తున్న సులభమైన మార్గం ‘25x బడ్జెట్ సూత్రం’. అయితే రిటైర్మెంట్‌ తర్వాత మీరు ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందో ముందుగా లెక్కించాలి. ఆ వార్షిక ఖర్చును 25 రెట్లు గుణిస్తే, రిటైర్మెంట్‌కు అవసరమైన మొత్తం వస్తుంది. అదే మీ లక్ష్యంగా పెట్టుకోవాలి. ఉదాహరణకు మీ నెలవారీ ఖర్చు రూ.40 వేలైతే.. సంవత్సరానికి ఖర్చు = రూ.4.8 లక్షలు. దాన్ని 25తో గుణిస్తే = రూ.1.2 కోట్లు అవుతుంది. అంటే, రూ.1.2 కోట్లు ఉంటే, మీరు రిటైర్మెంట్‌ను ఆర్థికంగా భద్రంగా ప్రారంభించవచ్చన్నమాట.

25x సూత్రం అంటే ఇదే…What Exactly Is the 25x Rule?
(25x Budget Rule)ఈ నియమం ప్రకారం రిటైర్మెంట్‌ తర్వాత మీకు ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందో ముందుగా అంచనా వేయాలి. ఆ వార్షిక ఖర్చును 25 రెట్లు గుణిస్తే, ఆర్థిక స్వాతంత్ర్యం (Financial Independence) కోసం అవసరమైన మొత్తం లభిస్తుంది.

ఈ సూత్రం ఎందుకంటే? Why Does This Rule Matter?
25x బడ్జెట్ సూత్రం’ (25x Budget Rule)వ‌ల్ల మీ లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. ఎంత సేవ్ చేయాలో అర్థమవుతుంది. అనవసర ఖర్చులపై నియంత్రణ వస్తుంది. త్వరగా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. కాగా ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్), ఆరోగ్య ఖర్చులు, జీవనశైలి మార్పులను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. పెట్టుబడులు ఎక్కడ పెడుతున్నామన్నదీ కీలకం. ఈక్విటీ, డెట్‌, పెన్షన్‌ ప్లాన్లలో సరైన సమతుల్యం ఉండాలి. యువ వయసులోనే పెట్టుబడులు ప్రారంభిస్తే, చక్రవడ్డీ శక్తితో ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఆలస్యం చేస్తే అవసరమైన మొత్తం మరింత పెరుగుతుంది. ఏదేమైనా త్వరగా రిటైర్మెంట్ కావాలనుకుంటే, ముందుగా ఖర్చులను తెలుసుకోండి. ‘25x బడ్జెట్ సూత్రం’ను అనుసరించి, ఇప్పటినుంచే ఆర్థిక ప్రణాళిక మొదలుపెట్టండి. భవిష్యత్తు ప్రశాంతంగా ఉండాలంటే, ఈరోజే సరైన నిర్ణయం తీసుకోవడం అవసరం.

FIRE కాన్సెప్ట్‌కు పునాది..The Foundation of the FIRE Concept
(25x Budget Rule)‘ఫైనాన్షియల్‌ ఇండిపెండెన్స్ – రిటైర్‌ ఎర్లీ’ (FIRE) అనే భావనకు ఈ 25x సూత్రం పునాదిగా నిలుస్తోంది. ముఖ్యంగా యువతలో ఇది వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. తక్కువ వయసులోనే సేవింగ్స్‌, ఇన్వెస్ట్‌మెంట్లపై దృష్టి పెడితే, త్వరగా రిటైర్మెంట్‌ సాధ్యమవుతుందన్న అవగాహన పెరుగుతోంది. సాధారణ సేవింగ్స్‌తో ఈ లక్ష్యం సాధ్యం కాదు. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు, పీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, ఇతర దీర్ఘకాలిక పెట్టుబడుల్లో సరైన ప్రణాళికతో పెట్టుబడి పెడితేనే లక్ష్యానికి చేరుకోవచ్చు.

భిన్నంగా ఆలోచిస్తున్న‌ జెన్‌–జీ యువత ..Gen Z Thinking Differently
సాధారణంగా 60 ఏళ్లు దాటాక రిటైర్మెంట్‌ తీసుకోవడమే మనకు అలవాటైన పద్ధతి. కానీ నేటి తరం, ముఖ్యంగా జెన్‌–జీ యువత మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా ఆలోచిస్తోంది. ఉద్యోగ ఒత్తిడి లేకుండా, నచ్చినట్లు జీవించాలనే లక్ష్యంతో ముందే రిటైర్మెంట్‌ వైపు అడుగులు వేస్తోంది. ఈ భావనకే ‘ఫైర్‌’ (FIRE – Financial Independence, Retire Early) అని పేరు. FIRE లక్ష్యాన్ని చేరుకోవడానికి పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణులు సూచిస్తున్న అత్యంత సరళమైన మార్గం ‘25x సూత్రం’(25x Budget Rule). ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు, పీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయి.

‘4 శాతం విత్‌డ్రాయల్ రూల్’ అంటే ఏమిటి? What Is the 4% Withdrawal Rule?
(25x Budget Rule)సాధారణంగా పెట్టుబడులపై వచ్చే ఆదాయం, ద్రవ్యోల్బణాన్ని మించిన స్థాయిలో ఉంటే, ఆ నిధిని పూర్తిగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంతోనే రోజువారీ ఖర్చులు నిర్వహించవచ్చన్న అంచనాతోనే ఈ 25x సూత్రం రూపొందింది. ఈ సూత్రం వెనుక ఉన్న అసలు లెక్క ఏమిటన్న ప్రశ్నకు సమాధానం ‘4 శాతం విత్‌డ్రాయల్ రూల్’. రిటైర్మెంట్‌ ప్రణాళికలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే ఈ నియమంపైనే 25x సూత్రం (25x Budget Rule)ఆధారపడి ఉంటుంది. 4 శాతం విత్‌డ్రాయల్ రూల్ అంటే…మీరు రిటైర్మెంట్‌ కోసం పోగు చేసిన మొత్తం నిధి (కార్పస్‌) నుంచి ఏటా కేవలం 4 శాతం మాత్రమే ఖర్చులకు వాడుకోవాలి. అలా చేస్తే, మిగిలిన సొమ్ము పెట్టుబడుల్లోనే ఉండి వృద్ధి చెందుతూ మీ జీవితాంతం ఆర్థిక భద్రతను అందిస్తుందన్నది ఈ సూత్రం భావం. ఉదాహరణకు మీ వార్షిక ఖర్చు రూ.8 లక్షలైతే.. రూ.8 లక్షలు × 25 = రూ.2 కోట్లు. ఈ కార్పస్‌ నుంచి ఏటా 4 శాతం అంటే రూ.8 లక్షలు ఖర్చులకు వాడుకోవచ్చు. మిగిలిన సొమ్ము పెట్టుబడుల ద్వారా పెరుగుతూ ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులు వచ్చేలా పెట్టుబడులు సరిగ్గా ఉంటే, తీసుకునే 4 శాతం మొత్తం తిరిగి సంపాదించబడుతుంది. అందువల్ల అసలు నిధి తగ్గకుండా కొనసాగుతుందన్నది నిపుణుల అభిప్రాయం. అయితే జాగ్రత్తలు తీసుకోవ‌డం అవసరం. మార్కెట్‌ ఒడిదుడుకులు, అధిక వైద్య ఖర్చులు, జీవనశైలి మార్పులు ఈ లెక్కలను ప్రభావితం చేయవచ్చు. అందుకే పెట్టుబడుల్లో సరైన వైవిధ్యం (డైవర్సిఫికేషన్‌) ఉండాలి.

ప్రస్తుత ఖర్చుల ఆధారంగా రిటైర్మెంట్‌ నిధి లెక్క ఇదే… Calculating Retirement Funds Based on Current Expenses

(25x Budget Rule)రిటైర్మెంట్‌ ప్లానింగ్‌లో తొలి అడుగు మీ ప్రస్తుత ఖర్చులను స్పష్టంగా తెలుసుకోవడం. వాటి ఆధారంగానే 25x సూత్రం ప్రకారం ఎంత నిధి అవసరమో సులభంగా లెక్కించవచ్చు. ముందుగా మీ నెలవారీ ఖర్చు సుమారు రూ.66,666 అనుకుందాం. అంటే, వార్షిక ఖర్చు (సంవత్సరానికి) = సుమారు రూ.8 లక్షలు. ఇప్పుడు 25x సూత్రం వర్తింపజేస్తే… రూ.8,00,000 × 25 = రూ.2,00,00,000
అంటే ఉద్యోగం మానేసిన తర్వాత కూడా అదే జీవనశైలి కొనసాగాలంటే సుమారు రూ.2 కోట్ల రిటైర్మెంట్‌ నిధి అవసరం. ఒక‌వేళ‌ఖర్చులు పెరిగితే లెక్క ఎలా మారుతుందంటే.. వార్షిక ఖర్చు రూ.10 లక్షల‌నుకుందాం.. రూ.10,00,000 × 25 = రూ.2.5 కోట్లు అవుతుంది. అంటే, ఖర్చులు పెరిగిన కొద్దీ అవసరమైన కార్పస్‌ కూడా పెరుగుతుంది. ఈ లెక్కలతో మీ రిటైర్మెంట్‌ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత సేవ్‌ చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి అన్నది ముందుగానే అర్థమవుతుంది.

పొదుపున‌కు దిశానిర్దేశం..Guidance for Savings
లక్ష్యం ఖరారైతే, నెలనెలా ఎంత పొదుపు చేయాలి, ఏ పెట్టుబడుల్లో పెట్టాలి అన్న ప్రణాళిక సులభంగా తయారవుతుంది. అర్థం లేని సేవింగ్స్‌ నుంచి లక్ష్యాధారిత పొదుపుకు మారే అవకాశం ఉంటుంది. ముందస్తు రిటైర్మెంట్‌ అనేది పెద్ద నిర్ణయం. 25x సూత్రం (25x Budget Rule) లెక్కలు చేతిలో ఉంటే, ఉద్యోగ మార్పు, బ్రేక్‌ తీసుకోవడం, రిస్క్‌ తీసుకునే పెట్టుబడులు వంటి విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

ఖర్చులపై నియంత్రణ… Controlling Your Expenses…
ముందస్తు రిటైర్మెంట్‌ కలను నిజం చేయడంలో ఆదాయం పెంచడం ఎంత ముఖ్యమో, ఖర్చులను నియంత్రించడం కూడా అంతే అవసరం. ఈ విషయంలో 25x సూత్రం (25x Budget Rule)ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. ఖర్చులు తగ్గితే లక్ష్యం దగ్గరవుతుంది. మీరు మీ వార్షిక ఖర్చులను రూ.2 లక్షలు తగ్గించుకోగలిగితే.. రూ.2 లక్షలు × 25 = రూ.50 లక్షలు అవుతుంది. అంటే, మీరు పోగు చేయాల్సిన రిటైర్మెంట్‌ నిధిలోనే రూ.50 లక్షల భారం తగ్గినట్లే. అనవసర ఖర్చులపై కత్తెర వేసి.. జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవాలి.. అప్పులపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలి. ప్లాన్‌ చేసిన ఖర్చులతో జీవించడం ఉత్త‌మం. యువతకు ఇది మరింత లాభం. యువ వయసులోనే ఖర్చులపై నియంత్రణ అలవాటు చేసుకుంటే, చిన్న తగ్గింపే పెద్ద లాభంగా మారుతుంది. పెట్టుబడులకు ఎక్కువ మొత్తాన్ని మళ్లించే అవకాశం ఉంటుంది. ముందస్తు రిటైర్మెంట్‌ అంటే కేవలం ఎక్కువ సంపాదన కాదు. తెలివిగా ఖర్చులు నియంత్రించడమే అసలు రహస్యం. ఖర్చులు తగ్గితే, రిటైర్మెంట్‌ లక్ష్యం దగ్గరవుతుంది.

ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం..The Need for Financial Independence
ఉద్యోగం అనేది తప్పనిసరి అవసరంలా కాకుండా, మనకు నచ్చిన పని చేయగలిగే స్వేచ్ఛ రావాలంటే ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం. ఆ స్థాయికి చేరుకునే దారిలో 25x సూత్రం కీలకంగా మారుతోంది. 25x సూత్రం(25x Budget Rule) ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. రిటైర్మెంట్‌ తర్వాత మీ వార్షిక ఖర్చులకు 25 రెట్లు సమానమైన నిధి ఉంటే, ఆర్థికంగా భద్రంగా జీవించవచ్చన్నది దీని భావం. అయితే కాలక్రమంలో పరిస్థితులు మారుతాయి. ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల), ఆరోగ్య ఖర్చులు, మార్కెట్‌ ఒడిదుడుకులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఇప్పుడు నిపుణులు 25x కంటే ఎక్కువగా 27x లేదా 30x నిధిని సమకూర్చుకోవాలని సూచిస్తున్నారు. అంటే, 25x సూత్రం తుది గమ్యం కాదు. ఆర్థిక గమ్యాన్ని సూచించే ఒక మైలురాయి మాత్రమే. దాన్ని ఆధారంగా చేసుకుని, వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో కూడిన పొదుపు, సరైన పెట్టుబడులు, ఖర్చులపై నియంత్రణ ఉంటే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పని చేయాల్సిందే అనే పరిస్థితి నుంచి, పని చేయాలనిపించినప్పుడే చేసే స్వేచ్ఛ దాకా తీసుకెళ్లే దారిలో 25x సూత్రం తొలి అడుగు. సరైన ఆర్థిక ప్రణాళికతో ఆ స్వేచ్ఛను సాధించవచ్చన్నది నిపుణుల మాట.

 

 

234
FINICAL PLANNING Tags:Calculating Retirement Funds Based on Current Expenses, Controlling Your Expenses…, Gen Z Thinking Differently, Guidance for Savings, The Foundation of the FIRE Concept, The Need for Financial Independence, What Exactly Is the 25x Rule?, What Is the 4% Withdrawal Rule?, Why Does This Rule Matter?

Post navigation

Previous Post: 2025లో మల్టీ-అసెట్ ఫండ్స్ అద్భుత రాబడులు.. 2026లో అనుసరించాల్సిన వ్యూహాలు! Multi-Asset Funds Deliver Excellent Returns in 2025: Strategies to Follow in 2026!
Next Post: 2026లో క్రిప్టో మార్కెట్ ఎలా ఉండబోతుందంటే..? What to Expect from the Crypto Market in 2026?

Related Posts

  • కొత్త సంప‌న్నుల కోసం వెల్త్ సైకాలజిస్టులు Wealth Psychologists for New Affluents FEATURE NEWS
  • ఇన్వెస్టర్‌కి ఇవి త‌ప్ప‌నిస‌రి: వారెన్ బ‌ఫెట్‌ FINICAL PLANNING
  • క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించండి.. ఆర్థిక సమస్యలను ముందుగానే గుర్తించండి.. Check Your Credit Report… Identify Financial Problems Early FEATURE NEWS
  • 10 ఏళ్లలో రూ. కోటి కావాలంటే ఎంత SIP చేయాలి? How Much SIP Do You Need to Make ₹1 Crore in 10 Years? FEATURE NEWS
  • వ్యక్తిగత రుణం Vs క్రెడిట్ కార్డు లోన్‌.. ఈ రెండింటిలో ఏది మంచిది? Personal Loan vs Credit Card Loan .. Which One Is Better? FINICAL PLANNING
  • HOW TO REACH FINANCIAL GOALS ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డం ఎలా FINICAL PLANNING

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • వారెన్ బఫెట్.. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి సూచనలు | దీర్ఘకాలిక సంపద రహస్యాలు Mutual Funds Investing Tips from Warren Buffett | Long-Term Wealth Secrets | Mutual Funds 2025 MUTUAL FUNDS
  • పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ సుంకం.. సిగ‌రెట్ల ధ‌రలు మ‌రింత ప్రియం .. Additional Excise Duty on Tobacco Products… Cigarette Prices to Rise Further FEATURE NEWS
  • 2025లో నెలకు లక్షకు పైగా ఆదాయం ఇచ్చే కొత్త ఆలోచ‌న‌లు Ideas that will give you a regular income of more than 1lakh per month in 2025 FEATURE NEWS
  • పేద విద్యార్థులకు పెద్ద అవకాశం..! పీఎం విద్యాలక్ష్మి పథకం ! A Big Opportunity for Economically Disadvantaged Students… PM Vidyalakshmi Scheme! FEATURE NEWS
  • ఇక‌పై బ్యాంకు ఖాతాకు న‌లుగురు నామినీలు! న‌వంబ‌ర్ 1 నుంచి అమ‌లులోకి.. Now Four Nominees Allowed per Bank Account! Effective from November 1 FEATURE NEWS
  • `రిచ్ డాడ్ – పూర్ డాడ్‌`ఏం చెప్తోంది rich dad poor dad book review BOOKS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.20 వేలు.. Retirement Income Plan – Safe, Steady and Stress-Free FINICAL PLANNING

Copyright © 2026.

Powered by PressBook News Dark theme