ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆర్థికంగా ఉన్నతిని సాధించాలని కోరుకుంటారు. అందుకు అనేక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు. అందులో ప్రధానమైనది అధిక మొత్తంలో డబ్బు సంపాదించడం. అంటే కోటి రూపాయలు సంపాదించడం అనేది అందరి జీవితాల్లో ఉండే ఒక కల. అయితే ఆ కలను సాకారం చేసుకోవడం ఎలా అనేది చాలా మందికి తెలియదు. కానీ కొన్ని మెలకువలు పాటిస్తే అదేమీ పెద్ద కష్టం కాదు.
ఒక సగటు మనిషి జాబ్ చేస్తూ కోటి రూపాయలు సంపాదించొచ్చా? రూ. కోటి సంపాదించడం అనేది అసాధ్యం కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఒక క్రమ శిక్షణతో కూడిన పెట్టుబడులు, పొదుపు మార్గాలను ఎంచుకుంటే సాధ్యమేనంటున్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మనీ ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన లాభాలు వస్తాయని కాదు. తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ సరిగ్గా చేస్తే ఎవరైనా కోటీశ్వరులుగా మారొచ్చు. కోటీశ్వరులుగా కావడం అనేది సుదీర్ఘమైన సహనంతో కూడిన ప్రక్రియ. ఇందుకు ఎంతో అనుభవం, శ్రద్ధ, తగిన ప్రణాళిక అవసరం.
టార్గెట్ ఉండాలి.. There should be a target
వాస్తవంగా కోటి రూపాయలు సంపాదించడం చాలా కష్టం కావచ్చు. అయితే కోటి రూపాయలు కూడబెట్టడం అంటే సంపాదించడం కాదు. మీ పెట్టుబడి ద్వారా కోటి రూపాయలు కూడబెట్టడం సులభమే. అందుకే ప్రతి ఒక్కరూ ఒక టార్గెట్ పెట్టుకోవాలి.
షార్ట్ టర్మ్ లో ఆలోచించకూడదు Don’t think in short term
షార్ట్ టర్మ్ లో సెటిల్ అవ్వాలనుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాదు. స్టడీ లేకుండా ఒక అబ్జర్వేషన్
లేకుండా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయకూడదు. వీటి కంటే ముందు ప్రతిఒక్కరూ ఫ్యామిలీని సెక్యూర్ చేసే ఇన్సూరెన్స్ ను తీసుకోవాలి.
మ్యూచువల్ ఫండ్స్ సరైన మార్గం
Mutual funds are the right way
అనుకున్నదానికంటే తక్కువ సమయంలోనే కోటీశ్వరులను చేసేందుకు మ్యూచువల్ ఫండ్స్ సరైన మార్గంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందులో రిస్క్ ఉన్నప్పటికీ హైరిటర్న్స్ వస్తుంటాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా కొద్ది కొద్దిగా జమ చేస్తూ పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు.
– మన దగ్గర రూ. కోటి ఉన్నట్లయితే దాన్ని ఒక బ్యాంకులో ఎఫ్ డి చేశామనుకుందాం. 6.57% చూసుకుంటే పర్ ఇయర్ ₹7 లక్షల రూపాయలు వస్తుంది. అదే కోటి రూపాయలని బ్యాంకులో కాకుండా ఏ మ్యూచువల్ ఫండ్ లోనో పెడితే .. లాంగ్ రన్ లో ఒక ఎనిమిదేళ్ల పైబడి గనుక మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేస్తే 12% రిటర్న్ ఇవ్వగలుగుతాయి. సంవత్సరానికి 12% అంటే నెలకి 1 శాతం. మీరు గనుక ఒక కోటి రూపాయలను మ్యూచువల్ ఫండ్ ద్వారా పోగు చేయగలిగితే అక్కడి నుంచి మీరు నెలవారి లక్ష రూపాయలు తీసుకున్నా.. మీ కోటి రూపాయలు తగ్గదు. ఒకవేళ మార్కెట్ పడితే రూ.70 నుంచి రూ. 60 లక్షలకు రావచ్చు . కానీ లాంగ్‌రన్‌లో మీ కోటి రూపాయలు మీకు ఉండిపోతుంది. అంటే నెలకి లక్ష రూపాయలు తీసుకోవడం అంటే ఒక మంచి పెన్షన్ క్రియేట్ చేసుకోవడమే కదా. ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్‌మెంట్ తర్వాత అతనికి వచ్చే పెన్షన్ డిపార్ట్మెంట్ ని బట్టి రూ.40,000 నుంచి రూ.60,000 వరకూ ఉంటుంది. అదే గనుక మీరు క్రమంగా ఒక కోటి రూపాయలు చేసుకొని మ్యూచువల్ ఫండ్ లాంటి సాధనలో పెట్టుకుంటే నెలకి లక్ష రూపాయల పెన్షన్ తో మీరు రిటైర్మెంట్ అవ్వగలుగుతారు. ఒకవేళ మీ జీతం తక్కువ అనుకుంటే కోటి కాదు రూ.10 లక్షలకు టార్గెట్ పెట్టుకోండి. అలా మీ టార్గెట్ పెట్టుకుంటే 10 అయ్యాక 20 చూద్దాం. 20 అయ్యాక రూ.50 లక్షలు చూద్దాం. అలా కోటి రూపాయలు సాధ్యపడుతుంది.
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే
how To get financial freedom
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే ఫస్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రథమంగా ఫైనాన్స్ అంటే ఎక్కడ పెట్టుబడి పెడితే.. డబ్బు పెరుగుతుందనేద కాదు. మీకున్న డబ్బును కాపాడుకోవడం ఫైనాన్స్. ఈ రోజు వరకు మీకున్న ఆస్తులను కాపాడుకోవడం. ఒక ఫ్యామిలీ డిపెండెన్స్ ఉన్న వ్యక్తి ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ తో కుటుంబ సభ్యులను ప్రొటెక్ట్ చేయాలి. ఆరోగ్యం చాలా కీలకం. హెల్త్ పరమైన ఇబ్బంది వచ్చిన పక్షంలో ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితి. అందుకే ప్రతిఒక్కరూ మొదటిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇది లేకుండా మీరు ఏమి చేయడానికి వీల్లేదు. కుటుంబ పెద్దకు గనుక ఏమైనా జరిగితే ఫ్యామిలీని పోషించగల బీమా కవరేజీని (టర్మ్ ఇన్సూరెన్స్) కూడా తీసుకోవాలి. స్థలం కొన్నాను. పొలం కొన్నాను.. మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాను.. బంగారం కొన్నాను.. పెళ్లికి దాస్తున్నాను.. చదువుకు దాస్తున్నాను అంటే కుదరదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ముందు ప్రొటెక్టింగ్ ఫ్యామిలీ. దాని తర్వాత మన భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని ఒక పేపర్ మీద రాసుకోవాలి. పిల్లల చదువులు, రిటైర్మెంట్, కారు ఎప్పుడు కొనాలి, ఇల్లు ఎప్పుడు కట్టాలి. లోన్లు , ఈఎంఐ లను అంచనా వేసుకుని కెరియర్‌ను ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్లానింగ్ లేకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం ఆలోచించకూడదు. ఫైనాన్షియల్ ప్లాన్ అంటే డబ్బు ఇన్వెస్ట్ చేయడమే కాదు. ముందు డబ్బు సంపాదించాలి. మీకు వస్తున్న డబ్బులో అవసరాలు తీర్చుకుంటూ.. భవిష్యత్తు అవసరాల గురించి కూడబెట్టుకోవడమే ఫైనాన్షియల్ ప్లానింగ్. నిజానికి డబ్బు ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదు. మీ సమయం మీ దగ్గర ఉంటే అదే అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే మీ భవిష్యత్తు సమయాన్ని ముందుగా కొని పక్కన పెట్టుకోవడమే. ఉదాహరణకు.. మీ నెల ఖర్చులు ఒక ₹30,000 అనుకుందాం. మీరు మరొక ₹30,000 ప్రతినెలా దాస్తున్నట్లయితే.. టెక్నికల్ గా మీరు ప్రతి నెలా ఇంకొక భవిష్యత్ మంత్ ని కొనుక్కుంటున్నారు ఇది ఫైనాన్షియల్ ప్లాన్ .
మనీ మేనేజ్‌మెంట్
మనీ మేనేజ్మెంట్ అంటే మనీని ఇన్వెస్ట్ చేయాలి. ఆర్ డీ, ఎఫ్ డి , ఇన్సూరెన్స్ పాలసీ, గవర్నమెంట్ బాండ్స్ , మ్యూచువల్ ఫండ్స్ తదితర వాటిల్లో మనీని ఇన్వెస్ట్ చేయాలి. మన డబ్బు మన కోసం నిరంతరం పని చేస్తే భవిష్యత్ కోసం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. వెల్త్ బిల్డింగ్ అంటే ఎక్కడ ఫాస్ట్ గా మనీ వస్తుందోనని ఆలోచించకూడదు. క్విక్ గా వచ్చే డబ్బు నిలవదు. అత్యాశకు పోయి మీ దగ్గర ఉన్నది పొగొట్టుకోకూడదు. వెల్త్ మేనేజ్మెంట్ అంటే దాన్ని స్లోగా గ్రో చేయాలి. ఈ రోజుల్లో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్లు స్టాక్ మార్కెట్ వైపు వస్తున్నారు. దాని పైన నాలెడ్జ్ లేకుండా ఎంటర్ అవుతున్నారు. చివరకు నష్టపోతున్నారు. ప్రతి వ్యక్తి మ్యూచువల్ ఫండ్ , స్టాక్ మార్కెట్‌కు గల వ్యత్యాసాన్ని గుర్తించాలి. లాంగ్ రన్‌లోనే ఈ రెండూ వర్కవుట్ అవుతాయనే విషయాన్ని గ్రహించాలి. సులువైన పద్ధతిలో చెప్పాలంటే ఒక స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకోవడం లేదా ఈత కొట్టడం అనేది ఒక మ్యూచువల్ ఫండ్‌గా మీరు పరిగణిస్తే.. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది సముద్రానికి వెళ్లి ఈత కొట్టడంలా పరిగణించొచ్చు. దీనికి అపారమైన అనుభవం కావాలి. మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎట్టి పరిస్థితిలోనూ స్టాక్స్ లోకి వెళ్ళకపోవడమే మంచిది. మ్యూచువల్ ఫండ్స్ అయితే మీ డబ్బుకు ఎటువంటి ఢోకా ఉండదు. అయితే దీనికి ముందు మీరు హోం వర్క్ చేయాల్సి ఉంటుంది. గత 10 ఏళ్లుగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టినోళ్లకి ఎంత రిటర్న్ వచ్చింది.. అదే పదేళ్లుగా మీ పక్కన ఉన్న వాళ్లు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడులు పెడితే ఎంత వచ్చిందనేది పరిశీలించాలి. వాస్తవంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ లోనే 90% మంది ఎక్కువ రిటర్న్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. స్టాక్స్ లో ఆ రిటర్న్స్ రావట్లేదు. ఎందుకంటే అక్కడ మన ఎమోషన్ ఉంటుంది. ఇంపల్సివ్ కాల్స్ తీసుకుంటాము . న్యూస్ కి రియాక్ట్ అవుతాము. కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. అనుభవం లేకుండా స్టాక్ మార్కెట్ లోకి వెళ్లడం ప్రమాదకరం, కాబట్టి జాగ్రత్త పడాలి.