Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

యూపీఐ మోసాల నుంచి ర‌క్ష‌ణ పొందండిలా! How to Protect Yourself from UPI Frauds!

Posted on 26/10/202526/10/2025 By admin No Comments on యూపీఐ మోసాల నుంచి ర‌క్ష‌ణ పొందండిలా! How to Protect Yourself from UPI Frauds!

ఈ రోజుల్లో UPI ద్వారా ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ లేదా ఆర్థిక సేవల నుంచి వచ్చిన సందేశాలపై వెంటనే స్పందించ‌కూడ‌దు. సాధారణంగా, సైబ‌ర్ క్రిమినల్స్ ఫేక్ యాప్‌లు, లింక్‌లు పంపి వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల, ఖాతాల నుంచి అకస్మాత్తుగా డబ్బులు పోతాయి. అందుకే ఎవరైనా OTP, పిన్ లేదా బ్యాంక్ డీటైల్స్ అడిగితే చెప్ప‌కూడ‌దు. ఈ సూత్రాలు పాటించడం ద్వారా యూపీఐ మోసాల నుంచి రక్షణ సాధ్యం.

ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.. These Precautions Must Be Taken

ప్రస్తుత ఆన్‌లైన్ ప్రపంచంలో సైబర్ మోసాలు , ఫ్రాడ్‌ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి వినియోగదారుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న జాగ్రత్తలు పెద్ద నష్టాలను నివారించవచ్చు.

ఎప్పుడూ అధికారిక యాప్ ద్వారా లావాదేవీలు చేయాలి.

అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దు. మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించవద్దు.

OTP, పిన్‌లను ఎవరికీ చెప్పకూడదు.

ఖాతా ట్రాన్సాక్షన్స్ ను తనిఖీ చేయాలి.

సైబర్ సెక్యూరిటీ అప్డేట్లు , పాస్‌వర్డ్ మార్పులను పిరియడిక్‌గా చేయండి.

ఫేస్ రిక‌గ్నేష‌న్ , ఫింగ‌ర్ ప్రింట్ ద్వారా మీ ఫోన్‌కు భ‌ద్ర‌త చేకూర్చాలి. ఒక వేళ మీ ఫోన్ చోరీకి గురైనా..మీకు ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌దు.

న‌గ‌దు లావాదేవీల స‌మ‌యంలో.. During Cash Transactions…

న‌గ‌దు పంపిణీ లేదా ఆన్‌లైన్‌లో చెల్లించే స‌మ‌యాల్లో వినియోగదారులు చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. తప్పుగా వివరాలు ఇచ్చినా లేదా అసత్య వెబ్‌సైట్‌లను వాడితే డబ్బులు కోల్పోవచ్చు. అందుకే అధికారిక , నమ్మదగిన ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించాలి. ఎవరితోనైనా బ్యాంక్ డీటెయిల్స్, పిన్ లేదా OTP పంచకూడదు. లావాదేవీ వివరాలను రెండు సార్లు తనిఖీ చేయాలి. అనుమానాస్పద వెబ్‌సైట్‌లు లేదా లింక్‌లను క్లిక్ చేయవద్దు.

పిన్ నంబ‌ర్ చెప్ప‌కూడ‌దు .. Do Not Share Your PIN Number

UPI, డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఉపయోగించే ప్రతి ఒక్కరు పిన్ లేదా OTP ఇతరులకు చెప్పకూడదు. ఎక్కువగా సైబర్ మోసగాళ్లు ఫేక్ కాల్స్, మెసేజ్‌లు పంపి ఈ డేటాను సేకరించి అకస్మాత్తుగా ఖాతాల నుంచి డబ్బులు చెల్లింపులు చేస్తుంటారు. అందుకే ఎప్పుడూ మీ పిన్, OTP ను గోప్యంగా ఉంచాలి. ఏ బ్యాంక్, ఆర్థిక సేవా ప్రతినిధి అడిగినా పాస్‌వర్డ్‌ను చెప్ప‌కూడ‌దు. అనుమానాస్పద లింక్‌లు, ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించ‌రాదు. ఖాతా లావాదేవీలను రోజువారీగా తనిఖీ చేయాలి.

పిన్ నంబర్ మార్పు .. Change Your PIN Number

ఆన్‌లైన్ లావాదేవీలు, ATM వినియోగం పెరుగుతున్న నేప‌థ్యంలో మీ పిన్ నంబర్ ను ఎప్ప‌టిక‌ప్పుడు మార్పు చేయడం చాలా అవ‌స‌రం. సైబర్ మోసగాళ్ల‌కు చిక్క‌కుండా ఉండాలంటే పిన్ నంబ‌ర్‌ను సమయానుగుణంగా మారుస్తూ ఉండాలి. దానిని ఎవరికీ చెప్పకూడ‌దు. సులభంగా ఊహించగల నెంబ‌ర్లు వాడకూడదు. పిన్ మార్పు అనంతరం ఖాతా లావాదేవీలను చూసుకోవాలి.

యాప్‌ల డౌన్‌లోడ్ .. Downloading Apps

స్మార్ట్‌ఫోన్‌లో ఫైనాన్స్, బ్యాంకింగ్, UPI యాప్‌లు డౌన్‌లోడ్ చేసే సందర్భంలో వినియోగదారులు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ యాప్‌లు ఇన్‌స్టాల్ చేస్తే వ్యక్తిగత సమాచారం చోరికి గురవుతుంది. అందుకే అధికారిక ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఇన్‌స్టాల్ చేసేముందు రివ్యూలు, డెవలపర్ వివరాలు పరిశీలించాలి. అనుమానాస్పద లింక్‌లు, వెబ్‌సైట్‌ల నుండి డౌన్‌లోడ్ చేయ‌రాదు. యాప్‌కు అవసరమైన పరమిషన్‌లను మాత్రమే ఇవ్వాలి.

ఫోన్ స్క్రీన్ షేరింగ్ పై అప్రమత్తం .. Be Cautious About Phone Screen Sharing

వినియోగదారులు ఫోన్ స్క్రీన్ షేరింగ్ చేసే సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అకస్మాత్తుగా వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ మోసగాళ్ల చేతికి చిక్కే అవ‌కాశం ఉంది. దీంతో మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాస్‌వర్డ్‌లు సేకరించి .. ఖాతాలో న‌గ‌దు దోచేస్తారు. అందుకే తెలియని వ్యక్తులతో స్క్రీన్ షేర్ చేయకూడ‌దు. స్క్రీన్ షేరింగ్ సమయంలో ఎటువంటి ఆర్థిక, వ్యక్తిగత వివరాలు చూప‌రాదు. అధికారిక, నమ్మదగిన టూల్స్ ద్వారా మాత్రమే షేరింగ్ చేయాలి. అవసరం అయిన వెంటనే షేరింగ్ సెషన్ ముగించాలి.

మీ ప్రమేయం లేకుండా ఖాతా నుంచి న‌గ‌దు బ‌దిలీ అయితే ?
What to Do If Cash Is Transferred from Your Account Without Your Consent?

ఎప్పుడైనా ఖాతా నుంచి మీ ప్ర‌యేయం లేకుండా న‌గ‌దు బదిలీ అయితే వెంటనే చర్యలు తీసుకోవడం అత్యవసరం. అలా చేయకపోతే తీవ్రంగా నష్టపోక త‌ప్ప‌దు. మీ బ్యాంకు ఖాతా నుంచి న‌గ‌దు మాయ‌మైతే వెంట‌నే బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థకు సమాచారం అందించాలి. మీ ఖాతా లావాదేవీలను రివ్యూ చేసి అనుమానాస్పద లావాదేవీలను గుర్తించాలి. బ్యాంక్ ఫ్రాడ్ రిపోర్ట్ / FIR నమోదు చేయాలి. ఖాతా పాస్‌వర్డ్‌లు, పిన్‌లు మార్పు చేసుకోవాలి. అవసరమైతే, ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయాలి. మీ యూపీఐని డీయాక్టివేట్ చేయాలి.

ఫోన్ చోరీకి గురైతే ఏం చేయాలి…What to Do If Your Phone Is Stolen

మీ ఫోన్ చోరీకి గురైతే.. సెకన్ల‌లో మీ సమాచారంతో పాటు బ్యాంకు లావాదేవీలు, వ్యక్తిగత ఫొటోలు, మెసేజ్‌లు అన్ని న‌ష్ట‌పోవ‌చ్చు. అందుకే చోరీ సంభవించిన ప్రతీ క్షణం విలువైనది . ఆలస్యం చేయకుండా.. వెంటనే చర్యలు తీసుకోవాలి. నష్టాన్ని తగ్గించుకునే మార్గాలు ఇవే.

1. పోలీస్‌ల‌కు ఫిర్యాదు చేయండి (File a Complaint with the Police)
ఫోన్ దొంగతనాన్ని వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలి. FIR నమోదు చేయించాలి. డౌక్యుమెంటేషన్‌కు ఇది అవసరం.

2. SIM ను బ్లాక్ చేయాలి..(Block Your SIM)
తక్షణమే సర్వీస్‌ ప్రొవైడర్‌కు కాల్ చేసి సిమ్‌ను బ్లాక్‌ చేయించాలి. SIM ద్వారా ఏదైనా OTP/ట్రాన్సాక్షన్ జరిగితే నిరోధించేందుకు ఇది ముఖ్యం.

3. రిమోట్ ట్రాక్ / విప్ చేయండి (Remote Track / Wipe Your Device)
Android అయితే Google Find My Device, iPhone అయితే Find My iPhone ద్వారా ఫోన్‌ను ట్రాక్‌ చేయండి లేదా డివైస్‌ను లాక్‌ చేసి డేటాను రిమోట్ ద‌గ్గ‌ర‌ వాయిస్ టైప్ చేయండి.

4. బ్యాంకుల్ని, UPI అప్లికేషన్ల‌కు వెంటనే సమాచారం ఇవ్వండి
(Immediately Inform Your Bank and UPI Apps)
మీ బ్యాంక్, UPI యాప్‌లు, డిజిటల్ వాలెట్‌లకు ఫోన్ చోరీ స‌మాచారం ఇవ్వండి. అవసరమైతే యాప్/UPI ID అకౌంట్‌లను బ్లాక్ చేయించండి . లేదా బ్యాంకు క్రెడిట్/డెబిట్ కార్డులను సస్పెండ్ చేయించండి.

5. పాస్‌వర్డ్‌లు, OTP/2FA సెట్టింగులు మార్చండి (Change Passwords, OTP & 2FA Settings)
ఈమెయిల్, బ్యాంకింగ్, సోష‌ల్‌ మీడియా పాస్‌వర్డ్‌లు వెంటనే మార్పు చేయండి.

6. IMEI/సీరియల్ నంబర్ నమోదు (Record Your IMEI / Serial Number)
ఫోన్ IMEI నంబ‌రు (డివైస్ బాక్స్ లేదా కొనుగోలు రశీదు చూడండి)తో పోలీస్‌ FIRలో పేర్కొని.. మొబైల్‌ సర్వీస్ ప్రొవైడర్‌కు తెలియజేయండి. కొన్ని సందర్భాల్లో ఆ IMEI నంబ‌ర్‌తో ఫోన్‌ను బ్లాక్‌ చేయవచ్చు.

7. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌ను శ్రద్ధగా పరిశీలించాలి. (Monitor Bank Transactions Carefully)
చోరీ జ‌రిగిన తర్వాత 24-48 గంటల్లో మీ బ్యాంకు స్టేట్మెంట్స్‌ను జాగ్రత్తగా తనిఖీ చేయాలి. అనుమానాస్పద లావాదేవీలు ఉంటే వెంటనే బ్యాంకుకు తెలియ‌జేయాలి.

8. సైబర్ సెక్యూరిటీ / సైబర్ సెల్‌ను సంప్రదించండి (Contact Cybersecurity / Cyber Cell)
తగిన స‌మ‌యంలో స్థానిక సైబర్ సెల్‌ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.

9. కొత్త SIM / డివైస్‌లో బహుళ భద్రత ఏర్పాటు
(Set Up Multi‑Layer Security on Your New SIM and Device)
కొత్త ఫోన్ లేదా SIM పొందాక పాస్‌వర్డ్‌లు, 2FA, బ్యూటోమేటిక్ బ్యాక్‌అప్‌లు సెట్ చేయాలి. UPI పిన్ , బ్యాంకు అప్లికేషన్లను ప్రత్యేక పాస్‌కోడ్‌తో ర‌క్షించుకోవ‌చ్చు.

10. ప్రివెన్టివ్ టిప్స్ (ముందు నుంచే precautiousగా ఉండాలంటే)
Preventive Tips (Stay Cautious in Advance)

ఎప్పుడూ ఫోన్‌లో ఫైండ్‌ మై డివైస్ ను ఆన్ లో ఉంచాలి. ముఖ్యమైన డేటా ను తరచుగా బ్యాకప్ చేసుకోవాలి. యాప్‌ permissions తప్పనిసరిగా చెక్ చేయాలి. అనవసర అనుమతులు తీసివేయాలి. బయోమెట్రిక్‌తో పాటు బలమైన పాస్‌వర్డ్ ఉపయోగించాలి. పబ్లిక్ ప్లేస్‌లో ఫోన్ వాడేట‌ప్పుడు జాగ్రత్త గా ఉండాలి. పూర్తి స్క్రీన్ షేరింగ్, పబ్లిక్ Wi‑Fi ఉపయోగించేట‌ప్పుడు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

 

238
FEATURE NEWS Tags:. These Precautions Must Be Taken, Be Cautious About Phone Screen Sharing, Change Your PIN Number, Do Not Share Your PIN Number, Downloading Apps, During Cash Transactions…, What to Do If Cash Is Transferred from Your Account Without Your Consent?, What to Do If Your Phone Is Stolen

Post navigation

Previous Post: మీరు ఎలాంటి ఇన్వెస్టర్‌..? ఇన్వెస్టర్‌ సైకాలజీ..! What Kind of Investor Are You..? The Psychology of Investing..!
Next Post: మీ జీతాన్ని 4 రెట్లు పెంచే రహస్యం! The Secret to Quadrupling Your Salary!

Related Posts

  • లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్స్ పుస్త‌క స‌మ‌రీ LIFE’S AMAZING SECRETS by gaur gopal das book review telugu BOOKS
  • రూ.6 వేల కోట్లకు చేరిన పిచాయ్ వేతనం.. ! Sundar Pichai’s Pay Package Soars FEATURE NEWS
  • కొత్త ఆర్థిక సంవత్సరం.. మధ్యతరగతి ముందున్న కొత్త సవాళ్లు.. New Financial Year.. New Challenges for the Middle Class FEATURE NEWS
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే ఆదాయం what is the income source of state government FEATURE NEWS
  • అమెరికా సుంకాల పిడుగుపాటు.. సోలార్‌ షేర్లకు షాక్ ! US Tariff Shock on Indian Solar Stocks FEATURE NEWS
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • వారెన్ బఫెట్.. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి సూచనలు | దీర్ఘకాలిక సంపద రహస్యాలు Mutual Funds Investing Tips from Warren Buffett | Long-Term Wealth Secrets | Mutual Funds 2025 MUTUAL FUNDS
  • చైనా ఎఫ్‌డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. Centre Gives Green Signal for Chinese FDI FEATURE NEWS
  • ఎఫ్‌డీలకు మించి వడ్డీ..! ఆర్‌బీఐ భరోసాతో 8.05% ఇచ్చే ఈ బాండ్లు గురించి తెలుసా? Higher Returns than FDs! Do You Know About These RBI-Backed Bonds Offering 8.05% Interest? FEATURE NEWS
  • ప్రొఫెషనల్ టాక్స్ ఎవరెవ‌రు చెల్లించాలో తెలుసా? Do You Know Who Is Required to Pay Professional Tax? FINICAL PLANNING
  • రీట్స్ అంటే ఏమిటి What Is The REITs INVESTMENTS
  • డిజిటల్ గోల్డ్ కొనొద్దు.. సెబీ హెచ్చరిక.. ! Don’t Buy Digital Gold… SEBI Issues Warning! FEATURE NEWS
  • సోలార్ ఉత్పత్తుల దిగుమ‌తుల‌పై126 శాతం డ్యూటీ..! ట్రంప్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం! 126% Duty on Solar Imports! Trump Administration Takes a Key Decision FEATURE NEWS
  • రెండోసారీ ఆర్‌బీఐ వడ్డీరేట్లలో మార్పుల్లేవ్‌… ఆర్థిక వ్యవస్థకు సంకేతాలేంటి? No Change in RBI Interest Rates for the Second Time… What Does It Signal for the Economy? FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme