Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

ఇక‌పై బ్యాంకు ఖాతాకు న‌లుగురు నామినీలు! న‌వంబ‌ర్ 1 నుంచి అమ‌లులోకి.. Now Four Nominees Allowed per Bank Account! Effective from November 1

Posted on 23/10/2025 By admin No Comments on ఇక‌పై బ్యాంకు ఖాతాకు న‌లుగురు నామినీలు! న‌వంబ‌ర్ 1 నుంచి అమ‌లులోకి.. Now Four Nominees Allowed per Bank Account! Effective from November 1

బ్యాంకు ఖాతాల‌కు సంబంధించి ఆర్‌బీఐ కీల‌క మార్పులు చేసింది. ఇక‌పై బ్యాంకు ఖాతాకు న‌లుగురు నామినీలను త‌ప్ప‌నిస‌రి చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. నవంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది. బ్యాంకింగ్ స‌వ‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం ఈ మార్పులు చేశారు. దీని ప్ర‌కారం ఇక‌పై బ్యాంకులో ఖాతా తెర‌వాలనుకునే వారు త‌ప్పనిస‌రిగా న‌లుగురు నామినీల పేర్లును సూచించాలి. ఇప్పటివరకు ఒక ఖాతాకు ఒక నామినీ నియమించుకునే అవకాశం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక ఖాతాకు గరిష్ఠంగా నాలుగు నామినీల్ని (4) నియమించుకోవచ్చు. డిపాజిట్ ఖాతాలు, బ్యాంకు ఇత‌ర‌త్రా సేవ‌ల‌కు ఈ నామినేషన్‌ల మార్పులు వర్తిస్తాయి. నామినీలకి మీరు ఇవ్వబోయే వాటాల శాతాన్ని ముందుగా నిర్ణయించుకోవచ్చు . ఉదాహరణకు న‌లుగురిలో ఒక్కరికి 40 %, రెండో వారికి 30 % ఇలా.. మొత్తంగా 100%కి చేరాలి. అయితే, బ్యాంకుల సేఫ్‌కస్టడీ లాకర్లు, సేఫ్టీ లాకర్లు వంటి వస్తువుల నామినేషన్‌లో మాత్రం ఒకరి తర్వాత ఒకరుగా (సక్సెసివ్ నామినేషన్) విధానం మాత్రమే అనుమతించబడుతుంది.

బ్యాంకులు స‌న్న‌ద్ధం ..Banks Are Prepared

బ్యాంకులు కూడా కొత్త వ్యవస్థకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌, ఫార్మాట్‌లు అప్‌డేట్‌ చేస్తున్నాయి. అయితే కస్టమర్ల వివరాలు సరైన రీతిలో పొందకపోతే తప్పిదాలు తప్పవని అధికారులు చెబుతున్నారు.

అనేక ప్రయోజనాలు ..Multiple Benefits

ఒక నామినీకి మాత్రమే ఆధారపడే సమస్యలు తగ్గనున్నాయి. ఆస్తి విభజన / వారసత్వ సంబంధిత క్లెయిమ్‌ల సమయం ఆదా అవుతుంది. ఖాతాదారు స్వయంగా నామినీల చాయిస్ మార్పులు చేయొచ్చు. వాటాల నిర్థారణ సౌకర్యాన్ని పొందగలరు. ఈ నిబంధనలు అమలుకు వచ్చే నాటికి ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో నామినేషన్ వివరాలను రివ్యూ చేసుకొని అవసరమైతే సవరించుకోవ‌చ్చు.

నాలుగు నామినీలతో నష్టాలేనా?.. Any Drawbacks to Having Four Nominees?

నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్న ‘మల్టిపుల్‌ నామినీ వ్యవస్థ’పై ఖాతాదారులు ఆనందం వ్యక్తం చేస్తుంటే… నిపుణులు మాత్రం “జాగ్రత్త!” అంటున్నారు. ఒక ఖాతాకు గరిష్ఠంగా నాలుగు నామినీలు ఉంచుకోవచ్చని కొత్త నియమం చెబుతుండగా, దాంతో నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. న‌లుగురు నామినీలు అనే నూత‌న విధానంలో సౌలభ్యం ఎంత ఉందో.. జాగ్రత్తగా లేకుంటే తీవ్ర ఇబ్బందుపాల‌వ‌డం ఖాయం. నామినీ పెంచే ముందు ఆలోచించాలి. లేకుంటే వారసత్వ తగాదాలు త‌ప్ప‌వు.

పెర‌గ‌నున్న వివాదాలు..Disputes Likely to Increase

ఇప్పటి వరకు ఒక్క నామినీ మాత్రమే ఉండేది. ఇప్పుడు న‌లుగురికి వాటాలు కేటాయించే అవకాశం రావడంతో వారసత్వ హక్కుల తగాదాలు మళ్లీ ముందుకొచ్చే ప్రమాదం ఉంది. “ఎవరికెంత శాతం?” అన్నదానిపై కుటుంబాల్లో వివాదాలు చెలరేగే అవకాశం లేక‌పోలేదు. బ్యాంకులకూ లీగల్‌ క్లారిటీ కోసం సమయం పట్టే పరిస్థితి ఉంది.

ఖాతాదారుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు.. Customers’ Negligence

నిపుణుల అభిప్రాయం ప్రకారం చాలామంది ఖాతాదారులు నామినీల పేర్లు మాత్రమే నమోదు చేస్తారు ఎవ‌రికి ఎంత‌ శాతం వాటా (share percentage) స్పష్టంగా పేర్కొనరు. దీంతో వారి మరణానంతరం బ్యాంకులు నామినీ వాటా పంపిణీపై తర్జనభర్జనలో పడతాయి. చిన్న పొరపాటుతో వారసులకు డబ్బు చేరే ప్రక్రియ నెలల తరబడి ఆలస్యం అవుతుంది.

నామినీ అంటే..What is a Nominee?

బ్యాంకింగ్ చట్టం ప్రకారం.. నామినీ అనేది కేవలం డబ్బు స్వీకరించే వ్యక్తి మాత్రమే. ఆ డబ్బు అసలు హక్కు ఎవరిదో తేల్చేది వారసత్వ చట్టం (Succession Law). న‌లుగురు నామినీలు ఉన్నప్పుడు వారసత్వ హక్కులు, లీగల్‌ వారసులు ఎవరన్న గందరగోళం పెరగొచ్చు. ఖాతాదారుడు మరణించిన తర్వాత ఖాతాలోని డబ్బును నామినీగా ఉన్న‌వారు స్వీకరించ‌వ‌చ్చు. అయితే ఆ వ్యక్తి నిజమైన వారసుడు కావాలనే అవసరం లేదు. అందుకే నామినీ పేరు నమోదు చేసిన‌ప్పుడే ఈ డబ్బు చివరికి ఎవరికీ చెందాలి? అనే దానిపై ఖాతాదారుకు స్పష్టత ఉండాలి.

గంద‌ర‌గోళం త‌లెత్త‌కుండా.. Without Causing Confusion…

ఖాతాదారులు నామినీలు పెంచుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. వారసత్వ పత్రం (Will) లేకుండా నామినీలే ఆధారం అవుతారు. కాబట్టి గందరగోళం తలెత్తకుండా స్పష్టమైన రికార్డులు ఉంచుకోవాలి. అని బ్యాంకింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు.

సరిగ్గా నామినీని ఎలా నియమించాలి? ఎవరికెంత శాతం ఇవ్వాలి?
How to Properly Appoint a Nominee? How Much Percentage to Allot to Each?

ప్ర‌స్తుతం ప్రతి ఒక్కరి దగ్గరా ఒక బ్యాంకు ఖాతా ఉంది. కానీ ఆ ఖాతాకు చాలామంది నామినీ వివరాలు సరిగా ఇవ్వడం కాదు. కొంత‌మంది ఎవరో ఒకరి పేరు రాసేస్తున్నారు. అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఎవరిని నామినీగా పెట్టాలంటే? Who Should Be Appointed as a Nominee?

కుటుంబ సభ్యులు (భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు) ను నామినీగా పెట్ట‌వ‌చ్చు. వివాదాలు రాకుండా ఉండాలంటే, వారసత్వ పత్రం (Will) లో కూడా అదే పేర్లు ఉండాలి. కుటుంబం వెలుపల వ్యక్తిని నామినీగా ఉంచాలనుకుంటే రికార్డ్‌లో రాయాలి. ఇకపై ఒక బ్యాంకు ఖాతాకు గరిష్ఠంగా నాలుగు నామినీలు పెట్టుకోవచ్చనే నూత‌న విధానం అమ‌లులోకి రానున్న నేప‌థ్యంలో నామినీ పేరు న‌మోదు చేసేట‌ప్పుడు వాటా శాతం కూడా చెప్పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వారసత్వ తగాదాలకు ఆస్కారం ఉండ‌దు.

ఎవరికెంత శాతం ఇవ్వాలి? What Percentage Should Be Allotted to Whom?

నలుగురు నామినీలు ఉంటే మొత్తం 100% వాటాను వారికి పంచాలి. ఉదాహరణకు: భార్య – 40%, కుమారుడు – 30%, కుమార్తె – 20%, తల్లి – 10% ఇలా శాతం వివరాలను ఫారంలో స్పష్టంగా రాయాలి. బ్యాంకు కాపీని సురక్షితంగా ఉంచాలి.

ఎప్పుడు మార్పు చేయాలి? When Should It Be Changed?

జీవితంలో పరిస్థితులు మారతాయి. వివాహం, విడాకులు, పిల్లల జననం, మరణం ఇవన్నీ నామినీ వివరాలను రివైజ్‌ చేయాల్సిన సందర్భాలు. పాత నామినీ వివరాలు మార్చకపోతే, మరణానంతరం డబ్బు తప్పు వ్యక్తికి చేరే ప్రమాదం ఉంది.

ఏ ఖాతాలకు నామినీ తప్పనిసరి? Which Accounts Is a Nominee Mandatory?

సేవింగ్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు, డీమ్యాట్‌, మ్యూచువల్‌ ఫండ్‌, పీఎఫ్‌ ఖాతాలకు నామినీ వివరాలు ఉండాలి.

కుటుంబంతో చ‌ర్చించాలి.. Should Discuss with the Family…

నామినీ నియమించడం ఒకసారి చేసే పని కాదు. అది జీవితంలో మార్పులకు అనుగుణంగా అప్‌డేట్‌ చేసుకోవాల్సిన బాధ్యత. అని బ్యాంకింగ్‌ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎవరికెంత శాతం ఇవ్వాల‌నే దానిపై కుటుంబంతో ముందుగానే చర్చించి నిర్ణయించాలి. లేకపోతే ప్రేమ బంధం కంటే వారసత్వ బంధం బలహీనమవుతుంది. అని అంటున్నారు.

నామినీ vs వారసత్వం Nominee vs. Inheritance

చాలామంది ఖాతాదారులు, నామినీని వారసు లేదా యాజమాన్య హక్కు దారుడు అనుకుంటారు. కానీ నామినీ, వారసత్వం మధ్య ప్రాధమిక తేడా తెలుసుకుంటే, భవిష్యత్తులో వారసత్వ వివాదాలు తప్పించుకోవచ్చు. నామినీ అనేది ఖాతాదారుడు మరణించిన తర్వాత డబ్బు/ఆస్తిని స్వీకరించే వ్యక్తి. ఇది తాత్కాలిక స్వీకరణ హక్కు మాత్రమే. ఉదాహరణకు ఒక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాకు మీరు మీ స్నేహితుని నామినీగా పెట్టార‌నుకుందాం. ఆ ఖాతా నిధులు నామినీకి ఫెయిర్‌గా అందుతాయి. కానీ కానీ నిజమైన వారసులు ఆ డబ్బును వారసత్వ చట్టం ప్రకారం పొందగ‌ల‌రు. వారసులు అనేవారు, ఇచ్చిన ఆస్తి మీద చట్టబద్ధ హక్కు కలిగి ఉన్న వ్యక్తులు. వారసులే చివరకు ఆస్తి యాజమాన్యాన్ని సొంతం చేసుకుంటారు.

298
FEATURE NEWS Tags:Any Drawbacks to Having Four Nominees?, Banks Are Prepared, Customers’ Negligence, Disputes Likely to Increase, How to Properly Appoint a Nominee? How Much Percentage to Allot to Each?, Multiple Benefits, Nominee vs. Inheritance, Should Discuss with the Family…, What is a Nominee?, What Percentage Should Be Allotted to Whom?, When Should It Be Changed?, Which Accounts Is a Nominee Mandatory?, Who Should Be Appointed as a Nominee?, Without Causing Confusion…

Post navigation

Previous Post: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.845.77 కోట్లకు పెంపు Microsoft CEO Satya Nadella’s Annual Salary Increased to ₹845.77 Crore
Next Post: మీరు ఎలాంటి ఇన్వెస్టర్‌..? ఇన్వెస్టర్‌ సైకాలజీ..! What Kind of Investor Are You..? The Psychology of Investing..!

Related Posts

  • డిసెంబర్‌లో కీలక ఆర్థిక మార్పులు ఇవే.. Key Economic Changes Coming in December FEATURE NEWS
  • PPO నంబర్ మ‌ర్చిపోయారా? అయితే ఇక నో టెన్ష‌న్‌! EPFO పెన్షనర్లు ఇంట్లో నుంచే నిమిషాల్లో పొందొచ్చు! Forgot Your PPO Number? No Tension! EPFO Pensioners Can Retrieve It Online in Minutes from Home! FEATURE NEWS
  • సిల్వర్‌ ETFల‌పై షాకింగ్ న్యూస్‌.. వాటిని ఆపేసిన‌ మ్యూచువ‌ల్ ఫండ్ కంపెనీలు Shocking News on Silver ETFs: Mutual Fund Companies That Have Discontinued Them FEATURE NEWS
  • Unclaimed Deposits  లెక్క తేల్చండి..!   “మీ డబ్బు – మీ హక్కు”  గురించి తెలుసుకోండి!  Check Your Unclaimed Deposits! Learn About “Your Money – Your Right”! FEATURE NEWS
  • Daily stock marketలో trading analysis ఎలా చేస్తారు How to do trading analysis in daily stock market FEATURE NEWS
  • మార్చి 31 లోపు పూర్తిచేయాల్సిన ట్యాక్స్ పనులేమిటో తెలుసా? Do You Know the Tax Tasks That Must Be Completed Before March 31? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఆన్‌లైన్‌లో లోన్ తీసుకుంటున్నారా.. జాగ్ర‌త్త ! FINICAL PLANNING
  • ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే చేదా..? What are equity mutual funds? MUTUAL FUNDS
  • ఫండ‌మెంటల్ ఎనాలిసిస్ అంటే..? MARKET
  • పెద్ద ఐపీఓలు ఎందుకు విఫలం అవుతున్నాయో తెలుసా? Why Do Big IPOs Fail? Lessons for Investors from Market Experience MARKET
  • 2026 బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల ఆశలు .. Investors’ Expectations from Budget 2026 FEATURE NEWS
  • స్వయంకృషితో ఎదిగారు.. పారిశ్రామికవేత్తల్లో అగ్రస్థానంలో నిలిచారు Self-Made Industrialists Reach the Top FEATURE NEWS
  • యుద్ధం ఉన్నా… మార్కెట్ కూలినా… పెట్టుబ‌డులు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? Do You Know How to Keep Your Investments Safe Even During War or Market Crashes? FINICAL PLANNING
  • మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో సిప్ చేస్తున్నారా what is sip in mutual funds MUTUAL FUNDS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme