
మనకు తెలిసిన ఎన్నో ప్రాచీన, సంప్రదాయ పొదుపు సాధనాలు, పెట్టుబడి విధానాల కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది `ది బెస్ట్` అన్న విషయం రుజువైనదే. దీర్ఘకాలం కొనసాగిస్తే ఈక్విటీలో వచ్చే రాబడి ఇంకెందులోనూ సాధ్యం కాదు. కానీ ఎందుకో చాలా మంది వీటిపైన ఆసక్తి చూపించట్లేదు. కొందరు భయపడిపోతుంటారు.
what is the greatness of equity mutual funds
మొదటి నుంచి చూసుకుంటే అన్ని కంపెనీల కన్నా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. దీర్ఘకాలంలో చేస్తే మంచి లాభాలు వస్తాయన్న ఆలోచన ఎవరికీ లేకుండా పోతోంది. ఇప్పుడు అందరూ తక్కువ కాలంలో ఇన్వెస్ట్ చేసి వెంటనే మంచి ప్రాఫిట్ రావాలని అనుకుంటున్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ని సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ ఇచ్చిందని ప్రజలు గ్రహించడంలేదు.
how equity mutual funds generate more profits
ఇందుకేనేమో..
* చాలామందికి మ్యూచువల్ ఫండ్స్ అంటే అర్థం కావట్లేదు. అందులో ఈక్విటీ అంటే కూడా అర్థం కావట్లేదు.
* ఈక్విటీ అంటే కంపెనీలో మనం కూడా ఒక వాటాదారు అని అర్థం. దానిలో వచ్చే లాభాల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ బట్టి మనకీ ఆదాయం లభిస్తుంది.
* షేర్ అంటే ఒక కంపెనీలో భాగస్వామ్యం కావడం. మనం ఈక్వటీలోగాని, మ్యూచువల్ ఫండ్స్ లో కాని ఇన్వెస్ట్ చేయకపోతే వెల్త్ క్రియేట్ చేయడం కష్టం.
* లాంగ్ టెర్మ్ లోనే మ్యూచువల్ ఫండ్స్ లాభాలు ఇస్తాయి. కొంతమందికి లాంగ్ టెర్మ్ లో ఇన్వెస్ట్ చేయడం పట్ల అంతగా అవగాహన ఉండదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి లాంగ్ టెర్మ్, షార్ట్ టెర్మ్ అనేది మన లక్ష్యం పైన ఆధారపడి ఉంటుంది.
* మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ తో కూడుకున్నదని కొందరు భావిస్తుంటారు. వాలటాలిటీ ఎక్కువ. రిస్క్ ఉంటుంది కాని దానికి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం.
* ఓపిక అనేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో చాలా ముఖ్యం. చాలామందిలో ఇది తక్కువగా ఉంటుంది. తెల్లవారే సరికి లేదా వారానికో, నెలకో లక్షాధికారి అయిపోవాలని ఉంటుంది. కానీ ఓపికతో ఉంటేనే అది సాధ్యపడుతుంది.