Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించొచ్చు! LIC Premium from PF Account – A Financial Safety Option

Posted on 06/01/2026 By admin No Comments on పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించొచ్చు! LIC Premium from PF Account – A Financial Safety Option

జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా బీమాను మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. మనకు ఏదైనా అనుకోని ప్రమాదం, అనారోగ్యం లేదా అకాల మరణం సంభవించినప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేది జీవిత బీమానే. అందుకే బీమా పాలసీని కొనసాగించడం, సకాలంలో ప్రీమియంలు చెల్లించడం అత్యంత కీలకం. కానీ వాస్తవ జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. ఉద్యోగం పోవడం, వ్యాపారంలో నష్టం, అనారోగ్య ఖర్చులు, పిల్లల చదువు వ్యయాలు వంటి కారణాలతో ఒక్కసారిగా ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి సందర్భాల్లో బీమా ప్రీమియం చెల్లించడం కూడా భారంగా మారుతుంది. ఫలితంగా చాలా మంది తమ LIC పాలసీలను ల్యాప్స్‌ అయ్యే పరిస్థితికి నెట్టేస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఈపీఎఫ్‌ఓ (EPFO) ఒక కీలక వెసులుబాటు కల్పిస్తోంది. అదేంటంటే… పీఎఫ్‌ ఖాతా నుంచి నేరుగా LIC ప్రీమియంలు చెల్లించే అవకాశం!

బీమా ఎందుకు అవసరం? Why Life Insurance Is Crucial
జీవిత బీమా అనేది కేవలం ఒక పెట్టుబడి మాత్రమే కాదు… అది కుటుంబానికి ఇచ్చే భరోసా. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే, మిగిలినవారు ఆర్థికంగా కుదేలవకుండా ఉండేందుకు బీమా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలకు LIC వంటి బీమా పాలసీలు ఒక రక్షణ కవచంలాంటివి. పిల్లల చదువు, ఇల్లు, అప్పులు, రోజువారీ ఖర్చులు .. ఇవన్నీ కొనసాగాలంటే బీమా ద్వారా వచ్చే మొత్తం ఎంతో అవసరం. అయితే ప్రీమియం మిస్‌ అయితే పాలసీ ల్యాప్స్‌ అవుతుంది. ల్యాప్స్‌ అయితే కవరేజ్‌ తగ్గిపోతుంది తిరిగి రివైవల్‌ చేయాలంటే అదనపు పెనాల్టీలు చెల్లించాలి. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే EPFO ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చింది.

పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం – ఎలా సాధ్యం? LIC Premium Payment Through PF – How It Works
ఈపీఎఫ్‌ స్కీమ్‌ ప్రకారం, యాక్టివ్‌ పీఎఫ్‌ ఖాతా ఉన్న ఉద్యోగులు తమ LIC జీవిత బీమా పాలసీ ప్రీమియంలను పీఎఫ్‌ నిల్వల నుంచి చెల్లించుకోవచ్చు. ఇది ముఖ్యంగా తాత్కాలిక ఆర్థిక కష్టాల్లో ఉన్నవారికి ఎంతో ఉపయోగకరమైన ఆప్షన్‌. ఉద్యోగం ఉన్న సమయంలోనే కాదు.. ఉద్యోగం మారినప్పుడు లేదా జీతం ఆలస్యమైనప్పుడు.. అత్యవసర ఖర్చులు పెరిగినప్పుడు ఈ ఆప్షన్‌ ద్వారా పాలసీ కొనసాగించే అవకాశం ఉంటుంది.

ఈ సదుపాయం ఎవరు వినియోగించుకోవచ్చు? Eligibility for LIC Premium Payment from PF
ఈ వెసులుబాటును అందరికీ అనుమతించరు. కొన్ని అర్హత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అర్హతలు ఏమిటంటే.. యాక్టివ్‌ పీఎఫ్‌ అకౌంట్‌ ఉండాలి. యూఏఎన్‌ (UAN) యాక్టివేట్‌ అయి ఉండాలి. కనీసం రెండు నెలల వేతనానికి సమానమైన పీఎఫ్‌ నిల్వలు ఉండాలి. బీమా పాలసీ చందాదారుడి పేరుమీదే ఉండాలి. పాలసీ LICదే అయి ఉండాలి. జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరుమీద ఉన్న పాలసీలకు ఈ సౌకర్యం వర్తించదు. ప్రైవేటు బీమా కంపెనీల పాలసీలకు ఈ ఆప్షన్‌ లేదు.

ఏ రకమైన ప్రీమియంలకు ఈ సౌకర్యం? Applicable Premium Payments
ఈ పీఎఫ్‌–LIC లింకింగ్‌ సౌకర్యం వార్షిక ప్రీమియం చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది. నెల, మూడు నెల‌లు, ఆరు నెల‌ల ప్రీమియంల చెల్లింపుల‌కు ఈ సౌక‌ర్యం లేదు. కేవలం Yearly Premium మాత్రమే పీఎఫ్‌ ఖాతా నుంచి డెబిట్‌ అవుతుంది.

ఫారం–14 అంటే ఏమిటి? What is EPF Form 14
పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించాలంటే ఫారం–14 కీలకం. ఫారం–14 ద్వారా LIC పాలసీ వివరాలు, పాలసీ నంబర్
, ప్రీమియం మొత్తం, పాలసీ కాలపరిమితి వంటి వివరాలను EPFOకి అందజేస్తారు. ఈ ఫారం అప్రూవ్‌ అయిన తర్వాతే పీఎఫ్‌ నుంచి డెబిట్‌ జరుగుతుంది.

స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.. Step-by-Step Process to Pay LIC Premium from PF
పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించాలంటే ఈ క్రింది విధంగా చేయాలి:
స్టెప్–1: EPFO అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి ( https://www.epfindia.gov.in)
స్టెప్–2: UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి
స్టెప్–3: KYC సెక్షన్‌లోకి వెళ్లాలి
స్టెప్–4: అక్కడ LIC అనే ఆప్షన్‌ను ఎంపిక చేయాలి
స్టెప్–5: పాలసీ నంబర్, పాలసీ వివరాలు, ప్రీమియం మొత్తం వివ‌రాలు సబ్మిట్‌ చేయాలి
స్టెప్–6: ఫారం–14ను డౌన్‌లోడ్‌ చేసి అవసరమైన చోట సబ్మిట్‌ చేయాలి. పాలసీ వివరాలు లింక్‌ అయిన తర్వాత… ప్రీమియం డ్యూ డేట్‌ వచ్చిన వెంటనే ఆటోమేటిక్‌గా పీఎఫ్‌ ఖాతా నుంచి డెబిట్‌ అవుతుంది

ఈ ఆప్షన్‌ వల్ల లాభాలు.. Advantages of LIC Premium from PF
పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లింపు సౌకర్యంతో ఉద్యోగులకు పలు ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా పాలసీ ల్యాప్స్‌ అయ్యే ప్రమాదం ఉండదు. ప్రీమియం తేదీ మిస్‌ అవదు. బయట రుణం తీసుకోవాల్సిన అవసరం లేదు. అత్యవసర సమయంలో కుటుంబ భద్రత కొనసాగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

కానీ… కొన్ని జాగ్రత్తలు అవసరం! Important Cautions to Note
పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ వినియోగించేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. పీఎఫ్‌ అనేది రిటైర్మెంట్‌ కోసం ఉద్దేశించిన సేవింగ్స్. తరచూ వాడితే భవిష్యత్‌ నిధులు తగ్గిపోతాయి. వడ్డీపై కూడబెట్టే లాభం తగ్గుతుంది. అందుకే “తాత్కాలిక ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు మాత్రమే ఈ ఆప్షన్‌ను వినియోగించాలి” అని..ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఎప్పుడు వాడితే మంచిది? When Should You Use This Option
ఉద్యోగం మారిన సమయంలో, జీతం ఆలస్యమైనప్పుడు, వైద్య ఖర్చులు ఎక్కువైనప్పుడు, తాత్కాలిక నగదు కొరత ఉన్నప్పుడు.. మాత్రమే పీఎఫ్‌–LIC ఆప్షన్‌ సరైన నిర్ణయంగా ఉంటుంది.మొత్తంగా పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించే వెసులుబాటు అనేది ఉద్యోగులకు ఇచ్చిన ఒక ఆర్థిక రక్షణ కవచం. ఇది బీమా కొనసాగింపును సులభతరం చేస్తుంది. అయితే దీన్ని అలవాటుగా మార్చుకోవద్దు. అవసరం ఉన్నప్పుడే వినియోగిస్తే భవిష్యత్‌ భద్రత కూడా కాపాడుకోవచ్చు, కుటుంబానికి బీమా భరోసా కూడా కొనసాగుతుంది. ఆర్థిక క్రమశిక్షణతో నిర్ణయాలు తీసుకుంటే… భవిష్యత్‌ మరింత భద్రమవుతుంది.

199
INSURANCE Tags:Advantages of LIC Premium from PF, Applicable Premium Payments, Eligibility for LIC Premium Payment from PF, Important Cautions to Note, LIC Premium Payment Through PF – How It Works, Step-by-Step Process to Pay LIC Premium from PF, What is EPF Form 14, When Should You Use This Option, Why Life Insurance Is Crucial

Post navigation

Previous Post: వెనిజులాపై అమెరికా దాడి…భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత? US Strikes on Venezuela… How Will the Indian Stock Market Be Affected?
Next Post: పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే… కుటుంబ సభ్యులు చెల్లించాలా? Personal Loan After Death – Who Is Legally Responsible?

Related Posts

  • ఆరోగ్య బీమా.. అన్ని వ‌య‌స్సుల్లో ఆదుకునేలా? Health Insurance – A Lifeline for All Ages! FINICAL PLANNING
  • బీమా రంగంలో కొత్త అధ్యాయం.. ఏప్రిల్ 1 నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు కొత్త రూల్స్.. New Chapter in Insurance Sector: New Rules for Insurance Companies from April 1 INSURANCE
  • 40 ఏళ్ల వ‌య‌సులో రూ.8 లక్షల బీమా సరిపోతుందా? Is ₹8 Lakh Health Insurance Enough at 40? The Reality of Medical Costs INSURANCE
  • రెండు హెల్త్‌ ఇన్సూరెన్స్‌లు ఉన్నాయా? క్లెయిమ్‌లో చిన్న తప్పు చేస్తే భారీ నష్టమే!  Have Two Health Insurance Policies? One Mistake Can Cost You Big!  INSURANCE
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble! INSURANCE
  • ఆరోగ్య బీమా , అత్యవసర నిధిలో ఏది అవ‌స‌రమంటే? Health Insurance vs Emergency Fund – Which Is the Right Choice? INSURANCE

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • మూవింగ్ ఏవ‌రేజ్ అంటే MARKET
  • మ‌దుప‌ర్ల‌కు మ‌రోసారి షాక్‌.. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి! Investors Shocked Again.. ₹7 Lakh Crore Wealth Evaporates! MARKET
  • రాగిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చా? Can You Invest in Copper Too? FEATURE NEWS
  • స్టార్టప్ ప్రయాణం ఎలా ప్రారంభించాలి? స్టార్టప్‌లు ఎందుకు విఫలమవుతాయి? అసలు కారణాలు ఇవే! How to Start a Successful Startup in India | Real Reasons Why Startups Fail FEATURE NEWS
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas MARKET
  • డివిడెండ్ పై ట్యాక్స్ చెల్లించాలా should we pay tax on dividends FEATURE NEWS
  • ట్రంప్ గుడ్‌న్యూస్ .. కుదిరిన ట్రేడ్ డీల్ .. Trump’s Good News: India–US Trade Deal Finalised FEATURE NEWS
  • రిస్క్‌ Vs రాబడి – పెట్టుబడులను ఎంచుకునే సూత్రం Risk vs Reward – How to Choose Your Investments FINICAL PLANNING

Copyright © 2026.

Powered by PressBook News Dark theme