
జీవిత బీమా ప్రాధాన్యం మనకు తెలియంది కాదు. కరోనా తర్వాత అందరూ ఇన్సూరెన్స్ పాలసీవైపు పరుగులు తీస్తున్నారు. జీవితానికి బీమా ఇచ్చే భరోసా ఇంకేదీ ఇవ్వలేదన్న నమ్మకం ప్రజల్లో బాగా కలిగింది. ఈ క్రమంలో బీమా కంపెనీలు కొన్ని సంస్కరణలు కోరుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి తమకు సహకారం అందితే ప్రజలకు మరింతగా సేవలందించగలుగుతామని అంటున్నాయి. ఈ క్రమంలోనే బీమా పాలసీలపై ఉన్న జీఎస్టీరేటును తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలు బీమా కంపెనీలు సూచిస్తున్నాయి.
how much GST on insurance policies
జీవితంలో ఆర్థిక అవసరాలను తట్టుకునేందుకు ప్రతి కుటుంబం తగిన శక్తిని సంపాదించుకోవాల్సి ఉంది. దీనికి తక్కువ ప్రీమియంతో ఉన్న బీమా పాలసీలు ఉపయోగపడతాయి. అదే సమయంలో ఆర్థికంగా సురక్షిత దేశాన్ని నిర్మించేందుకూ ఇది తోడ్పడుతుంది. ఇప్పటికీ దేశంలో బీమా పాలసీల విస్తరణ తక్కువగా ఉంది. బీమా పాలసీలపై జీఎస్టీ విధించడం అంత మంచి విధానం కాదని, జీవిత, బీమా, టర్మ్ పాలసీలపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) రేటును తగ్గించేందుకు ఇదే సరైన సమయమని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. బీమా పాలసీలపై ప్రస్తుతం ఉన్న 18 శాతంగా ఉన్న జీఎస్టీ ని 5 శాతానికి తగ్గించాలని లేదా తీసేయాలని సూచించింది. 2020 -21లో ఆరోగ్య బీమా పాలసీల్లో 28.5 శాతం వృద్ది కనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జనవరిలో 25.9 శాతం వృద్ది చోటుచేసుకుంది.
how many people are under insurance protection
* దేశంలో 20-30 శాతం మంది ఏదో ఒక బీమా రక్షణలో ఉన్నారు. జీవిత, ఆరోగ్య బీమాతో పాటు ఇతర విభాగాల్లోనూ ప్రభుత్వ ప్రామాణిక పాలసీలను ప్రవేశ పెట్టడం ద్వారా ఈ వ్యత్యాసాన్ని తగ్గించొచ్చు.
* దేశంలో బీమా పాలసీలు తీసుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతోందని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది.
what are jana suraksha schemes
ప్రజలందరికీ ఆరోగ్య బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జన సురక్ష పథకాలకు అనుబంధంగా ఆప్ట్-ఇన్ పథకాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ పాలసీలకు చెల్లించే ప్రీమియాన్నిపొదుపు ఖాతా వడ్డీ నుంచి నేరుగా మినహాయించుకునే విధానం ఉండాలి. ప్రస్తుతం ఆరోగ్య బీమా పరిమాణం రూ.60,840 కోట్లుగా ఉండగా అదే సమయంలో పొదుపు ఖాతాలపై వస్తున్న వడ్డీ రూ.1.35 లక్షల కోట్లుగా ఉంది. మహాత్మగాందీ జాతీయ గ్రామీణ హామీ పథకంలో నమోదైన వారందరూ తప్పనిసరిగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాల్లో చేరాలి. దీనికోసం రూ.342 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.